membership distribution event : ప్రజాదీవెన, సూర్యా పేట : గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ సభ్యత్వ నమోదు విస్తృతంగా చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చీకూరి సత్యం గౌడ్ అన్నారు.
ఆదివారం జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు బూర రా ములు గౌడ్ అధ్యక్షతన సాయి గౌతమి జూనియర్ కాలేజీలో నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలో పేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. త్వరలో నియోజక వర్గాల వారీగా కమిటీలు వేయాలని జిల్లా కమిటీకి సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు నాతి సవీందర్, ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరగాని లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు నామాల గురుమూర్తి,, కోశాధికారి అయితబోయిన రాంబాబు, జాయింట్ సెక్రటరీలు రాపర్తి మహేష్ కుమార్,భూపతి నారాయణ, అంతటి వెంకన్న, దొరేపల్లి రమేష్, ఈసీ సభ్యులు కొత్త పుల్లయ్య, బూర సుధాకర్,, భూపతి వెంకటయ్య, ఉయ్యాల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.