Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkata Reddy : భక్తి శ్రద్ధలతో ఈదుల్‌ ఫితర్‌ వేడుకలు

–రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక ప్రా ర్థనల్లో ముస్లిం సోదరులు
— ప్రముఖులతో కలిసి పరస్పర రం జాన్ పండుగ శుభాకాంక్షలు
–నల్లగొండలో పాల్గొన్న రోడ్లు భవ నాలు సినిమాటోగ్రఫీ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి

Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో ఈదుల్‌ ఫితర్‌ వే డుకలను ముస్లింలు ఘనంగా జరు పుకుంటున్నారు. మత సామర స్యా నికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగ వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా జరుగుతున్నాయి. రం జా న్‌ను పురస్కరించుకుని చార్మి నార్ మక్కా మసీదు వద్ద ముస్లిం సోదరులు ప్రార్ధనల్లో పాల్గొన్నారు. పాతబస్తీలోని మిరాలం ఈద్గా కు పెద్ద ఎత్తున ముస్లింలు తరలివచ్చి సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నా రు. పండుగ నేపథ్యంలో ఎలాంటి ఆటంకాలు జరుగకుండా చార్మి నా ర్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ప టిష్ట భద్రతా చర్యలు ఏర్పాటు చే శారు. చార్మినార్ వద్ద 200 మంది లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ పో లీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. చార్మినార్ పరిసరాలో ట్రాఫిక్ ఆం క్షలు, పలు ప్రాంతాల్లో ప్రత్యేక పా ర్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

సామూహిక ప్రార్థనలు.. అటు మిరాలం ఈద్గాలో సామూహిక ప్రా ర్థనలు మొదలయ్యాయి. పెద్ద సం ఖ్యలో ముస్లిం సోదరులు ప్రార్థ న ల్లో పాల్గొన్నారు. అంతకు ముం దు ఉదయం హైదరాబాద్ సీపీ మిరా లం ఈద్గా కు చేరుకుని అక్కడి భ ద్రతా ఏర్పాట్లను పర్యవే క్షించారు. బాంబ్ అండ్ డాగ్ స్క్వా డ్‌తో ము మ్మర తనిఖీలు నిర్వహించారు. కూకట్‌పల్లి ఎల్లమ్మబండ ఈద్గా వద్ద పెద్ద సంఖ్యలో ముస్లింలు ప్రా ర్థనలు నిర్వహించారు. నాం పల్లి పబ్లిక్ గార్డెన్‌లో ముస్లింలు ప్రార్థ నల్లో పాల్గొన్నారు.

కాగా ఎక్కడ చూసిన సందడి వా తావరణం కనిపించింది. నూతన వ స్త్రాలను ధరించి మసీదులో ప్ర త్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ద్ ఉల్ ఫితర్ ప్రత్యేక ప్రార్ధనలను ముస్లింలు అందరూ భక్తిశ్రద్ధలతో ని ర్వహించుకున్నారు. రంజాన్ పం డుగను ముస్లిం సోదరులు ఘనం గా జరుపుకున్నారు. రంజాన్ మా సం అంతా కఠిన నియమాలతో ఉ పవాస దీక్ష పాటించిన ముస్లిం సో దరులు బుధవారం నెలవంక కని పించడంతో గురువారం రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘ నంగా జరుపుకు న్నారు. పలు మ సీదులలో ఉద యం 8 గంటల నుంచి సామూహిక ప్రార్ధనలు ని ర్వహించారు. ప్రవచనా లు ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ పండుగ పురస్కరించుకుని ముస్లిం సోద రులు ఈద్ ముబారక్ అంటూ కు టుంబ సభ్యులకు ఒకరికొకరు శు భాకాంక్షలు తెలుపుకున్నారు. కు టుంబ సభ్యులు చేసిన ప్రత్యేక వం టకాలు పాయసం షీర్ కుర్మా విం దు ఏర్పాటు చేశారు. రంజాన్ రోజు ప్రత్యేకంగా పేద ప్రజలకు దాన ధ ర్మాలు చేస్తే సకల శుభాలు క లుగు తాయని భావించి కొందరు ము స్లింలు పేదవారికి బట్టలు, బి య్యం దానం చేశారు. జాకర్త పేరిట ప్రతి సంవత్సరం పేదవాళ్లకు బట్ట లు నిత్యావసర సరుకులు దానం చే యడం ఆనవాయితీగా వస్తోంది. నెల రోజుల పాటు ప్రతి రోజు దాన ధర్మాలు చేయడం వల్ల తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని సంపూర్ణ దైవదర్శనం సిద్ధిస్తుందని ముస్లిం సోదరులు విశ్వసిస్తారు.

