Minister Bandi Sanjay Kumar : ప్రజా దీవెన, హైదరాబాద్: దుబాయిలో దారుణ హత్యకు గురైన సం ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందిం చింది. హీరోయిన్ పాకిస్తానీ చేతి లో దుబాయిలో దారుణంగా హ త్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోం శాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమా ర్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జరిగిన ఘటనపై ఆరా తీశారు. ప్రేమ్ సాగర్ తోపాటు హ త్యకు గురైన నిజామాబాద్ కు చెం దిన శ్రీనివాస్ మృత దేహాలను వీ లైనంత తొందరగా స్వదేశానికి ర ప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు మృతుల కుటుంబాలకు అండగా ఉంటామ ని, వారికి న్యాయం జరిగేలా చూ స్తానని హామీ ఇచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రి ఈ సమాచారం తెలు సుకున్న వెంటనే విదేశీ వ్యవహారా ల మంత్రి కార్యాలయంతో మాట్లా డారు. వెంటనే దుబాయిలో హత్య కు గురైన ప్రేమ్ సాగర్, శ్రీనివాస్ మృత దేహాలను స్వదేశానికి రప్పిం చేలా చర్యలు తీసుకోవాలని కో రారు.
ఈ నేపథ్యంలో విదేశాంగ శాఖ కా ర్యాలయ అధికారులు సైతం దుబా యి అధికారులతో మాట్లాడారు. వీలైనంత తొందరలో ఆయా మృత దేహాలను స్వదేశానికి రప్పించేందు కు చర్యలు తీసుకోవాలని, ఈ మే రకు ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని హోంమంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించారు.
దుబాయి పోలీసులను సంప్ర దించిన విదేశాంగశాఖ…
కేంద్ర మంత్రి బండి సంజయ్ జో క్యం చేసుకోవడంతో విదేశాంగ శా ఖ అధికారులు దుబాయిలోని భా రత ప్రతినిధులు దుబాయిలోని భారతీయ విదేశాంగ శాఖ ప్రతిని ధులు బుర్ దుబాయ్ పోలీస్ స్టేష న్ కు వెళ్లి వివరాలను సేకరించారు. అష్టపు శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ ఇద్ద రూ దుబాయిలోని అల్ కోజ్ ఇండ స్ట్రీయల్ ఏరియాలోని మోడరన్ బేకరీలో పనిచేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఉద్దేశపూర్వక హత్యా అభియోగం కింద ఈ నెల 11నే కేసు నమోదు చేసినట్లు బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్ నేర పరిశోధన విభాగం అధి పతి పేర్కొన్నారు. కేసును అదే రో జున ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశా మని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక కీల కమన్నారు. హత్య కేసు కావడంతో మృతదేహాలను భారత్ కు పంపే విషయంలో ప్రాసిక్యూషన్ ఆమో దం అవసరమని ఈ సందర్భంగా పోలీసు అధికారులు తెలిపారు. లాంఛనాలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా మృతదేహాలను భారత్ కు పంపిస్తామని తెలిపారు.