MGU Arts College :ప్రజాదీవెన నల్గొండ టౌన్ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ ఆర్ట్స్ కళాశాల వద్ద ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ దిష్టి బొమ్మ ను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా యూనివర్సిటీ అధ్యక్షులు హనుమాన్ మాట్లాడుతూ హిందూ పర్యాటకులే లక్ష్యంగా జమ్మూ కాశ్మీర్ లో లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు పిల్ల కాకి అయినటువంటి టిఆర్ ఫ్ ఉగ్రవాదులు ఆర్మీ యూనిఫామ్ లో వచ్చి మతం అడుగుతు కాల్పులు జరిపి అతి కిరాతకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశాంతంగా మారిన కాశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడి 27 మంది అమాయక హిందువుల ప్రాణాలు తీసారన్నారని ఆరోపించారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఉగ్రవాదులను వదిలిపెట్టకుండ బహిరంగంగా ఉరితీసి ఉగ్రవాదాన్ని హత మార్చాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా ఎల్లప్పుడూ సెక్యూలర్ అని చెప్పుకోబడే మేధావులు,రాజకీయ నాయకులు ఈ సంఘటన పైన ఎందుకు నోరు తెరువట్లేదని ప్రశ్నించారు.ఇకనైనా హిందవులు మేలుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీస్ కో కన్వీనర్ మౌనేశ్వర్ చారి, యూనివర్సిటీ ఉపాధ్యక్షులు సూర్య, విజయ్, యూనివర్సిటీ సంయుక్త కార్యదర్శి వెంకటేష్, విద్యార్థి నాయకులు దినేష్, జావేద్, మహేందర్, ప్రదీప్, లోకేష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు.