
Minister Adluri Laxman : ప్రజా దీవెన, నకిరేకల్: రోడ్డు ప్రమాదాలు జరగకుండా పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన క ల్పించాల్సిన అవసరం ఉందని రా ష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాం గుల సంక్షే మ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇ న్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మార్ అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్ర ణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభు త్వం ఈనెల 13 నుండి 18 వరకు అరైవ్ అలైవ్ కార్య క్రమం నిర్వహి స్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగం గా బుధవారం నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేం ద్రం లో జిల్లా పోలీస్,రవాణాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వ హించిన అరైవ్ అలైవ్ అవగాహన కార్య క్రమంలో ఆయన మాట్లాడారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి న అవసరం ఉందని, ముఖ్యంగా మోటార్ సైకిల్ పై వెళ్లే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని, అలాగే కార్ల లో వెళ్లేవారు సీటు బెల్టు ధరించా లని చెప్పారు. వాహనాలపై వెనుక ఉన్నవారు సైతం హెల్మెట్లు ధరించా లని అన్నారు. పోలీసు అధికారు లు రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించి జాతీయ రహదారు లు, ఇతర రహదారులపై అతి వేగం తో వెళ్లే వాహనాలను నియంత్రిం చేందుకు పెట్రోలింగ్ పెంచాలన్నా రు. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ రహదారి భద్రతపై దృష్టి సారించాలన్నారు.
ఈ విషయంపై అందరికీ అవగాహన కల్పిస్తే రహదారి ప్ర మాదాలు తగ్గుతాయన్నారు. నల్లగొండ జిల్లాలో అండర్ పా స్ రహదారుల నిర్మా ణానికి ప్రతిపాదనలు పంపిస్తే రా ష్ట్ర ముఖ్యమంత్రి తో మాట్లాడి ని ధులు మంజూరు చేయిస్తాన ని, అ లాగే నకిరేకల్ లో స్థలం చూపిస్తే డాక్టర్ బి.ఆర్ అంబే ద్కర్ భవనాని కి నిధులు మంజూరు చేస్తామని మంత్రి తెలి పారు.
రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి మాట్లా డుతూ రాష్ట్రంలో హత్యల తో పోలి స్తే రోడ్డు ప్రమాదాలలో చనిపోయే వారి సంఖ్య ఎ క్కువగా ఉందని, రో డ్డు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో ఉం చుకొని ప్రతి ఒక్కరూ రోడ్డు భ ద్రత నియమాలు పాటించా లని కోరారు.ప్రజాపాలన- ప్రగతి ప్రణా ళి క 99 రోజుల కా ర్యాచరణ ప్రణాళి కలో భాగంగా ప్రత్యేకించి రహదారి భద్ర తపై అలైవ్ అరైవ్ కార్యక్రమా న్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిం చడం జరుగుతున్నదని, పోలీసు, ట్రా న్స్పోర్ట్ శాఖల సం యుక్త ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్ర మం ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అ వగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా సంవత్సరానికి 8 00 మంది హత్యలకు గు రైచని పో తుండగా రోడ్డు ప్రమాదాలలో 75 00 మంది చని పోతున్నారన్నారు. నల్గొండ జిల్లాలో హత్యల కారణంగా 24 మంది చనిపోతే రోడ్ యా క్సిడెంట్లలో 325 మంది చనిపో తున్నారని, సూర్యాపేట జిల్లాలో హ త్యల కారణంగా 25 మంది, రోడ్డు ప్రమాదాలలో 230 మంది గత సం వత్సరం చనిపోయినట్లు ఆయన గణాంకాలు వివరించారు. అన్ని శా ఖల సమన్వయంతో వీటిని త గ్గించాల్సిన అవసరం ఉంద ని, ఈ కార్యక్రమంలో ప్రజాప్రతిని, అధికారులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
వాహనాలు నడిపేటప్పుడు ఎట్టి ప రిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండవద్దని, టు వీలర్ పై వెళ్లే వారు హెల్మెట్ , ఫోర్ వీలర్ పై వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించాలని, వాహనం వెనక కూ ర్చున్న వారు సైతం తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని అన్నారు. ర హదారులపై చనిపోయిన వారిలో 65 శాతం కాలినడకన వెళ్లేవారు, మోటార్ సైకిల్ పై వెళ్లేవారే చ ని పోతున్నారని తెలిపారు. వాహ నా లు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉం డాలని , హెల్మెట్ ధరించాలని ఎవ రు వాహనదారునికి చెప్పాల్సిన అ వసరం లేదన్నారు.
ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ విప్, నకి రేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ జాతీ య రహదారి నిడివి జిల్లాలో ఎక్కువగా ఉన్నందున రోడ్డు మీద వెళ్లేవారు తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో లేదో అన్న ఆందోళ న ఉందని , రోడ్డు ప్రమాదాల నివా రణకు పెద్ద ఎత్తున అవగాహన కా ర్యక్రమాలు చేపట్టడం జరిగిందని, అరైవ్,ఆ లైవ్ గొప్ప కార్యక్రమం అ ని అన్నారు. రోడ్డు ప్రమాదాల పట్ల జిల్లాలోని ప్రజలందరూ చైతన్యవం తం కావాలని, తమ నియోజకవర్గ పరిధిలో అరైవ్ అలైవ్ కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహిస్తామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లా డుతూ ఏప్రిల్ 13 నుండి 18 వర కు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగం గా జిల్లా అంతటా రోడ్డు భద్రత కా ర్యక్రమాలు చేపట్టామని,హెల్మెట్ లే ని వారు తప్పకుండా హెల్మెట్ కొ నుక్కుని ధరించి వాహనాలు నడ పాలని, జిల్లాలో రోడ్ సేఫ్టీ సమా వేశాలను క్రమం తప్పకుండా నిర్వ హిస్తున్నామని, జిల్లాలో రోడ్డు ప్ర మాదాలు తగ్గించడానికి కృషి చేస్తా మని తెలిపారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మా ట్లాడుతూ నల్గొండ జిల్లాలో జాతీ య రహదారి నిడివి ఎక్కువగా ఉందని, గత సంవత్సరంతో పోలి స్తే ఈ సంవత్సరం జిల్లా యంత్రాం గం, పోలీసులు తీసుకున్న చర్యల వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గాయని 2024 సంవత్సరం జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 390 మంది చని పోతే, గత సంవత్సరం 347 మంది చనిపోయారని తెలిపారు.
రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గు త్తాఅమిత్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తుంగతుర్తి శాసనసభ్యు లు మందుల సామేలు , తదితరు లు మాట్లాడారు.మిర్యాలగూడ శా సనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, స్థా నిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలె క్టర్ వై. అశోక్ రెడ్డి, డిఐజి చౌహన్, సర్వోత్తమ్ రెడ్డి, పున్న కైలాస్ నేత, మున్సిపల్ చైర్మన్ రజిత, స్థానిక ప్ర జాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ నకరికల్ శాసనస భ్యులు వేముల వీరేశం 2000 మందికి హెల్మెట్లను ఇవ్వాలని నిర్ణయించగా ఇన్చార్జి మంత్రి, డి జిపి ల చేతుల మీదుగా వాటిని అందజేశారు. కార్యక్రమానికి హా జరైన వారందరి చేత రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. నకిరేకల్ ని యోజకవర్గ పరిధిలోని సుమారు 40 మంది గ్రామ సర్పంచ్లు తమ గ్రామ పరిధిలో హెల్మెట్ లే కుండా వాహనాలు నడపమని తీ ర్మాని స్తూ తీసుకున్న నిర్ణయాలను రాత పూర్వకంగా మంత్రికి అందజేశారు. అరేయ్ అలైయు కార్యక్రమంలో భాగంగా సమావేశ ప్రాంగణంలో కంటి చికిత్స శిబిరాన్ని అరైవ్ అలై వుపై ఏర్పాటుచేసిన గ్రంథాల యా న్ని మంత్రి సందర్శించారు.








