Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Hyderabad Charminar fire : విషాదం, భాగ్యనగరంలో భారీ అగ్నిప్రమాదం,17 మంది దుర్మరణం

Hyderabad Charminar fire : ప్రజా దీవెన, హైదరాబాద్: భాగ్య నగరంలోని చార్మినార్‌ పరిధిలో ఘోర విషాద సంఘటన చోటుచే సుకుంది. చార్మినార్‌కు సమీపం లోని గుల్జార్ హౌస్‌లో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరి గింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన లో 17 మంది మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, న లుగురు మహిళలు ఉన్నారు. ప్ర మాదంతో భవనంలో ఉన్న పలు వురు ఊపిరి ఆడక స్పృహ కోల్పో యారు. దీంతో వారిని ఉస్మాని యా, యశోద (మలక్‌పేట), డీఆర్డీ వో అపోలో ఆస్పత్రులకు తరలిం చారు. కొందరు ఘటనాస్థలంలో మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు.

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అను మాని స్తున్నారు. ఘటనా స్థలానికి అగ్ని మాపక, డీఆర్‌ఎఫ్‌, జీ హెచ్‌ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకుని సహా యక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భవ నంలో ఉన్న మరికొం దరిని బయ టకు తీసుకొచ్చారు. 10 అగ్నిమాప క యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. గుల్జార్‌ హౌస్‌ పరిసరా ల్లో దట్టంగా పొగ కమ్ముకోవడంతో శ్వాస తీసుకునేందుకు స్థానికులు ఇబ్బం దులు పడ్డారు.

మృతుల వివరాలు ఇలా …

రాజేంద్రకుమార్‌ (67), అభిషేక్‌ మోదీ (30), సుమిత్ర (65), మున్నీ బాయి (72), ఆరుషి జైన్‌ (17),శీతల్‌ జైన్‌ (37), ఇరాజ్‌ (2), హర్షా లీ గుప్తా (7), రజని అగర్వాల్‌, అ న్య మోదీ, పంకజ్‌ మోదీ,వర్ష మో దీ, ఇదిక్కి మోదీ, రిషభ్‌, ప్రథమ్‌ అగర్వాల్‌, ప్రాంశు అగర్వాల్‌ లు , ఉన్నారు.

సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి… అగ్ని ప్రమాద ఘటనపై సీఎం రేవం త్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నా రు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. క్షతగా త్రులకు మెరుగైన వైద్యం అందిం చాలని అధికారులను సీఎం ఆదే శించారు. మరోవైపు ఘటనా స్థలా న్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పరిశీ లించారు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జీహె చ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయ లక్ష్మి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి త దితరులు ప్రమాద స్థలాన్ని పరి శీలించారు.


అగ్నిమాపక సిబ్బందికి సరైన శిక్షణ అందించాలి: కిషన్‌రెడ్డి
గుల్జార్‌హౌస్‌ వద్ద ఘటనాస్థలాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీ లించా రు. అధికారులతో మాట్లాడి పరి స్థి తి తెలుసుకున్నారు. ఆదివారం ఉ దయం 6 గంటలకు ప్రమాదం జరి గిందని చెప్పారు. సహాయక చర్య ల్లో అగ్నిమాపక సిబ్బంది ఆలస్యం చేశారని బాధి తులు ఆరోపిస్తున్నా రని తెలిపారు. చిన్న ప్రమాదమే అ యినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు.

అగ్నిమాపక సిబ్బందికి ప్రభు త్వం సరైన పరికరాలు, శిక్షణ అం దించాల్సి ఉందని చెప్పారు. అగ్నిమాపక శాఖ సాంకేతికతను మె రుగుపరుచుకోవాలని అభిప్రా యపడ్డారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాల న్నారు. బాధిత కుటుంబాలకు కేం ద్రం తరఫున సాయం అందిస్తామ ని తెలిపారు. క్షతగాత్రులకు మెరు గైన వైద్యం అందించాలని అధికా రులను ఆదేశించారు.