Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MG University : ఎంజి యూనివర్సిటీ వీసీ అప్పీల్, నాక్ ఏ గ్రేడ్ లక్ష సాధనగా ప్రణాళికలు సిద్ధపర్చాలి 

MG University : ప్రజా దీవెన నల్లగొండ: మూడో విడ త న్యాక్ గ్రేడింగ్ లో ఏ ర్యాంక్ సా ధించే దిశగా ప్రణాళికలు సిద్ధపర చాలని అధ్యాపకులకు ఉపకులప తి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ సూచించారు. నెక్ కు అందించే సె ల్ఫ్ స్టడీ రిపోర్ట్స్ లోని అంశాలపై అ ధ్యాపకులు క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండి తద్వారా తమ విభా గాల ప్రత్యేకతల అనుసారం ముం దుకు సాగాలన్నారు. ప్రతి విభాగం విధిగా వర్క్ షాపులు, సెమినార్ల నిర్వహణతో పాటు పరిశోధనల వైపు విద్యార్థులను ప్రోత్సహించా లని, అధ్యాపకులు సైతం పరిశోధ నల్లో నిమగ్నం అవ్వాలని సూచిం చారు.

 

పిహెచ్డి పరిశోధక విద్యార్థులు తమ పరిశోధన కాలంలో కనీసం రెండు పరిశోధన పత్రాలను సమర్పించా లని ఆ దిశగా అధ్యాపకులు ప్రోత్స హించాలని సూచించారు. గతంలో రూపొందించిన కోర్సు ఉద్దేశాలు ప్రో గ్రాం ఉద్దేశాల దృక్కోణంలో పరీక్షల ప్రశ్నాపత్రాలను రూపొందించడం ద్వారా మూల్యాం కణములో ప్రతి బింబిస్తుందన్నారు. ఈ విద్యా సంవ త్సరం నుండి ఉత్త మ విద్యార్థులు మరియు ఉత్తమ అధ్యాపకులను శాఖల వారీగా ఎంపిక చేయనున్న ట్లు ఆయన తెలిపారు.

 

అధ్యాపకుల సమయ పాలనతో పాటు స్థానికంగా ఉంటూ విద్యా ర్థులకు సహాయకారిగా సమాలోచ నలు జరుపుతూ వివిధ అంశాలపై చర్చలకు సిద్ధపరచాలని సూచిం చారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రా ర్ ఆచార్య అలువాల రవి, సి ఓ ఈ డా ఉపేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డా కె ప్రేమ్సాగర్, డా కె అరుణప్రియ, సిహెచ్ సుధారాణి, డా శ్రీదేవి, ఆ చార్య రేఖ, ఆచార్య అంజిరెడ్డి, ఆ చార్య ఆకుల రవి, డా హరీష్ కు మార్, డా వై ప్రశాంతి డా మిర్యాల రమేష్, డా వెంకటరమణారెడ్డి త దితర అధ్యాపకులు పాల్గొన్నారు.

 

 

*ఎంజియూ వివిధ విభాగాల బో ర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ నియామ కం* …..మహాత్మా గాంధీ విశ్వవి ద్యాలయం వివిధ విభాగాలలో సిలబస్ కూర్పు, పాఠ్యాంశాల రూ పకల్పన, పరీక్షల నిర్వహణ విధా నం వివిధ విద్యాంశాల ప్రణాళిక రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషిం చనున్న బో ట్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ ల ను నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలు వాల రవి ఉత్తర్వులు జారీ చే శారు.

 

బిజినెస్ మేనేజ్మెంట్ విభాగ బి ఓ ఎ స్ గా మారం వెంకటరమ ణారెడ్డి, సోషల్ వర్క్ డా శ్రీధర్ ఉ స్మానియా విశ్వవిద్యాలయం, హి స్టరీ అండ్ టూరిజం విభాగానికి ఆ చార్య కే విజయబాబు కాకతీయ విశ్వ విద్యాలయం, పబ్లిక్ అడ్మిని స్ట్రేషన్ కు ఆచార్య ఏ వి ఎన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక వి శ్వవిద్యాలయం, హైదరాబాద్ ని యమిస్తూ ఉత్తర్వులు జారీ చేశా రు. వీరు రెండు సంవత్సరాల పా టు ఆయా శాఖలకు సేవలందించ నున్నారు. ఈ సందర్భంగా ఉపకుల పతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సే న్ మాట్లాడుతూ అధునాతన సాం కేతికత మరియు సామాజిక పోకడ ల స్పృహతో ప్రణాళికలు రచించి అమలు ద్వారా అత్యుత్తమ ఫలి తాలను సాధించవచ్చు అన్నారు.

 

*20 అంశాలలోఅంతర కళా శా లల ఆటల పోటీల నిర్వహణ…*

 

2025-26 విద్యా సంవత్సరానికి గాను మహాత్మా గాంధీ విశ్వ విద్యా లయ పరిధిలోని కళాశాలల విద్యా ర్థిని విద్యార్థులకు 20 అంశాలలో ఆటల పోటీలను నిర్వహించనున్న ట్లు స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డా హరీష్ కుమార్ తెలిపారు. కళాశాలల ప్రి న్సిపాల్ లు విశ్వవిద్యాలయాల సూచన తమ విద్యార్థుల జాబితా ను సిద్ధపరచి స్పోర్ట్స్ బోర్డ్ కు ఆగ స్టు 15లోగా అందజేయాలని కో రారు. విద్యార్థుల జాబితాను అ ధికారికంగాusbmguict2025@gmail.çom మెయిల్ ద్వారా పంప వచ్చని తెలిపారు.