Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : రాబోయే రెండేళ్లలో సొరంగం పూర్తి

--తద్వారా నల్లగొండ జిల్లాలోని ఫ్లో రైడ్ రక్కసిని కట్టడి చేస్తాం --అమెరికాలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ కంపెనీ సందర్శన --అమెరికా పర్యటన లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రాబోయే రెండేళ్లలో సొరంగం పూర్తి

–తద్వారా నల్లగొండ జిల్లాలోని ఫ్లో రైడ్ రక్కసిని కట్టడి చేస్తాం
–అమెరికాలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ కంపెనీ సందర్శన
–అమెరికా పర్యటన లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా దీవెన, అమెరికా: రాబోయే రెండేళ్ళలో ఎస్.ఎల్.బీ.సీ సొరం గం ( slbc tunnel) పనులను రాబో యే రెండెళ్లలో పూర్తి చేయ డం ద్వా రా నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతో పాటు జిల్లాలో కరువుతో వ్యవసాయానికి ( agricul ture) దూర మైన 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించ ను న్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు సిని మాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

అదే సందర్భంలో హైదరాబాద్ నగర త్రాగునీటి అవ సరాలు తీర్చేం దుకు ఉద్దేశించిన సొరంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ ( gov ernment) హయాoలోనే అనుకు న్న సమయానికి పూర్తి చేయడం జరుగుతుం దని మంత్రి స్పష్టం చేశా రు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి( Komatireddy venkatreddy) సోమ వారం అమెరికాలోని ఒహ యోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషి నరీ మ్యాన్ ఫ్యాక్చరిం గ్ కంపెనీ సీఈఓ లాక్ హోంతో కలిసి సందర్శిం చారు.

ఈ సందర్భంగా టన్నెల్ తవ్వకానికి ఉపయోగించే అధునాతన నిర్మా ణ మెషినరీని సీఈఓ లాక్ హోం మంత్రికి చూపిం చి వాటి పనితీరు గురించి వివరించారు. అనంతరం లాక్ హోంతో సమావేశమైన మం త్రి టన్నెల్ తవ్వ కానికి ఇబ్బందిగా మారిన బేరింగ్ తో పాటు ఇతర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను వీలైనంత త్వరగా సమకూర్చాలని కోరారు. ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పూర్తయితే 3 లక్షల ఎకరాలకు ఎలాంటి పం పింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని తెలిపా రు.

అదే విధంగా ఉదయ సముద్రం ( udaya samudra m)లో భాగమైన బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టు ( brah mana vellemla) ద్వారా మరో లక్ష ఎకరాలకు పంపింగ్ ద్వారా సాగునీరు అందుతుం దని, మొత్తం గా 4 లక్షల ఎకరాల భూ ములకు సాగునీటి సదుపా యం కలిగించే ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ పనులు బేరింగ్ ( bering) తో పాటు ఇతర రిపేర్లతో ఆగిపోయాయని స్వయం గా ప్రభుత్వమే ప్రత్యేకంగా చొరవ తీసుకున్నందున బేరింగ్ తో పాటు ఇతర పరి కరాలను వీలైనంత త్వరగా అందించాలని రాబిన్స్ ( robins) కంపెనీ సీఈఓ లాక్ హోమ్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.

తవ్వకానికి అవసరమైన స్పేర్ పార్ట్స్ అందించడంలో ఆలస్యం జరు గుతున్న తరుణంలో స్వ యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రం గంలోకి దిగి ప్రాజెక్టు పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రాధాన్యతను రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్ కు వివరించారు. ప్రాజెక్టును వేగంగాపూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభు త్వం గ్రీన్ ఛానెల్ ( green Chan el) ద్వారా ప్రాజెక్టు పనులకు బిల్లు లు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీ సుకున్నందున బేరింగ్ తో పాటు ఇతర స్పేర్ పార్ట్స్ ను ( spare parts) వీలైనంత త్వరగా సమకూ రిస్తే తక్షణం చెల్లింపులు చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని ఆయన వివరించారు.

గ్రీన్ ఛానెల్ అమల్లో ఉన్నందున పనులు జరిగిన 40 రోజుల్లనే చె ల్లింపులు చేసే విధానం గురించి రాబిన్స్ కంపెనీ ( robins) సి ఇ ఓ లాక్ హోంకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు.మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి వివరణతో పూర్తి సంతృప్తి వ్యక్తం చేసిన లాక్ హోం SLBC టన్నెల్ నిర్మాణంలో ప్రధాన బేరింగ్ తో పాటు ఇత ర కటింగ్ స్పేర్ పార్ట్స్ ను అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

మరో రెండు నెలల్లో 7 డయామీట ర్లు కలిగిన బేరింగ్ తో పాటు ఇత ర స్పేర్ పార్ట్స్ ను షిప్ ద్వారా చెన్నైకి ( chennai) చేర్చుతామని అక్కడి నుంచి పనులు జరుగుతున్న ప్రాంతానికి పంపిస్తామని చె ప్పారని మంత్రి కోమ టిరెడ్డి తెలిపారు.ఈ ప్రాజెక్టును బ్లాస్టింగ్ ప్రక్రి యలో పూర్తి చేసే అవకాశం ఏమాత్రం లేకపో వడం కేవలం టన్నెల్ బోరింగ్ ద్వా రా మాత్రమే చేసే పరిస్థితులు ఉండ టంతో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి రాబిన్స్ కంపెనీతో చర్చలు జరిపి పనులను ముందుకు తీసుకెళ్తుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు రాబిన్స్ కంపెనీ సీఈఓ లాక్ హోమ్, సాగు నీటి పారుదల శాఖ నల్గొండ సీఈ వి. అజయ్ కుమార్, జైప్రకాశ్ అసో సియేట్ కంపెనీ డైరెక్టర్ పంకజ్ గౌర్ గారు, రాబిన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Minister komatireddy venkatreddy