Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : గుంతల రహితరోడ్లకై వ్యూహాత్మక ప్రణాళిక

గుంతల రహితరోడ్లకై వ్యూహాత్మక ప్రణాళిక

–గత పదేళ్ళ ప్రభుత్వంలో నిర్లక్ష్యంగా రహదారులు 
— గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్టు కేసిఆర్ రూలింగ్
–అధునాతన సాంకేతికత అంది పుచ్చుకునేందుకు అధికారులకు స్వేచ్ఛ
–రాబోయే రోజుల్లో అద్దంలా 9 వేల కిలో మీటర్ల రహదారులు

ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో రోడ్లపై గుంతలను పూడ్చేందు కు అధునాతన (Sophisticated) పద్ధతులు, మెషినరీని ఉప యోగించి వేగంగా గుంతలను పూడ్చేందుకు ప్రణాళికలు (planin g)సిద్ధం చేశామని రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy venka treddy) స్పష్టం చేశారు.సోమవారం రంగారెడ్డి జిల్లా మొయినా బా ద్ మండలం చిలుకూర్ గ్రామం వద్ద రహదారులపై ( roads) గుం తలను పూడ్చేందుకు సిద్ధం చేసిన ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ (Air press urejetpatcher)తో పాటు పాట్ హోల్ అండ్ రోడ్ మె యింటెనెన్స్ మిషనరీ పనితీరును ఆ శాఖ స్పె షల్ ఛీఫ్ సెక్రెటరీ వి కాస్ రాజ్, స్పె షల్ సెక్రెటరీ దాసరి హరిచందనతో కలిసి మంత్రి ప రిశీలించారు.

స్వయంగా ఎయిర్ ప్రెషర్ జెట్ ప్యాచర్ మెషినరీ పనితీరు గురించి టెక్ని షియన్లతో చర్చించారు.6mm మరియు 25mm స్టోన్ మెటీరీ యల్ మరియు డస్ట్ తో కూడిన మిశ్ర మం ఏ విధంగా రోడ్లపై గుంత లను పూడుస్తుందో పరిశీలించారు. రోజు కు 10-20 కిలోమీటర్ల మే ర గుంతలను పూడ్చే సామర్ధ్యం (Ability to fill potholes) కలిగిన రెండు మిషన్లను ఆయన స్వయంగా పరిశీలించి మిషన రీ సామర్ధ్యం గురించి, వాటి పనితీరుగురించి టెక్నిషీయన్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్వయంగా మీడియా (media) కు రోడ్లపై గుంతలను మరమ్మత్తు చేసే విధానాన్ని చూపించారు.

రోడ్లపై గుంతలను సంప్రదాయ ప ద్ధతుల్లో నింపడం వల్ల నెలల సమ యం పడుతుందని ఈ లోపు రహ దారులపై మరోచోట గుంతలు పడుతున్నాయని, మెకనైజ్డ్ రోడ్ రిపేరింగ్ విధానంలో (Mechani zed road repairing system) గుం తలను పూడిస్తే తక్కువ సమయం లో ప్రజలకు మెరుగైన రవాణా వ్య వస్థను అందించవచ్చ ని ఆయన తెలిపారు. అంతేకాదు, 90% కార్భన్ ఎమిషన్స్ ను తగ్గించగలిగే ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల (Eco frien dly methods) వల్ల పర్యావరణా నికి హాని తక్కువగా ఉండటంతో పాటు రద్దీగా ఉండే రహదారులపై పనులు వేగంగా చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయని ఖచ్చి తత్వంతో ప్యాచ్ వేయగలిగే మెక నైజ్డ్ సిస్టం వల్ల ప్యాచ్ వేసినట్టు కని పించకుండా సహజంగా రోడ్డు వేసి నట్టే ఉంటుందని, దాని వల్ల వాహ నాలు కుదుపులకు గురికాకుండా పూర్తిగా రోడ్డంత ఒకేసారి వేసినట్టు ఉంటుందని ఆయన తెలిపారు.

వీటితో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ రోడ్లను తక్కువ సమయం లో రిపేర్లు చేయడం వల్ల ప్రభుత్వా నికి ఆర్ధిక భారం తగ్గడంతో పా టు ప్రజలకు గుంతలు లేని రోడ్లు అం దుబాటులోకి వస్తాయని ఆయ న చెప్పారు.గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఇప్పటికి ప్రభుత్వా నికి గుది బండగా మారిందని రాష్ట్రంలో ఏ ఊరికి పోయిన రహదా రులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, 7 లక్షల కోట్ల అప్పులు చేసి దోచు కొని తెలంగాణ ప్రజలపై భారం మోపిన కేసిఆర్ ( kcr) కనీసం రోడ్ల పై గుంతలు కూ డా పూడ్చలేదని ఆరోపించారు.

ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు (Better living standar ds of people) అందించడంలో రోడ్లు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పిన మంత్రి అందుకు అనుగుణంగా వ్యూహాత్మక ప్రణాళికలను ( Stra tegic plans) అమలు చేస్తున్నా మని, రాబోయే రోజుల్లో ఎక్కడా గుంతల నేవి లేకుండా చేస్తామని తేల్చిచెప్పారు. ఈ కార్యక్ర మంలో ప్రభుత్వ ఛీఫ్ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య తో పాటు ఆర్ అండ్ బి ఉన్నతా ధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Minister komatireddy venkatreddy