–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy :ప్రజా దీవెన నల్లగొండ: పదో తరగతి విద్యార్థులు 10 కి 10 జిపిఎ సాధించే విధంగా ప్రిన్సిపాల్ తో పాటు, ఉపాధ్యాయులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఆయానానల్గొండ జిల్లా, కనగల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ప్రారంభయానికి వచ్చిన సందర్భంగా కేజీబీవీ పాఠశాలను సందర్శించారు.
కేజీబీవీ ద్వారా ఉత్తమ ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు పనిచేయాలని, పేద పిల్లల్ని సొంత పిల్లలుగా భావించి మంచి చదువు అందించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యత పెంచేలా బోధన ఉండాలని ఇందుకు ప్రతి ఉపాధ్యాయుడు చిత్తశుద్ధితో పనిచేసి ప్రభుత్వ పాఠశాలలకు మంచి పేరు తీసుకురావాలని
పిలుపునిచ్చారు. పాఠశాలలో మూడు నెలల్లో ఉత్తమ ఫలితాలను చూపిస్తే పాఠశాలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కలుగజేస్తామన్నారు. అతి ముఖ్యమైన తాగునీరు , ప్రహరి నిర్మాణాన్ని వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి కనగల్ కేజీబీవీ పాఠశాలలో అన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. నియోజకవర్గంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు స్పోర్ట్స్ మెటీరియల్ పంపడంతోపాటు, కలర్లు వేయించడం జరిగింది చెప్పారు.
అంతకుముందు మంత్రి కనగల్ జెడ్పిహెచ్ఎస్ లో ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు . అంతేకాక తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,మాజీ ము న్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, ఇతర అధికారులు, ప్రజా ప్రతిని ధులు తదితరులు ఉన్నారు.