Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister komatireddy venkatreddy : అంతర్జాతీయస్థాయిలో మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి

--రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అంతర్జాతీయస్థాయిలో మామునూర్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి

–రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూర్ ఎయిర్ పోర్ట్ను  (Mamunur Air port) యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి (komatireddy venkatreddy)  అన్నారు. సోమవా రం ఆయన సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మామునూర్ ఎయిర్ పోర్ట్ కు అడ్డంగా మారిన 150 కిలో మీటర్ల జీఎమ్మాఆర్ ( gmr) నిబంధనను ఉప సంహరించుకు నేలా చేసేందుకు అనేక సమావేశాలు నిర్వహించి ఒప్పించినట్టు మం త్రి తెలిపారు.

ఈ నెల 6వ తేదిన ఏవియేషన్, రెవెన్యూ అధికారుల (revenue officers) తో సమావేశమై ఎయిర్ పోర్ట్ కు కావాల్సిన, 280.30 ఎక రాల భూమిలో 253 ఎకరాలను రైతుల నుంచి సేకరించాల్సి ఉ న్నందున, ఈ భూసేకరణపై అంచనాలు రూపొందించి కేబినెట్ (cab inet) లో ఆమోదం పొందేలా చేశామని తద్వారా రూ. 205 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.వరంగల్ జిల్లా మామునూర్ ఎ యిర్ పోర్ట్ గురించి దశాబ్ధాలుగా వింటున్నామని, బీఆర్ఎస్ ( br s) ప్రభుత్వం సైతం అదిగో మాము నూర్, ఇదిగో మామునూర్ ఎయి ర్ పోర్ట్ అంటూ ఊరించిందని కానీ ఒక్క ఇటుక వెయ్యలేదని ఆయ న ఆరోపించారు.

అట్లాంటి ఎయిర్ పోర్ట్ ను రాబోయే 8 నెలల కాలంలో ప్రారంభం చే యబోతున్నామని ఆయన చెప్పారు.  మొదటి దశలో మామునూర్ ఎయిర్ పోర్ట్ ను స్మా ల్ ఎయిర్ క్రాఫ్ట్స్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, మాస్టర్ ప్లాన్ ( master plan) తయారీ, ఎయిర్ పోర్ట్ డెవలప్ మెంట్ చేసేందుకు 8 నెలల పూర్త వుతుందని చెప్పిన ఆయన రెండవ దశలో రోజంతా ఇంటర్ నేషనల్ విమానాలు (పెద్ద విమానాల -A32 0, B737)  మరియు కార్గో విమా నాల ఆపరేషన్ చేయడానికి రాను న్న  1 సంవత్స రం 6 నెలల్లో  అవసరమైన చర్య లు తీసుకుంటున్నామని,  దీనికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (Airport Authority of In dia) నుంచి ఆదేశాలు వచ్చాయని ఆయన ప్రకటించారు.

ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎక రాల భూసేకరణకు (For land ac quisition) రూ. 205 కోట్ల రూపాయలను విడు దల చేస్తూ ఇచ్చిన జీఓ ను మీడియా ప్రతినిధులకు అందించారు. ఈ ఎయిర్ పోర్ట్ ను భవిష్య త్తులో అంతర్జాతీయస్థాయి విమాన శ్రయం గా ( international airport) తీర్చిదిద్దుతామని చెప్పారు. తి రుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు ప్రాం తాలకు ప్రయాణికులను తీ సుకెళ్లేందుకు పెద్ద విమానాలను ( plains) నడి పే విధంగా ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేస్తామని చెప్పిన ఆయన రాబోయే రోజుల్లో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఏయిర్ పోర్టులకు (For green fie ld airports)  వీలైనంత త్వరగా అనుమతులు సాధించి నిర్మాణం చేపడతామని చెప్పారు.

ఇందుకు సంబంధించి ఇప్పటికే పౌరవిమాన యానశాఖ మంత్రి రా మ్మోహన్నా యుడు ( minister rammohan naidu) తో చర్చించామని వారు కూడా సానుకూలంగా స్పందించారని మంత్రి గుర్తుచేశారు. బీఆర్ఎస్ పార్టీ పదేండ్లలో సాధించని ఎయిర్ పోర్టు లను నాలుగేండ్లలో సాధించి చూపిస్తామని మంత్రి తెలిపారు.

