Mekala Srinivasa Rao:కోదాడ ప్రభుత్వ దవాఖానాలో ఖాళీగా ఉన్న డాక్టర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి :.మేకల శ్రీనివాసరావు
Mekala Srinivasa Rao:ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు ,ఇతర సిబ్బంది పోస్టులను (post) వెంటనే భర్తీ చేయాలిని ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు (Mekala Srinivasa Rao)ప్రభుత్వాన్ని డిమాండ్ (demands) చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూఅనేక సంవత్సరాలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి డాక్టర్ మరియు ల్యాబ్ టెక్నీస్ (Lab Technicians)ఇతర సిబ్బందిని తక్షణమే నియమించాలని ఆయన కోరారు నియోజకవర్గ కేంద్రమైనటువంటి కోదాడ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ లేకపోవడం నిత్యం జాతీయ జాతీయ రహదారి పైన ప్రమాదాల జరుగుతున్నప్పటికీ ఆర్థోపెడిక్ డాక్టర్ లేకపోవడం నియోజకవర్గ కేంద్రం లో ఉన్న హాస్పటల్ కు వేలాదిమంది రోగులు వస్తున్నారని వారికి అందుబాటులో వైద్యం లేదని కారణం డాక్టర్లు మరియు సిబ్బంది లేకపోవడం 16 మంది డాక్టర్లకు గాను నలుగురు మాత్రమే పనిచేస్తున్నారని మిగతావన్నీ ఖాళీగా ఉన్నాయని తక్షణమే కాలిని భర్తీ చేయాలని ఆయన డిమాండ్ (Demand)చేశారు.
ఈ ఈ సందర్భంగా ఏఐటీయూసీ అనుబంధ సంఘం మెడికల్ కాంట్రాక్టర్ శానిటైజర్ వర్కర్స్ (Medical Contractor Sanitizer Workers)ఆధ్వర్యంలో కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ కు బదిలీ అయి ఇంచార్జి సూపర్డెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ దశరథకు భద్రాచలం నుండి బదిలీ అయి కోదాడ హాస్పిటల్ కు పిల్లల డాక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి లను పూలమాల సాలవులతో సత్కరించారు కార్యక్రమంలో ఏఐటీయూసీ అనుబంధ నాయకులు బంక స్రవంతి. బాలు ,షేక్ రఫీ ,నాగరాజు, వెంకమ్మ, తదితరులు పాల్గొన్నారు