ఉపవాస దీక్షను విరమించి, ప్రత్యేక ప్రార్ధనలు చేసి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ముస్లిం సోదరులు ఆకాంక్షిం చారు. రంజా న్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు ఎన్నడూ లేని విధంగా ఈసారి రంజాన్ పండుగను ఘనం గా జరుపుకున్నారు. ఈద్గా లో సా మూహిక ప్రార్థనలతో సందడిగా మారింది. రంజాన్ మాసం భక్తి శ్రద్ధలతో ముగిసింది. ప్రార్ధన మంది రాలు కళకళలాడాయి. ఈద్గాలు మసీదులు భక్తుల తాకిడి తో ఉద యం నుండి సందడిగా మారాయి . ముస్లిం సోదరులు కొత్త బట్టలు ధ రించి, సుగంధం పన్నీరు పూసుకొని సామూహిక ప్రార్ధనలు నిర్వహిం చారు. షీర్ కుర్మా తదితర వంట కా లు ఆరగిస్తూ, కుటుంబ సభ్యుల మ ధ్య రంజాన్ వేడుకలను సంతో షంగా జరుపుకున్నారు. వీధుల వెం ట అలాయ్ బలాయ్ తీసుకో వడం తో రంజాన్ పండుగ సంద డిగా మారింది.

ట్రాఫిక్ ఆంక్షలు… మరోవైపు రంజాన్ పర్వదిన్నాపు రస్కరించు కుని హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రా ఫిక్ ఆంక్షలు విధించా రు. ముస్లిం సోదరుల ప్రార్థనల నేపథ్యంలో మీ రాలంమండి ఈద్గా, మాసబ్‌ ట్యాం క్‌ హాకీ గ్రౌండ్‌ పరి సరాల్లో ఉదయం 8 గంటల నుంచి 11:30 ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నా యి. పురానాపూల్‌, కామాటిపురా, కిషన్‌బాగ్‌ వైపు నుంచి ఈద్గా వైపు నకు వచ్చే వాహనాలను బహదూ ర్‌పురా క్రాస్‌రోడ్స్‌ వరకే అనుమతి ఇచ్చారు. ప్రార్థనలకు వచ్చే వారి హ నాలను జూపార్క్‌ ఓపెన్‌ ప్లే స్‌లో పార్కింగ్‌ చేసుకోవాలని పో లీసులు సూచించారు. శివరాం ప ల్లి, దాన మ్మహట్స్‌ వైపునకు వచ్చే వాహనాలను దానమ్మహట్స్‌ క్రాస్‌ రోడ్స్‌ వైపు వరకే వాహనాలకు అ నుమతి ఇచ్చారు. వీరికి మోడ రన్‌ సామి ల్‌, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, సూ ఫీ కార్స్‌ వద్ద పార్కింగ్‌ స్థలం కే టా యించారు. కాలాపత్తర్‌ వైపు నుం చి వచ్చే వాహనాలను మోచీ కాల నీ, బహ దూర్‌పురా, శంషీర్‌ గంజ్‌, నవాబ్‌ సాహెబ్‌కుంట వైపు కు మ ళ్లించను న్నారు. ప్రార్థనలకు వచ్చే వారికి భయ్యా పార్కింగ్‌, ఇండి య న్‌ ఆయి ల్‌ పెట్రోల్‌ బంకులో స్థ లం కే టాయించారు. పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపున కు వెళ్లే బస్సుల ను జియాగూడ వై పునకు మళ్లిస్తూ పోలీసులు ఆం క్షలు విధించారు.

