–గ్లూకోమా కేంద్రo ప్రారంభోత్సవం లో రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమా టో గ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన నల్లగొండ: రాబోయే రెండు మాసాలలో నల్గొండ జిల్లా లోని అన్ని అసెంబ్లీ నియోజకవ ర్గాలలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మోడల్ పిహెచ్ సిలు గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం అయన నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలో కోటి 56 లక్షల రూపా యల వ్యయంతో నిర్మించిన ప్రా థమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే ప్రభుత్వ వైద్యశాలలో మొదటి సారిగా ఏర్పాటుచేసిన గ్లూకోమా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేస్తే ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు.
గ్లూకోమా వల్ల వచ్చే కంటి వ్యాధుల నిర్ధారణకు సంబం ధించి జిల్లాలోనే మొట్టమొదటిసా రిగా కనగల్ ప్రాథమిక వైద్య ఆరో గ్య కేంద్రంలో గ్లూకోమా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ,దీని ద్వారా 40 సంవత్సరాలు పైబడిన వారందరూ వారి కంటిచూపుకు సంబంధించిన గ్లూకోమా పరిస్థితు లను తెలుసుకోవడమే కాకుండా, గ్లూకోమా ఉన్నట్టు గుర్తించినట్ల యితే కంటి చూపు పోయే ప్రమా దం నుండి రక్షించుకోవచ్చని తెలి పారు.రాష్ట్రప్రభుత్వం విద్య, వై ద్యానికి అత్యంత ప్రాధాన్య ఇస్తున్న దని, ఇందులో భాగంగానే నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో అన్ని సౌకర్యాలతో ఒక ప్రాథమిక వైద్య కేంద్రాన్ని మోడల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందు లో సాధారణ ప్రసవాలతో పాటు, చిన్న చిన్న ఆపరేషన్లు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
అలాగే జిల్లాలో వేసవిలో మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత అన్ని పాఠశాలు, హాస్టళ్లలో మరమ్మ తులు చేపడతామని తెలిపారు. కనగల్ నుండి నాగార్జునసాగర్ సాగర్ హైవే కలిపే విధంగా 15 కోట్లతో రోడ్డుకు టెండర్లు పిలవడం జరిగిందని వెల్లడించారు. అలాగే కనగల్ మండలానికి 60 కోట్లతో రోడ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.కనగల్ , తిప్పర్తి మండలాలకు జూనియర్ కళాశాలలు మంజూరయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరం నుండి అద్దె భవనాలలోనైనా వీటిని నిర్వహించదానికి చర్యలు తీసుకోవాలని, వీటికి పక్క భవనాలు సైతం నిర్మిస్తామన్నారు. నల్గొండ నియోజకవర్గంలో బ్రాహ్మణ వెల్లేముల ద్వారా అన్ని చెరువులకు నీరు ఇవ్వడం జరిగిందని, ఎస్ఎల్ బిసీ సంఘటన దురదృష్టకరమని, అయితే త్వరలోనే ఎస్ఎల్ బి సి టన్నెల్ పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ కనగల్ పి హెచ్ సి లో గ్లూకోమా కేంద్రంతోపాటు, అధునాతన
ఆటో క్లేవ్స్ ,డిజిటల్ వేవ్ మిషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని, వీటిని ఏర్పాటు చేసేందుకు సహకరించిన ఆర్ అండ్ బి శాఖ మంత్రికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గ్లూకోమా మిషన్ ద్వారా కంటికి సంబంధించిన సమస్యలను గుర్తించవచ్చని, గ్లూకోమాకు మందు లేదని, ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మోడల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్టు ఆమె వెల్లడించారు . పేదవారు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ సుపర్ణ మహేంద్ర తదితరులు మాట్లాడారు.
డిప్యూటీ డిఎంహెచ్వోలు వేణుగోపాల్ రెడ్డి ,డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, టి జి ఐడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జైపాల్ రెడ్డి, ఆర్డిఓ అశోక్ రెడ్డి ,డిఎస్పి శివశంకర్ రెడ్డి, కనగల్ పి హెచ్ సి వైద్య అధికారి రామకృష్ణ, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తదితరులు ఉన్నారు.