ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్
Medical camps: ప్రజా దీవెన మునుగోడు: అక్టోబర్ 10 మండల పరిధిలోని ప్రజలు వైద్య శిబిరాలను (Medical camps) ఉపయోగించుకోవాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ తరుణ్ కోరారు మంగళవారం రోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో లక్షణాపురం ప్రాజెక్టు ఏరియాలో వైద్య శిబిరం నిర్వహించారు శిబిరంలో భాగంగా ప్రాజెక్టు ఆవరణలో కార్మికులను చుట్టుపక్కల నివసిస్తున్న రైతులను గ్రామాల ప్రజలకు వైద్య పరీక్షలు (Medical tests)నిర్వహించారు. అందులో 125 మంది రోగులకు మందులు పంపిణీ చేశారు అనంతరం డాక్టర్ తరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ టీవీ తెమడ పరీక్షలు (TV Themada Exams)చేయించుకోవాలని షుగర్ బిపి రక్త పరీక్షలు మండల ఆరోగ్య కేంద్రంలో ప్రతిరోజు చేయబడునని చెప్పారు వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలమని ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించి శరీరంపై షడ్ర వహించాలన్నారు ప్రాజెక్టు ఏరియాలో టీబీ కేసులు జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు హిజరాత్ కళ్యాణ్ వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్లు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు