— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Medical Profession : ప్రజా దీవెన, నల్లగొండ: సమాజం లో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్య వృత్తి అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఆపద సమ యంలో ప్రజలందరికీ ఆపద్బాంధ వుడిలా కనిపించే వైద్యులను ప్రజ లు ఎంతగానో గౌరవిస్తారని, ఆరో గ్యమే మహా భాగ్యమని మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభ వించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృధా అని, అనారోగ్యంతో బాధప డే వారిని ప్రమాద స్థితి నుంచి కాపా డే శక్తి కేవలం వైద్యునికే ఉందని అ న్నారు. డాక్టర్ వృత్తిని ఇతర వృత్తు లతో పోల్చుకోలేమని తెలిపారు.
జాతీయ డాక్టర్ల దినోత్సవాన్ని పుర స్కరించుకొని మంగళవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో ఉత్త మ సేవలందించిన డాక్టర్లను శాలు వా జ్ఞాపికలతో సన్మానించారు. డా క్టర్లు సమాజానికి ఎంతో విలువైన సేవలు అందిస్తారని, మానవతా దృక్పథంతో చేసే పవిత్రమైన వృత్తి లో డాక్టర్లు ఉండడం వారి అదృష్ట మని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న డాక్టర్లు మం చి సేవలు అందిస్తున్నారని కితా బునిచ్చారు.
ఈ సేవలను ఇలాగే కొనసాగించడ మే కాకుండా, మానవత్వాన్ని స్పృ శించే విధంగా సేవలందించాలని కోరారు. భవిష్యత్తులో జిల్లా ప్రజల కు ఇంకా మంచి వైద్య సేవలు అం దించి అందరి మన్ననలను పొందా ల్సిందిగా ఆమె కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ డాక్టర్ మాతృ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్వోలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఇతర డాక్టర్లు ఉన్నారు.