Minister Komatireddy venkatreddy : మూడేళ్లలోనే సొరంగం పనులు పూర్తి
-తద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం --రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
మూడేళ్లలోనే సొరంగం పనులు పూర్తి
–-తద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: మూడేళ్ల లోనే ఎస్ ఎల్ బి సి సొరంగం (sl bc tunnel) పనులను పూర్తి చేసి నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ( komatireddy venk atred dy) అన్నారు. శనివారం అయన నల్గొండ జిల్లా, నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామం వద్ద డి-37 కాల్వ ద్వారా సాగునీటిని విడుదల చేశా రు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావే శంలో మంత్రి మాట్లాడారు.
నాగార్జునసాగర్ ( Nagarjuna Sagar) ఎడమ కాలువ ద్వా రా సాగునీటిని విడుదల చేయడం జరిగిందని, ఇందులో భాగంగా డీ-3 7 ద్వారా సుమారు 50000 ఎక రాలకు సాగునీరు అందనుం దని మంత్రి తెలిపారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడే ఈ కా లువలను తవ్వడం జరిగిందని, అప్పటినుండి గత సీజన్లో తప్ప నిరంతరం సాగునీరు ఇచ్చామని తెలిపారు.
నాగార్జునసాగర్ ప్రాజె క్టు ద్వారా సాగనీటిని వదలడం వలన రైతుల ( formers) ముఖాలలో సంతోషం కనబడుతున్నదని తెలిపారు. డి- 37 తో పాటు డి-41, 42 కాలువల ద్వారా సైతం సాగునీరు ఇ స్తున్నామని, అయితే గత సంవత్సరం సాగు నీరు ( irrigation water) విడుదల చేయని కార ణంగా కాలువలలో పూడికతో పా టు, కంపచెట్లు పెరిగిపోయాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని తాను సొంతంగా తన నిధులతో 10 మిషన్లను ఏర్పాటు చేసి అన్ని కా లు వలలో పిచ్చి మొక్కలను తొల గిస్తున్నామని తెలిపారు.
నాలుగైదు రోజుల్లో ఏఎంఆర్పి కింద ఉన్న అన్ని కాలువల ద్వారా చె రువులకు నీరు ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడతాయని ఊహించి నల్లగొండ (nalgo nda) కరువుకు గురికా కుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు అందించే ఏర్పాటును అప్పుడే చేపట్టడం జరిగిం దని అయితే గత ప్రభుత్వాలు ఎస్ఎల్బీసీకి సరైన విధంగా నిధులు కేటాయించకపోవడం వల్ల అది పెండింగ్లో ఉండిపోయిందని తెలి పా రు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం (state government) ఎస్ఎల్బీసీ పూర్తికి 2200 కోట్ల రూపాయలను విడు దల చేయడం జరిగిందని, యుద్ధ ప్రాతిపదికన 30 నెలల్లో ఎస్ ఎల్ బి సి సొరంగం పనులు పూర్తి చేస్తా మని దీని ద్వారా బ్రాహ్మణ వెళ్లె ములకు సాగునీరు నీరు అందు తుందని తెలిపారు. ఎస్ఎ ల్బీసీ సొరంగం పూర్తవుతే నాలు గున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆయన వెల్ల డించారు.
దీంతోపాటు ధర్మారెడ్డి (dharmareddy cenol), శివన్న గూడెం ( shivannagudem) తదితర ఎత్తిపోతలన్ని పూర్తయితే మరో మూడు లక్షలు ఎకరాలకు సాగునీరు వస్తుందని, జిల్లాలో ఒక్క ఎక రం ఖాళీ లేకుండా సాగునీరిచ్చి ప్రజల రుణం తీర్చు కుంటామని ఆయన తెలిపారు. తాము రైతుల సంక్షేమం ( formers wel fare) తో పాటు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడ మే తమ ఉద్దేశమని మంత్రి తెలిపారు.
రైతుల సంక్షేమం తో పాటు, అన్ని గ్రామాలు, పట్టణాలకు రోడ్డు సౌ కర్యం కల్పించడంలో భాగంగా డబుల్ రోడ్డు ( road fecility) లను నిర్మిస్తున్నామని, నల్గొండ నుండి గుండ్లపల్లి మీదుగా నిర్మించే డబుల్ రోడ్డుకు రైతు లందరూ సహకరించాలని ఆయన కోరారు. రోడ్డు మలుపులు లేకుండా ఉండే విధంగా రైతులు సహకరించాలని ఆయన కోరారు. ఎస్ ఎల్బి సి సోరంగం మిషన్ విడి భాగాల (slbc tunnel mission) విష యమై అమెరికా కంపెనీతో మాట్లాడి యంత్ర పరికరం తెప్పించ ను న్నట్లు తెలిపారు.
విదేశీ సహకారంతో నల్గొండ జిల్లాలో పరి శ్రమలు ( industries) ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తా మని ఆయన తెలి పారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్,మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య, ఎస్ ఈ శ్రీనివాసరెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి,అబ్బగోని రమేష్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు.
Minister Komatireddy venkatreddy