ప్రజా దీవెన, కోదాడ: స్థానిక తేజ టాలెంట్ స్కూల్ యందు శనివారం శ్రీనివాస రామానుజన్ జన్మదినం డిసెంబర్ 22ను పురస్కరించుకొని, ఒకరోజు ముందుగానే, గణితశాస్త్ర దినోత్సవంను నిర్వహించుకున్నారు.పాఠశాలలో మ్యాథ్స్ గార్డెన్ ను ఏర్పాటు చేసినారు. గార్డెన్ యందు గణితానికి సంబంధించిన అన్ని రకాల ఆపరేషన్, సూత్రాలు జియోమెట్రికల్ షేప్స్, ను ప్రదర్శించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పాఠశాల ఆవరణంతట విద్యార్థులు కలియ తిరుగుతూ, గణితాన్ని నిత్య జీవితాన్ని అన్వయించుకున్నారు. పాఠశాలలో ఒక్కొక్క విద్యార్థి సగటున ఎన్ని లీటర్ల నీరు త్రాగుతారో డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ ద్వారా తెలుసుకొని వివరించారు.రెండో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులు ఆధ్యాంతం అందరిని అలరించారు.
రోజంతా రామానుజన్ జీవిత విశేషాలు, అతని ఫార్ములాలు గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గణిత క్లబ్ మెంబర్, గణితవిద్యార్థులు,ఉపాధ్యాయులు గోపి,రఘు,వీరభద్రం,నవ్య,పద్మజ,రాంబాబు మరియు ప్రిన్సిపాల్ అప్పారావు వైస్ ప్రిన్సిపల్ సోమనాయక్ ఇన్చార్జులు రామ్మూర్తి,రేణుక పాల్గొన్నారు.