Medical personnel should be fully prepared వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధoగా ఉండాలి
మంత్రి హరీష్ రావు సమీక్ష
వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధoగా ఉండాలి
మంత్రి హరీష్ రావు సమీక్ష
ప్రజా దీవెన/హైదరాబాద్:రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల(rain)నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సన్నద్ధత ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు(harish Rao) గురువారం సమీక్షించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు వైద్య సేవలు(services) అందించడంలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలి. సబ్ సెంటర్ స్థాయి నుంచి హైదరాబాద్(hydarabad) నగరంలోని ప్రధాన ఆసుపత్రుల వరకు వైద్య సిబ్బంది పూర్తి సంసిద్ధతతో ఉండి ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలి.
ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించే విషయంలో అవసరమైతే హెలికాప్టర్ సేవలు వినియోగించేందుకు ప్రభుత్వం(government)సిద్ధంగా ఉంది. ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు గాను రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెవల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ 040-24651119 ఏర్పాటు. 108, 102 వాహన సేవలు పూర్తి స్థాయిలో వినియోగించాలి. గర్భిణులు, డయాలసిస్ పేషెంట్లకు వైద్య సేవలు అందించే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ (minority)ఆయా పరిధిలోని ఏఎన్ఎం, మెడికల్ ఆఫీసర్స్ వెళ్లి సందర్శించాలని, కలుషిత ఆహారంపై అవగాహన పెంచాలి.” అని మంత్రి హరీశ్ రావు అన్నారు.