Medicalofficer : ప్రజా దీవెన,కోదాడ: అనుమతులు లేకుండా హాస్పిటల్స్ ను నిర్వహిస్తున్న నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ కోటచలం అన్నారు శుక్రవారం పట్టణంలోని తేజా పిల్లల హాస్పిటల్ స్వప్న స్కాన్ సెంటర్ ధరణి ప్రైవేట్ హాస్పిటల్ లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడాడు ప్రతి హాస్పటల్లో అర్హత పొందినటువంటి డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహించాలని శిక్షణ పొందిన సిబ్బంది మాత్రం సేవలు నిర్వహించాలని అన్నారు ప్రతి ఒక్క హాస్పిటల్లో బయోమెడికల్ వేస్టేజ్ పొల్యూషన్ బోర్డు సర్టిఫికెట్లలో ఫైర్ ఎక్విప్మెంట్ ట్రీట్మెంట్ ధరల పట్టిక బోర్డులను ఏర్పాటు చేయాలని తెలిపారు.
బెడ్స్ నిర్వహణ పరిమితి సక్రమముగా నిర్వహించాలని ల్యాబ్ ఫార్మసీ తనిఖీలను నిర్వహించి డాక్టర్లు ఆయా రోగుల కు అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు చికిత్స పొందుతున్న రోగులకుఅందిస్తున్న ట్రీట్మెంట్ గురించి అడిగి తెలుసుకున్నారు ప్రవేట్ హాస్పిటల్ లో పనిచేస్తున్న డైరెక్టర్లు డాక్టర్లు సిబ్బంది ఏ ఒక్కరు మారిన తప్పనిసరిగా వైద్యశాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కె మనోహర రాణి తదితరులు పాల్గొన్నారు