నల్లగొండ లో కోమటిరెడ్డి : నల్లగొండ జిల్లా మతసామర స్యా నికి పెట్టింది పేరని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సి నిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అ న్నారు. రంజాన్ పండుగ సందర్భం గా ఆయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మునుగోడు రోడ్డులో ఉన్న ఈద్గా లో పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రా ర్థనలు జరిపిన ముస్లింలతో కిలిసిన అనంతరం జి ల్లాలోని ముస్లిం ప్రజలందరికీ రం జాన్ శుభాకాంక్ష లు తెలియజే శారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ స్వతంత్ర పోరాటంలో ముస్లిం ల పాత్ర మరువలేనిదని అన్నారు. దేశాభివృద్ధికి ఎంతోమంది ము స్లిం లు కృషి చేశారని, అందులో అబ్దు ల్ కలాం రాష్ట్రపతిగా, సైంటి స్ట్ గా చేసిన సేవలు మరువలేనివని అ న్నారు. నల్గొండ జిల్లా మత సామ రస్యానికి పేరని, హిందూ ముస్లిం లు అందరూ కలిసి నల్గొండ పట్ట ణాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నల్గొండలో శాంతిభద్రతలు బా గుం డాలని, హిందూ, ముస్లింలు అంద రూ కలిసిమెలిసి ఉండాలని అన్నా రు. నల్గొండ పట్టణంలోని దర్గాలు ఈద్గాల అభివృద్ధికి తాను గత 25 సంవత్సరాల నుండి కృషి చేస్తు న్నానని తెలిపారు.ఇక్కడి ఈ ద్గా తెలంగాణలోనే అతిపెద్ద ఈద్గా అ న్నారు. ఇటీవల నల్గొండలోని ర్వ హించిన ఇస్తేమాలో సుమారు 40, 50 వేల మంది పాల్గొన్నా ఎలాంటి సమస్య లేకుండా తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నా రు. ముఖ్యంగా లతీఫ్ సా బ్ దర్గా కు ప్రతి సంవత్సరం నిర్వహించే ఉ ర్సు ,ఇతర ఉత్సవాల సందర్భంగా లక్షల మంది వస్తారని, పెద్దవారు, ముసలివారు గుట్ట ఎక్క లేరని, దీన్ని దృష్టిలో ఉంచుకొని లతీఫ్ సాబ్ దర్గాకు 100 కోట్ల రూపాయ లతో ఘాట్ రోడ్ నిర్మిస్తున్నామని , టెం డర్లు పూర్త య్యా యని, త్వర లోనే పనులు ప్రారంభ మవుతాయ ని తెలిపారు. లతీఫ్ షాప్ గుట్ట నుండి బ్రహ్మంగారి గుట్ట వరకు రో ప్ వే నిర్మిస్తున్నామని, బ్రహ్మం గారి గుట్టకు కూడా వేరే ఘాట్ రోడ్ వే యిస్తున్నామని, 500 కోట్లతో కొత్త బైపాస్ రోడ్ టెండర్లు వేయడం జరి గిందని, వారం రోజుల్లో పను లు మొదలవుతున్నాయన్నారు. నల్గొండలో ముస్లింల సంక్షేమం, అ భివృద్ధి లో భాగంగా మహాత్మా గాం ధీ యూనివర్సిటీ, మెడికల్ కళా శాల, కలెక్టరేట్ తదితర ప్రభుత్వ సంస్థలలో ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ పద్ధతిపై అర్హులైన ముస్లిం అభ్య ర్థులను నింపేందుకు 10 శాతం రిజర్వేషన్ కల్పించేలా జిల్లా కలెక్టర్ కు ఇదివ రకే ఆదేశించడం జరి గిందని ఆ యన వెల్లడించారు. దీం తో పాటు పేద ముస్లింలకు ఇండ్లు కట్టించేం దుకు చర్యలు తీసుకుం టున్నామని, నల్గొండ పట్టణం స మీపంలో పేదవారికి ఇండ్ల నిర్మాణా నికి భూమిని గుర్తించడం జరిగిం ద ని, ప్లాట్లు లేని వారికి ప్లాట్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయలతో ఇల్లు క ట్టిస్తామని, ప్లాట్లు ఉంటే నేరుగా ఇ ల్లు కట్టించడం జరుగుతుందని ఆ యన చెప్పారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ జిల్లా లో హిందూ, ముస్లింలందరూ సోద ర భావంతో ఉండాలని కోరుతూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజే శారు. అద నపు కలెక్టర్ జే .శ్రీనివా స్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నా రు.