mediaacademychairman : విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్ని అలవర్చుకోవాలి
-- తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
mediaacademychairman: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, మహనీయుల జయంతి ఉత్స వాల 3వ రోజున “21వ శతాబ్దంలో సా మాజిక న్యాయ పునః పరి శీలన” అంశంపై జరిగిన సింపోసియముకు తెలంగాణ అకాడ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, హైదరాబా ద్ కేంద్రీయ విశ్వవిద్యా లయం ఆ చార్యులు వెంకటేష్ ముఖ్య అతి థులుగా విచ్చేసి ప్రసం గించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ మౌ లిక లక్ష్య మైన స్వేచ్ఛ సమానత్వం సోదర భావం సాధనకు మహ నీయుల భావాజాలాన్ని పోరాట మార్గంలో పూర్తి పొందాలన్నారు.
సమాజంలో అనేక అపసవ్య ధోరనులలో మౌనం కాక ప్రశ్నలుగా విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ప్రపంచికరణ వినిమయ తత్వం, పెట్టు బడిదారీ మాయాజాలంలో బ్రతుకులు నానాటికి దిగ జారుతున్నక్రమం సమాంతరంగా సామాజిక సంరక్షణ ప్రోత్సాహకా లైన రిజర్వేషన్లు ఇతరత్రా పథకాలలో కోత మరింత దుర్భలత్వం లోకి నెట్టే అంశాలుగా గుర్తించాలన్నారు.
దక్షత బాధ్యతతో జవాబుదారీతనంతో పాలనను అందించే ప్రభు త్వాలను ఎన్నుకోవడంలో విద్యా వంతుల పాత్ర కీలకమన్నారు. ప్ర జాస్వామ్యంలో ప్రజలే నిజమైన హ క్కుదారులన్న సత్యాన్ని గ్రామ గ్రా మాల చేర్చాల్సిన బాధ్యత అందరి పై ఉందన్నారు. అంబేద్కర్ స్ఫూ ర్తి గా అధ్యయనం పోరాటాలు స మాంతరంగా పరస్పర ప్రేరి తాలుగా ఉండాలని కోరారు.
అనంతరం కేంద్రీయ విశ్వవిద్యా లయ ఆచార్యులు వెంకటేశు పేద రికం కేవలం ఆర్థిక కోణంలో కాక సామాజిక కోణంలో పరిశీలించి త గు పథకాలను రూపొందించాలని, సామాజిక పెట్టుబడి, మౌలిక వస తులు, ఆర్థిక వృద్ధి, పునః పంపిణీ వనరుల సంపద, ఐదు అంశాల పై దృష్టి సారించాలని సూచించారు. పారదర్శకత, వికేంద్రీకరణ విధానాల రూపకల్పనలో తెలంగాణ యో ధులు ఆచార్య శివయ్య, పీవీ నరసింహారావు, జి వెంకట స్వా మిల పాత్రను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, స భాద్యక్షులు డా కే ప్రేమ్సాగర్, ఉత్సవాల కమిటీ చైర్మన్ ఆచార్య కొ ప్పుల అంజిరెడ్డి,డా మద్దిలేటి డా శ్రీదేవి, అరు ణప్రియ, డా కళ్యాణి, డా వై ప్రశాం తి, మారం వెంకట రమణారెడ్డి, త దితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.