— కేంద్ర మంత్రి గడ్కరీ చేతుల మీదుగా త్వరలోనే సాకారం
Minister Gadkari: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానం చేసే హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి (National Highway) పై ట్రాఫిక్ కష్టాలు (Traffic problems)తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరిపేందు కు ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు. ఈ ఫ్లైఓవర్కు మొత్తం రూ.82 కోట్లు (82 crores) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నా రు. వంతెన నిర్మించే ప్రదేశం గట్టిద నం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరిం త వేగంగా జరిగేందుకు అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్ కు (Flyover) కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Transport Minister Nitin Gadkari) అతి త్వరలోనే శంకుస్థాపన చేయునున్నట్టు ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫ్లైఓవర్ (Flyover) నిర్మాణ సమయంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరు వైపులా జాతీయ రహదారులు సంస్థ అధికా రులు సర్వీస్ రోడ్ల నిర్మాణం, మరమ్మ తులు చేపట్టారు. ముందుగా వలిగొండ అడ్డ రోడ్డు నుంచి పద్మావ తి ఫంక్షన్హాల్ వరకు 500మీటర్ల మేర ఈ వంతెన పనులు, మరో వారం, పది రోజుల్లో పూర్తవుతాయ ని అధికారులు పేర్కొన్నారు. ఫ్లైఓ వర్ నిర్మాణ కాంట్రాక్ట్ను దక్కించుకు న్న హర్యానాకు చెందిన రాంకు మార్ కన్స్ట్రక్షన్స్ నిర్మాణ పనుల ను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.