Minister uttamKumarreddy: ప్రజా దీవెన, నల్లగొండ: ఇందిర మ్మ ఇళ్లలో గిరిజనులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలం గాణలో ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి రెవె న్యూ గ్రామంలో ప్రత్యేక రెవెన్యూ వ్యవస్థ రాబోతోందన్నారు. వీఆర్వో లు వీఆర్ఏలు రాష్ట్రంలో సుమారు 23 వేలమంది ఉన్నారని చెప్పారు. వాళ్లలో 16300 మంది రెవెన్యూ శాఖలోకి రావటానికి దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. ప్రెస్ అకా డమీతో చర్చించి త్వరలోనే రాష్ట్రం లో ఉన్న జర్నలిస్టులకు హెల్త్ కార్డు లు, అక్రిడిటేషన్‌లు ఇస్తామని ప్రక టించారు. తన గెలుపులో గిరిజ నుల పాత్ర అధికంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రావడంలో తన కృషి కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి తండాలో గ్రామపం చాయతీ, అంగన్వాడీ భవనం ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాం ధీ ప్రధానమంత్రి అవుతారని.. తె లంగాణలో కూడా కాంగ్రెస్ అధి కారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయ కూలీల కు కూడా ఆర్థిక సాయం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పారు. అంద రికీ తెల్ల రేషన్ కార్డులు అందిస్తామ ని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 కిలోల సన్న బియ్యం ఇస్తుందని ప్రకటించారు.
రాజకీయంగా కూడా అందరికీ సముచిత స్థానం ఉంటుం దని తెలిపారు. అటవీ హక్కుల ప్రకారం మిగిలిన గిరిజనులకు భూములు ఇస్తామని మాటి చ్చారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అందరం కలసి పనిచేయా లని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఒకటి రెండు హామీల అమలు ఆలస్యం అయిందని అన్నారు. త్వరలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. భూమి లేని నిరు పేద కుటుంబాన్ని ఒక యూనిట్‌గా ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఆ కుటుంబం తప్పని సరిగా ఉపాధి హామీ పనుల్లో పాల్గొని ఉండాలని.. అంతకుమించి నిబంధనలు ఏమీ ఉండవని చెప్పారు. భూ భారతి విషయంలో చాలా పకడ్బందీగా చర్యలు ఉంటాయని అన్నారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా భూ భారతి చట్టం రూపుదిద్దుకుంటుదన్నారు.
భూ భారతిని గవర్నర్ కూడా ఆమో దించారని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వం ఇష్టారీతిన ధరణి అమలు చేసిందని.. కనీస నిబంధనలు కూడా లేకుండా ధరణి అమలు చేశారని తెలిపారు. ఫిబ్రవరి 15 లోగా భూ భారతి రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నా రు. ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లాలో వచ్చిన ఫిర్యాదులు ఆరోపణలపై శాఖా పరమైన విచారణ జరుగుతోందని చెప్పారు. 2025 భూ భారతి చట్టంలో ల్యాండ్ అప్పీలు అధా రిటీని ప్రత్యేకంగా అమలు జరుపుతున్నామని చెప్పారు. సమ గ్ర సర్వేపై త్వరలోనే స్పష్టమైన నిర్ణ యం తీసుకుంటామని అన్నారు. 59 జీఓ ద్వారా కోట్లాది రూపాయ ల విలువైన భూములు పిక్ షర్ట్‌ల కు కట్టబెట్టే ప్రయత్నం చేశారన్నా రు. కేసీఆర్ ప్రభుత్వంలో 59 జీఓ పేరుతో జరిగిన దోపిడీని అడ్డుకుం టామని చెప్పారు. ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే చర్యలు ఉంటాయని మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి తెలిపారు.