Praja Deveena
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 11:50 am Posted by : praja deveena

MGU Vice-Chancellor Altaf Hussain : ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ అప్పీల్, విద్యార్థులు వైజ్ఞానిక దృ క్పథాన్ని అలవర్చుకోవాలి 

MGU Vice-Chancellor Altaf Hussain : ప్రజా దీవెన, నల్లగొండ: ప్రకృతి,వై జ్ఞానికత మరియు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని నినాదంతో, విజ్ఞాన దర్శిని సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా సాగుతున్న ప్ర కృతి విజ్ఞాన యాత్ర సోమవారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాల యా నికి చేరుకుంది.ఎన్ఎస్ఎస్ ఆధ్వ ర్యంలో ఎంజియు సెమినార్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ఉప కులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్,ప్రకృతి కవి ఉద్యమకా రుడు జయరాజ్, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు రమేష్ ముఖ్య అ తిథులుగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఉపకులపతి మా ట్లాడుతూ ప్రతి విద్యార్థి హేతుబద్ధ త వైజ్ఞానిక దృక్పథాన్ని అలవర్చు కోవాలని పిలుపునిచ్చారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం, లోతైన పరిశీలన,సామాజిక అన్వ యింపు ద్వారా శాస్త్రజ్ఞులుగా రూ పొంది దేశ సేవ చేయవచ్చన్నారు.

అనంతరం కవి, వాగ్గేకారుడు, ఉ ద్యమకారులు జయరాజ్ మాట్లా డుతూ మానవాళి మనుగడ ప్ర కృతితో మమేకమై సయోధ్యతో మెలిగినప్పుడే సాధ్యమవుతుంద ని, ప్రతి ఒక్కరూ ప్రకృతి స్పృహ క లిగి ప్రకృతి అనుకూలమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి అ న్నారు. కృతజ్ఞతా పూర్వకంగా జీ వించడం, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించినప్పు డే ప్రకృతి సమతుల్య సాధ్యమవు తుందన్నారు.

రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రా లు, హక్కులతో పాటు బాధ్యత ల ను సైతం ప్రతి పౌరుడు గుర్తెరిగి ప్ర వర్తించాలని పిలుపునిచ్చారు. అ నంతరం విద్యార్థులు అధ్యాపకు లతో ప్రకృతి- రాజ్యాంగ పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం విజ్ఞాన దర్శిని వ్యవస్థాపకులు ర మేష్ మాట్లాడుతూ మానవ మ నుగడ వైజ్ఞానిక ఆవిష్కరణలపై ఆ ధారపడి ఉందన్నారు. అనేక స వా ళ్లను సైన్స్ పరిష్కారాలు చూపి మానవ మనుగడ సుగమం చేసిన ఉదంతాలను ఆయన విద్యార్థుల కు వివరించారు. మహనీయుల త్యాగ ఫలాలను రాబోవు తరాల కు బాధ్యతగా అందించాల్సిన గు రుతర బాధ్యత విశ్వవిద్యాలయా లపై ఉందన్నారు.

ప్రతి విద్యార్థి జాతీయ భావాలతో, స్వలాభాలను వదిలి సేవా కార్యక్ర మాల్లో నిమగ్నం అయ్యే అవకాశా లు ఎన్ఎస్ఎస్ ద్వారా సాధ్యమ ని, ఈ కార్యక్రమాల్లో ప్రతి విద్యార్థి పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంజి ఈశ్వర లిం గం నేత్రదానం మరియు రక్తదానం ప్రాముఖ్యతను విద్యార్థులకు వివ రించారు. ఈ కార్యక్రమంలో విజ్ఞా న దర్శని రాష్ట్ర ప్రతినిధి సురేష్ కు మార్, స్వరాజ్యం, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డా మారం వెంకటర మ ణారెడ్డి, డా జక్క సురేష్ రెడ్డి, ఎన్ ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు డా ష రీఫ్, డా కిరణ్ మై, రమేష్ నాయక్, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.