MEO Salim Sharif: ప్రజా దీవెన ,కోదాడ: పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం పాఠశాల విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ పాటలతో (Bathukamma songs) ముందస్తుగా సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ (MEO Salim Sharif) పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండుగ అని బతుకమ్మ పండుగ విశిష్టతను చిన్నారులకు తెలియజేసేలా పాఠశాలలో బతుకమ్మ పండుగ నిర్వహించడం జరిగిందన్నారు. అనంతరం బతుకమ్మ పాటలతో పాఠశాల ఉపాధ్యాయులు, చిన్నారుల ఆటలతో పాఠశాలలో పండుగ వాతావరణం (Festive atmosphere) నెలకొన్నది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మార్కండేయ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.