Mastu …mastu ‘liquor’ మస్తు …మస్తు ‘ మద్యం ‘
-- వైన్స్ లైసెన్సుల కోసం అనూహ్య స్పందన --రాష్ట్రవ్యాప్తంగా 2620 షాపులకు లక్షా12,500 ల దరఖాస్తులు
మస్తు …మస్తు ‘ మద్యం ‘
— వైన్స్ లైసెన్సుల కోసం అనూహ్య స్పందన
—రాష్ట్రవ్యాప్తంగా 2620 షాపులకు లక్షా12,500 ల దరఖాస్తులు
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారం మస్తు మస్తుగా జోరుమీదుoది. ఎన్నికల సమయం కావడంతో మూడు మాసాల ముందే రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు వేలం నోటిఫికేషన్ జారీ చేయగా ప్రభుత్వం ఆశించిన మేర స్పందన కాన వచ్చిందని చెప్పవచ్చు.
మద్యం దుకాణాల దరఖాస్తులకు అనూహ్య స్పందన వచ్చింది. చివరిరోజు శుక్రవారం పొద్దుబోయిన తర్వాత వరకు నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు.
రాత్రి వరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తం గా 1,12,500 దరఖాస్తులు రావడం విశేషం కాగా అత్యధికంగా శంషాబాద్‌లో 8,409 కాగా, అత్యల్పంగా నిర్మల్‌లో 657 దరఖాస్తులు రావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలోనే గడిచిన రెండేండ్ల క్రితం 79 వేల దరఖాస్తులు రాగా ఈసారి వాటి సంఖ్య భారీగా పెరగడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాల కోసం ఈ నెల 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది.దీంతో డ్రాలో పాల్గొనే వారు రూ.2 లక్షల చలాన్ (డీడీ)తో దరఖాస్తులు సమర్పించారు. ఈ నెల 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.
డ్రా ద్వారా గౌడలకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 చొప్పున దుకాణాలను కేటాయించారు. మిగతా 1,864 మద్యం దుకాణాలు ఓపెన్ క్యాటగిరీ కింద ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.