— సాగు, తాగు నీటి సమస్యలు తలెత్తవద్దు
–ధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి
— రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజాదీవెన నల్లగొండ బ్యూరో : ఈ వేసవి లో నల్గొండ జిల్లాలో సాగు, తాగు నీరూ, విద్యుత్ కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి అధికారులను ఆదేశించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరగడం, ఇతర కారణా లవల్ల విద్యుత్ డిమాండ్ సైతం బాగా పెరిగిందని, వీటన్నిటిని దృష్టి లో ఉంచుకొని ఈ వేసవిలో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఆదివారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మంది రంలో అధికారులతో వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్తు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ సమీక్ష సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్స రం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టు పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం ఎక్కువ వరి ధాన్యం ఐకెపి సెం టర్లకు వచ్చే అవకాశం ఉన్నందున ముదునుండే ఏర్పాట్లు చేసుకో వాలని, ధాన్యం కొనుగోలుకు అవసరమైన టార్పాలిన్లు, ఇతర సౌక ర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.
కాగా వ్యవసాయ శాఖకు 80 క్లస్టర్లు, ఏఈ పోస్టులు కావాలని జిల్లా వ్యవ సాయ అధికారి సమావేశం దృష్టికి తీసుకురాగా, మంత్రి తక్ష ణమే స్పందించి సమావేశ మందిరం నుండే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో ఫోన్ లో మాట్లాడి క్లస్టర్లను మంజూరు చేయాలని కోరగా, అందుకు మంత్రి సమ్మతించారు. నెలలోపు ఈ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు తీసు కుం టామని మంత్రి ప్రకటించారు. జిల్లాలో సనారకం ధాన్యాన్ని ప్రో త్సహించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలతోపాటు, తాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
అదే సమయంలో విద్యుత్ కి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని, నల్గొండ పట్టణంతో పాటు, గ్రామాలలో ఎలాంటి కోతలు ఉండవద్దని, ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీటిని అం దించేందుకు జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషిని మంత్రి అభినందిం చారు. జిల్లాలో అధికారులు అందరూ రాత్రి, పగలు కష్టపడి పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకొస్తున్నారని, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దాన్యం సేకరణ బాగా చేశారని అదే విధంగా రబిలో సైతం చేయాలని చెప్పారు.
వచ్చే నెల ఒకటి లేదా రెండు తేదీలలో 36 కోట్ల రూపాయలతో ని ర్మించనున్న జిల్లా కలెక్టర్ కార్యాలయ అదనపు భవనాల నిర్మా ణాలకు శంకుస్థాపనతో పాటు, 15 సబ్ స్టేషన్ లకు శంకుస్థాపన, మాడుగుల పల్లి పోలీస్ స్టేషన్ భవన శంకుస్థాపన, అలాగే ఇతర ముఖ్యమైన కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రంలో కొత్త పోలీస్ క్వార్టర్ల నిర్మాణం మంజూరు రాబోతున్నదని, అలాగే డిఎస్పీ ఆఫీస్ మంజూరైన కార ణంగా వాటికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
520 కోట్ల రూపాయలతో మంజూరైన బైపాస్ రోడ్డు టెండర్లు పూర్త య్యాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సమావేశం ప్రారం భమైన వెంటనే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్ ద్వారా అందిస్తున్న సాగునీరు, పంటల పరిస్థితి, తాగునీరు, విద్యుత్తు, తదితర అంశాలపై వివరాలను మం త్రికి తెలియజేశారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ట్రాన్స్కో ఎస్ఈ వెంకటేశ్వర్లు, వ్యవ సాయ అధికారి శ్రవణ్, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.