MD Salim Sharif:ప్రజా దీవెన, కోదాడ: ప్రభుత్వ పాఠశాల సర్వతోముఖా భివృద్ధికి, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు పనిచేయాలని వారితో పాటు తల్లిదండ్రులు విద్యాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ (MD Salim Sharif)పిలుపునిచ్చారు శనివారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉపాధ్యాయుల తల్లిదండ్రుల సమావేశంలో (Parents teachers meeting)పాల్గొని మాట్లాడారు .
పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు (students)మంచినీటి వసతి సదుపాయం, మధ్యాహ్న భోజనం రుచి శుచి గా ఉండాలని విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల కృషి చేయాలని తల్లిదండ్రులు తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. విద్యార్థుల హాజ రు, ప్రవర్తన, పాఠశాల లో వసతుల కల్పన, అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది. ప్రతినెల మూడవ శనివారం తల్లిదండ్రులు సమావేశానికి హాజరు కావాలని కోరారు అలాగే ప్రభుత్వ పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మార్కండేయులు మాట్లాడుతూ, ఇంటిదగ్గర విద్యార్థులను తల్లిదండ్రులు చదివించడానికి శ్రద్ధ వహించాలని పరీక్ష సమయాలలో తమ పిల్లలను శ్రద్ధగా చదివించి మంచి ఫలితాలు (good results) వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లింగయ్య, రామకృష్ణ, పూర్ణచంద్రరావు, బడుగుల సైదులు, జానకి రామ్, పాండు రంగయ్య, వీర బ్రహ్మచారి, వేణు, నరసయ్య, ముక్తర్, హేమలత, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.