— రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండా లని ఆకాంక్ష
Minister Komatireddy : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో గోపలాయపల్లి గుట్టపై గల వేణు గోపాలస్వామి దేవస్థానంలో వార్షిక ఆధ్యయన, బ్రహ్మోత్సవాల్లో భాగం గా వేణుగోపాలస్వామి తిరుకల్యా ణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వ హించారు. కల్యాణానికి రాష్ట్ర రో డ్డు భవనాల శాఖ మంత్రి కోమ టి రెడ్డి వెంకట్రెడ్డి హాజరై స్వయంగా స్వామివారి అశ్వవాహన పల్లకిని మోశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త కోమటిరె డ్డి మోహన్రెడ్డి రాజేశ్వరి దంపతులు ముత్యాల తలంబ్రాలు అందజేశారు. తొలుత ప్రధానాలయం నుంచి అశ్వవాహ నంపై స్వామి, అమ్మవార్ల ను పల్లకి సేవలో కల్యాణవేదిక వద్దకు తీసు కువచ్చారు. అనంతరం నిర్వ హిం చిన ఎదుర్కోలు ఉత్సవం అలరిం చింది. ప్రదాన యాజ్జీకుడు ప్రతా పరం మత్స్యగిరి స్వామి పర్యవే క్షణలో అర్చక బృందం వెంకటాచా ర్యులు, కృష్ణమాచార్యుల శిష్య బృందం కల్యాణతంతును నిర్వ హించారు. ఈసందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడు తూ రాష్ట్రం పాడి పంటలతో సు భిక్షంగా ఉండేలా మా కుటుంబ ఇష్ట దైవం వారిజాల వేణుగోపా లస్వామిని వేడుకున్నట్లు తెలిపా రు. స్వామివారి దయతో బీ.వె ల్లెంల ప్రాజెక్టును ప్రారంభించుకు న్నామని, మే నెల నాటికి మొదటి లక్ష ఎకరాలకు నీళ్లందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎండో మెంట్ సీజీ ఎఫ్ నిధులతో పాటు ప్రభుత్వ నిధులతో గోపలాయపల్లి దేవస్థానాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. సహ చట్టం మాజీ ప్రధాన కమిషనర్ డాక్టర్ వర్రె వెం కటేశ్వర్లు కుటుంబ సమేతంగా హా జరయ్యారు. దాతల స హకారంతో భక్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకకు ఆర్టీఐ మాజీ క మిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షు డు సద్ధి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే వీరే శం సతీమణి వేముల పుష్ప, కో మటిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ బి.సుమతి, ఆలయ ఈవో నాగిరెడ్డి, ఆర్టీఐ కమిషనర్, కాంగ్రెస్ నాయకులు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, దైద రవీందర్, బత్తుల ఊశ య్య, దూదిమెట్ల సత్తయ్య, పాశం శ్రీనివాన్ రెడ్డి, సట్టు సత్తయ్య, పడ్డే భూపాల్ రెడ్డి, చార యాదయ్య, గోసుల భద్రాచలం, స్రవంతి దార ఈశ్వరయ్య, ప్రజ్ఞాపూర్ సత్తి, సంప త్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంపై వేణుగో పాల స్వామి ఆశీస్సులు.. అనంతరం మీడియాతో మాట్లా డిన మంత్రి తెలంగాణ రాష్ట్రం ఆ వేణుగోపాల స్వామివారి ఆశీస్సు లతో పాడి పంటలు, సుఖసంతో షాలతో సుభిక్షంగా ఉండాలని వేడుకోవడం జరిగిందని తెలిపారు.
చెరువుగట్టు ఆలయాన్ని అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, త్వరలో పనులు ప్రారంభిస్తామ న్నారు. అదే విధంగా వారిజాల వేణుగోపాల స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని పేర్కొ న్నారు. చెరువుగట్టు జాతర తర్వా త ఈ ప్రాంతంలో రెండో పెద్ద జాత ర వారిజాల వేణుగోపాలస్వామి వారి జాతర అని,స్వామివారి కళ్యాణోత్సవాలను కమనీయంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీకి, ఛైర్మన్ మోహన్ రెడ్డికి నా అభినం దనలు అని చెప్పారు. ఆలయానికి కూతవేటు దూరంలోనే బ్రహ్మణవె ల్లంల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతు న్నదని,రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆనా డు స్వర్గీయ వైయస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్.ఎల్.బీ.సీ సొరంగాన్ని మం జూరీ చేయించానని, సీఎం సహ కారంతో ఎస్.ఎల్.బీ.సీ సొరంగం, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణమ్మను వేణుగోపాలస్వామి చెంతకు చేరుస్తామని వెల్లడిం చారు. బ్రహ్మణవెల్లంల ప్రాజెక్టు ద్వారా.. రాబోయే వారం పది రోజుల్లో దాదాపు నలభైవేల ఎక రాలకు సాగునీరు అందిస్తామని, వచ్చే మే నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు.
70 శాతం పూర్తయిన ఎస్.ఎల్. బీ.సీ సొరంగం పనులను పదేండ్లు కేసిఆర్ పక్కన పెడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమెరికాకు పో యి బోరింగ్ స్పేర్ పార్ట్స్ తెప్పిం చడం జరుగుతుందన్నారు.వచ్చే రెండు సంవత్సరాల్లో ఎస్.ఎల్. బీ.సీ సొరంగం పూర్తి చేసి నల్ల గొండను బంగారు కొండగా మారు స్తామని ప్రతీ ఎకరాకు నీళ్లిస్తాం, ప్రతీ ఇంటికి త్రాగునీళ్లిస్తామని స్ప ష్టం చేశారు. దేవుడి ఆశీస్సులు, ప్ర జల అభిమానంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల ఆకాం క్షలకు అనుగుణంగా సం క్షేమ పాలనను అందించి ప్రజల గుం డెల్లో ప్రభుత్వాన్ని నిలబె డుతామని పునరుద్ఘాటించారు.