*హైదరాబాద్, విజయవాడ రహదారి అభివృద్ధి…* హైదరా బాద్, విజయవాడ (NH-65 ) విస్తర ణ పనులు చేపట్టాలని నేను అడిగి న వెంటనే కేంద్ర మంత్రి లు నితిన్ గడ్కరీ  6 వరుసల ఎక్స్ ప్రెస్ హై వేను మంజూరీ చేశారని చె ప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన డిపిఆర్ ( dpr) పూర్తయ్యే స్టేజీలో ఉందని,  డీపీఆర్ పూర్తయిన వెంటనే జనవరి లేదా ఫిబ్రవరిలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభి స్తామని ( works start) మంత్రి తెలిపారు. దీంతో హైదరాబాద్, విజయవాడ మధ్య ప్రయాణం మరింత మెరుగవుతుందని, ప్రయా ణ సమయం తగ్గుతుందని తద్వా రా విమానాల్లో వెళ్లే ప్రయాణికులు సైతం రోడ్డు మార్గంలో వెళ్తారని ఆయన వెల్లడించారు.

హైదరాబాద్,  భూపాలపట్నం NH-163 పరి ధిలో నిర్మిస్తున్న ఉప్ప ల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆగష్టు 20 18 లో శంకుస్థాపన చే శారని, గత ప్ర భుత్వంలో కేవలం 30 శాతం పనులనను మాత్రమే పూర్తిచేశారని, హైదరాబాద్ అభివృద్ధి చేసిన మని చెప్పుకు తిరిగే బీఆర్ఎస్ నాయ కులు నాలుగున్నరేండ్లలో ఉప్పల్ ( uppal ) ఫ్లై ఓవర్ ను ఎందుకు పూర్తి చేయ లేకపోయారని ఆయన ప్రశ్నించారు. వర్షాలు పడి రోడ్డు ప్రమాదాల్లో( road accidents) అనేకమంది చనిపోవడం, క్షతగాత్రులై ఇబ్బందులు పడుతుంటే నాలుగున్నరేండ్లు ఏం చేశారని ఆయన నిలదీశారు.

మేం వచ్చిన తర్వాత పనులు చేయని సంస్థను ఫోర్ క్లోజ్ చేసి కొత్త గా పనులు ప్రారంభించామని ఇప్పటికే పది నెలల్లోనే 50 శాతం  ప నులను పూర్తి చేశామని ఆయన చెప్పారు. ఉప్పల్ చౌరస్తా నుంచి  సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (CPRI) నారపల్లి వరకు దాదా పు 5 కిలోమీటర్లు ఉన్న ఫ్లైఓర్ నిర్మాణంలో మేడిపల్లి నుంచి CPRI వరకు ఫ్లైఓవర్ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందని ఆయన చెప్పారు. ఉప్పల్ నుంచి మేడిపల్లి వరకు ఫ్లైఓవర్ (flyover) పూర్తి కావడా నికి ఒకటిన్నర సంవత్సరం పడుతుంది చెప్పిన మంత్రి, ఇప్పటి వరకు ఫ్లైఓవర్ క్రింద 4 వరుసల రహదారిని 2 కిలోమీటర్ల మేర రోడ్డు వేసి ప్రజలను ఇబ్బందుల నుంచి దూరం చేశామని చెప్పారు.

ఇంకా బీటీ చేయాల్సి ఉందని. వచ్చే మార్చి నెలకల్లా సర్వీస్ రోడ్ల ను పూర్తి చేస్తాం. శ్రీశైలం ( srishilam) ఏరియాలో ఎలివెటెడ్ కారి డా ర్ రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టేం దుకు ప్రయత్నాలు చేస్తున్నా మ ని, కేంద్రం ఆమోదం తెలిపితే అద్భుత మైన జాతీయ రహదారి ( na tio nal highways) రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయ న తెలిపారు చత్రపతి శివాజీ ( chatrapathi shivaji) మహారాజ్ ప్రయాణించిన రోడ్డును జాతీయ రహదారిగా మార్చేం దుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

