Hyderabad Nampally Fire Accident : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ నాంపల్లిలో బచ్చా క్రిస్టల్ ఫ ర్నిచర్ దుకాణంలో భారీ అగ్నిప్ర మాదం చోటు చేసుకుంది. నాలు గు అంతస్తుల భవనంలో జరిగిన ఈ అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు చి క్కుకున్నారు. సమాచారం అందు కున్న అగ్నిమాపక సిబ్బంది ఫైరింజ న్లతో రంగంలోకి దిగి రెస్క్యూ ఆప రేషన్ చేపట్టాయి. అగ్ని ప్రమాదా నికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉం డొచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ప్రమాద సమయంలో నాలుగు అంతస్తుల భవనంలో ఇద్దరు చి న్నారులతో సహా మొత్తం ఆరుగు రు వ్యక్తులు చిక్కుకున్నట్లు సమా చారం. గ్రౌండ్ ఫ్లోర్ నుండి దట్టమైన పొగలు రావడంతో వారు బయట కు రాలేక పై అంతస్తుల్లోనే ఉండి పోయారు. స్థానికుల ఇచ్చిన సమా చారం మేరకు వెంటనే అగ్నిమాపక సిబ్బంది 4 ఫైరింజన్లతో రంగంలోకి దిగారు. క్రేన్ల సహాయంతో భవనం పైభాగంలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రె స్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమిస్తోంది.
గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా మా రడంతో లోపల ఉన్న వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారిం ది. నాంపల్లి వంటి ఇరుకైన గల్లీలు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫైరింజ న్లు ఘటనా స్థలానికి చేరుకోవడం సవాలుగా మారుతోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగిన నేపథ్యంలో వాణిజ్య సముదా యాల్లో ‘ ఫైర్ సేఫ్టీ ‘ నిబంధనలు పాటించకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ము ఖ్యంగా నివాస గృహాల మధ్య ఇ లాంటి గోడౌన్లు లేదా దుకాణాలు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత పె రుగుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్ర మాదం జరిగి ఉండవచ్చని అను మానిస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స జ్జనార్ సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్ర మాద తీవ్రతను స్వయంగా పరిశీ లిస్తున్నారు. ఇదిలా ఉండగా నాం పల్లి అగ్ని ప్రమాద ఘటనతో చు ట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు భ యాందోళనకు గురవుతున్నారు. దీంతో అధికారులు అవసరమైన జాగ్రత్త చర్యలు చేపడుతూ అప్ర మత్తమవుతున్నారు.
Fire accident in hyderabad Nampally furniture Shop pic.twitter.com/OobhwNpAbq
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) January 24, 2026
