Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Mega medical camp:ఉచిత మెగా వైద్య శిబిరం

“ఉచిత మందుల పంపిణీ
Mega medical camp:ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ పరిధిలోని స్థానిక తమరబండపాలెంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ద్వారా ఇమ్మానుయేలు మెమోరియల్ ట్రస్ట్ (Memorial Trust)వ్యవస్థాపకులు జవ్వాజి.జెస్సి కుమార్ ఆధ్వర్యంలో న్యూ లైఫ్ చర్చ్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం (Mega medical camp)నిర్వహించారు.ఈ వైద్య శిబిరంలో 300 మందికి ఉచితంగా ఎటువంటి డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు లేకుండా రక్త పరీక్షలు, బిపి , షుగర్, ఎక్స్-రే, ఇ సి జి, కంటి పరీక్షలు మరియు అద్దాలు పంపిణీ చేసినట్లు మెడికల్ క్యాంపు టీమ్ లీడర్ జంగా జయరాజు తెలిపారు.ఈ మెడికల్ క్యాంపులో ఎక్సరే మరియు ఈసీజీ, పంటి పరీక్షలు (ECG, dental exams)చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.

డాక్టర్స్ :- స్నేహ లత, భరత్, అజయ్, మనోజ్, సంపత్ ,మరియు ఆశ్రయం పారామెడికల్ స్టాఫ్, మరియుల్యాబ్ టెక్నీషియన్స్ :-, కుసుమ ఫార్మసీ : స్వామి, సమూయేలు, నరసింహ, x Ray : శిరీష్, రవి, సుబ్రహ్మణ్యం మరియు న్యూ లైఫ్ అపోస్టాలిక్ చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ కె.శ్యామ్ సుందర్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.