Minister komatireddy venkatreddy : నిద్రమత్తు వీడి వెనువెంటనే మరమ్మత్తులు చేపట్టండి
--దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు ఇబ్బం దులు పడుతుంటే మీనమేషాలెం దుకు --రోడ్లు భవనాలు శాఖ సమీక్షలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నిద్రమత్తు వీడి వెనువెంటనే మరమ్మత్తులు చేపట్టండి
–దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు ఇబ్బం దులు పడుతుంటే మీనమేషాలెం దుకు
–రోడ్లు భవనాలు శాఖ సమీక్షలలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్లు చేయ డం ఎందుకు ఆలస్యం అవు తుందని రోడ్లు భవనాల శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venkatreddy) అధికా రులను ప్రశ్నించారు.ప్రజలు ఇబ్బందులుపడుతుంటే ఎస్టిమే షన్లు, టెండర్లని కాలం వెల్లదీస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశా రు. డిపార్ట్ మెంట్ లో సర్వీస్ రూల్స్ కావాలంటే తెచ్చా, ట్రాన్స్ ఫర్లు చేసుకుంటామంటే అనుమతించానని, మీరు ఏదడిగితే అది చేస్తున్నప్పటికి మీ పనితీరు ఏం మెరుగుపడలేదని మండిపడ్డారు.
బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్ లో ఆర్అండ్ బీ ( r& b) లోని వివిధ విభాగాల పనితీరుపై అధికారుల తో సమీక్ష నిర్వ హించిన మంత్రి శాఖలో కొందరు అధికా రుల అలసత్వంపై (On the negli gence of the authorities) తీవ్రంగా స్పందిం చారు.ముందుగా వరంగల్ జిల్లాలోని మామునూర్ ఎయిర్ పోర్ట్ (air port) పై ఎవి యేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, ఆర్ & బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ శ్రీమతి దాసరి హరి చంద న, ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంక ట్ రెడ్డి త్వరితగతిన భూసేకరణ(Land Acquisition) చేప ట్టి రెండేళ్లలో ఎయిర్ పోర్ట్ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆదేశాలు జారీ చేశారు.
తాత్కాలిక ఏర్పట్ల కన్న భవిష్యత్ అవస రాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు సూచిం చా రు. ప్రతీ పదిహేను రోజులకో సారి పనుల పురోగతిపై రివ్యూ (Rev iew of progress of works) చేస్తానని చెప్పి న మంత్రి గత ప్రభుత్వం లా గా హామీలతో కాలం వెళ్ల బుచ్చితే అర్ధం లేదన్నారు. ప్రజలకు చెప్పిం ది చెప్పినట్టు చేస్తేనే జవాబుదారి తనంతో కూడిన పాలన అందించ వచ్చని తేల్చిచెప్పారు.
విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టా లని ఏవియేషన్ డైరెక్టర్ ఉన్నతాధి కారులకు సూచిం చారు. వరంగల్ ( warangal) ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చేందుకు కావా ల్సిన ప్రణాళికలను సిద్ధంచేయాలని ఆదేశిం చారు.ఉమ్మడి వరంగ ల్ జిల్లాలో యునెస్కో ( unesco) సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తం భాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్, రాంపూర్ ఇండస్ట్రీయల్ ఏరియా వంటి పారిశ్రామిక ప్రాంతా లున్న దృష్ట్యా, అందుకు అనుగు ణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దా లని సూచన చేశారు.
స్థానిక నాయ కులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్ పోర్ట్ స్థితిగతులపై పరిశీలిస్తానన్న చెప్పిన మంత్రి రివ్యూలో పాల్గొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరి ( kadiyam srishai lam) తో పాటు జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఇతర ఎమ్మె ల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసు కొని పనులను స్పీడప్ చేయా లని ఆదేశించారు.మన పక్కరాష్ట్రా ల్లో రోడ్ల రిపేర్లకు జెట్ ప్యాచ్ వర్క్ ( Jet patch work) మెషిన్లు, వెలా సిటీ ప్యాచింగ్ వంటి అధునా తన పద్ధతులతో పాట్ హోల్స్ పడి న వెంటనే పూడుస్తూ ప్రజలకు మెరుగైన రోడ్లు అందిస్తుంటే, దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉన్న మన దగ్గర మాత్రం ఇంకా పురాత న పద్ధతుల్లో పాట్ హోల్స్ రిపేర్లు చేస్తున్నామని, ఇది మన ఆర్ & బీ అధికారులకు తమ నైపుణ్యాల పట్ల ఉన్న శ్రద్ధ అంటూ సున్నితంగా చురకలు అంటించారు.
రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే దాదాపు 4-5 వేల కోట్ల విలువ చేసే రోడ్ల ను రిపేర్ చేయవచ్చని కానీ, ఎక్కడా ఆవైపుగా పనులు జరగడం లేదని స్టేట్ రోడ్స్ సీఈ మోహన్ నాయక్ ను ప్రశ్నించారు. కొత్తగా వ చ్చిన ఏఈ ఈలను ఇప్పటిదాక కనీసం ఫీల్డ్ మీదకు కూడ పంప కపోవడం ఏంటని నిలదీశారు.ఇంజనీర్లంతా ఎమ్మెల్యేల ( mla) ఇండ్ల చుట్టూ తిరుగుతూ కొత్త రోడ్లను ప్రపోజల్స్ తయారు చేసే కన్స ల్టెంట్లుగా మారారని. అసలు పాట్ హోల్స్ తో ప్రజలు ఇబ్బందు లు పడుతున్నారన్న సంగతి ఇంజనీర్లకు తెలుసా అని ఆయన ప్రశ్నిం చారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన పీపీపీ మోడల్ రోడ్స్ ( PPP Model Roads) పై ఐడెంటీఫికేషన్ పై స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ ను అడగ్గా, ఇప్పటి వరకు 1787 .06 కిలోమీటర్ల కలిగిన 20 రోడ్లను గుర్తించామని చెప్పారు. ఏ రోడ్డు నిర్మాణ పద్దతి అవలంభించి నా అంతిమంగా ప్రజల మీద భారం పడకుండా ఉండే పీపీపీ మోడల్ ను తీసుకురావాలని ఈ సందర్భం గా మంత్రి చెప్పా రు. కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వంటి రాష్ట్రా ల్లో ఆర్డీసీ ( rtc ) అనుసరిస్తున్న రోడ్డు నిర్మాణ పద్ధతులను అను సరిస్తు న్నామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.
*టీమ్స్ హాస్పిటల్ నిర్మాణంలో జాప్యం ఎందుకు*..ప్రతీ రివ్యూలో అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అంటున్నారు ప్రారంభించే టైం పెం చడం తప్పా ఇప్పటిదాక ఏం పురో గతి కనిపించడం లేదని బిల్డింగ్స్ సెక్షన్ సీఈ రాజేశ్వర్ రెడ్డిపై మంత్రి అసహనంవ్యక్తం చేశారు. నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ ( tims hospi tals) నిర్మాణంలో ఇప్పటిదాక ఒక్క పురోగతిని చూపించలేదని నిర్వేదం వ్యక్తం చేశారు. ప్రజలు ప్రాథ మిక అవసరమైన హాస్పిటల్స్ నిర్మాణంలో ఇంత నిర్లక్ష్యం దేనికని ప్రశ్నించారు. ప్రభుత్వం దవాఖా నాలు అందుబాటులోకి రాకపోతే పేద ప్రజలు కార్పోరేట్ హాస్పిటల్స్ లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి చికి త్సలు తీసుకోకుండా ప్రాణాలు పొగొట్టుకుంటారని, దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ముఖ్యమంత్రి ( cm) తో, ఉప ముఖ్యమంత్రితో మీ ముందే మా ట్లాడి బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నానని, అయినా ఎందుకు నిర్మాణాలు ఆలస్యం జరుగుతున్నాయని ఆయన నిల దీశారు. రోజు వేలాదిమంది వచ్చే నిమ్స్ ( nims ) భవన నిర్మాణ పను లు నత్తనడకన సాగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారని పశ్నిం చారు. ఇప్పటికైనా అధికారులంతా కలిసికట్టుగా పని చేసి వచ్చే జూలై, 2025 నాటికి టిమ్స్ హాస్పిటల్స్ ను అందుబాటులోకి తీసు కురావాలని సూచించారు. నాణ్యత లో ఎక్కడా రాజీపడొద్దని అధికారు లకు సూచించారు.ఈ క్రమంలో మంత్రి, సెక్రెటరేట్ లోని తన చెయి ర్ క్రింద టైల్స్ ఫిటింగ్ నిర్లక్ష్యాని అధికారులకు స్వయంగా చూపించారు.
వెయ్యికో ట్లకు పైగా ఖర్చు పెట్టినమని చెప్పిన రాష్ట్ర సచి వాలయం లో ( secretariat) మన ఇంజనీర్ల పనితీరు ఇంత నిర్లక్ష్యంగా ఉం దని,టైల్స్ మధ్యనున్న గ్యా ప్స్ ను చూపించారు. మనం ఖర్చు పెట్టే ప్రతీ పైసా ప్రజల సొమ్మని, దాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చి నట్టు చేస్తామంటే కుదరదని హెచ్చరిం చారు. గత ప్రభుత్వంలో మా దిరిగా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూసీచూడనట్లు వదిలే ప్రస క్తేలేదని తేల్చిచెప్పారు. ప్రతీది నాణ్యంగా ఉండాలి, ప్రతీ పని ప్రజలు మెచ్చు కునేలా చేయాలని సూచించారు.
ప్రతీవారం టీమ్స్ హాస్పి టల్ భవ నాల నిర్మాణ స్థితిగతులపై(On construction con ditions) రివ్యూలు నిర్వహించి రిపోర్ట్ ఇవ్వాలని స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రెటరీ శ్రీమతి దాసరి హరిచం దనను ఆదేశించారు.ఇదే క్రమంలో ఒక్కొక్కరికి రెం డు, మూడు అదనపు బాధ్యతలు ఉన్నాయని ప్రమోషన్లు ఇస్తే, కొంత భారం తగ్గుతుందని ఈఎన్సీ ( enc ) మధు సూధన్ రెడ్డి మంత్రి దృష్టికి తీసు కురాగా ఇన్ని బాధ్యతులు మోస్తే ఎందుకు పాట్ హోల్స్ రిపేర్ కాలేదు, ఎందుకు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణం పూర్తి కాలే దని ప్రశ్నించా రు. హక్కుల గురిం చి అడిగేటప్పుడు బాధ్య తలు కూడా నిర్వర్తించాలని సున్నితంగా హెచ్చరించారు.
Minister komatireddy venkatreddy