*దక్షిణ భాగం రాష్ట్రమే నిర్మిస్తుంది.*…. రీజినల్ రింగ్ రోడ్డు ( rrr) ను 2017-18 లో ప్రారంభించారని, ఇప్పటిదాక ఒక్క పనిని కూడా మొదలు కాలే దని,  హైదరాబాద్ అభివృద్ధికి, తెలంగా ణ అభివృద్ధికి సూపర్ గేమ్ ఛేంజర్ ( Supergame changer) లాంటి ఆర్ఆ ర్ఆర్ ను నిర్లక్యం చేసి నవారు రెండు బ్రిడ్జులు కట్టి మేమే హైదరా బాద్ నిర్మాతలమని చెప్పు కు తిరిగడం వారికే చెల్లిందని ఆ యన ఎద్దేవా చేశారు. వారు పదేం డ్లలో కేంద్రంతో మాకేం అని అన్న రీతిలో వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల రాష్ట్ర అ భివృద్ధి ( state development) వెనకబడ్డదని, రాజకీయాల్లో ఈగోలకు తావులేదని ఆయన తేల్చిచెప్పారు.

మనమంతా ప్రజల కోసం పని చేస్తున్నామని,  జవాబుదారిగా ఉండా లని ఆయన చెప్పారు. ఆర్ ఆర్ఆర్ రోడ్డు నిర్మా ణం మొదట కేంద్ర మే నిర్మిస్తుందని చెప్పారు. కానీ ఇప్పటికీ కేంద్ర ప్రభు త్వం( union government) పూర్తిస్థాయిలో క్లారిటీ మరి యు కమిట్ మెంట్ ఇవ్వలేదు. దీం తో పనులు ఆలస్యం జరిగితే రాష్ట్ర అభివృద్ధికి ఆటం కం జరుగుతుం దనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్ఆర్ఆర్ దక్షి ణ భాగం స్వయం గా నిర్మించాలనుకుంటున్నాం. ఈ రోడ్డును 6/8 లేన్స్ లో ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో ఢిల్లీ,ముంబాయి ఎక్స్ ప్రెస్ వే, ముంబయి-నాగపూర్ ఎక్స్ ప్రెస్ వే, చెన్నై-కన్యాకుమారి  ఎక్స్ ప్రెస్ వే, గుజరాత్ స్టేట్ రీజిన ల్ రింగ్ రోడ్డు నిర్మించిన ప్రమాణా లతో RRR దక్షిణ భాగం నిర్మించిం దుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.

RRR దక్షిణ భాగం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మి స్తున్న ఫోర్త్ సి టీకి, ఎయిర్ పోర్ట్ కు కనెక్టివిటీ ( conectivity ) కల్పిస్తుంది. దీంతో ఆ యా ప్రాంతాలు సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, లాజిస్టిక్, మ్యాన్ ఫ్యా క్చరింగ్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్ రంగాలు అభివృద్ధి చెందుతాయని మంత్రి చెప్పారు. అన్ని అనుకున్న ట్లుగా జరిగితే వచ్చే నెలలోనే టెం డర్లు పిలుస్తామని చెప్పిన ఆయన రీజి నల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం అలైన్ మెంట్ అధ్యయనం మరి యు ప్రతి పాదించడం కోసం  స్పెష ల్ ఛీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక ఆఫీసర్స్ కమిటీని నియమించడం జరిగింది. ఈ కమిటీ మొదటి స మావేశం ఇప్పటికే పూర్తయ్యింది.

అంతేకాదు, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ ఇంప్లి మెంటేషన్ యూనిట్ ఏర్పాటు చేశామని దీనికి ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రెటరీ దాసరి హరిచందన, ఐఏ ఎస్ ను నియమించినట్టు మంత్రి తెలిపారు.  ప్రభుత్వం రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ నిర్మాణానికి, డీపీ ఆర్ ప్రిపరేషన్, కోసం టెండర్లు పిల వడానికి ఆదేశాలు జారీ చే సింది. ఇందులో టెక్నికల్ అడ్వైజరీ, ఫైనా న్షియల్ అడ్వైజరీలు ఉం టారని మంత్రి తెలిపారు.ఎంపిక చేసిన డీపీఆర్ కన్సల్టెంట్స్ (DPR Consultants) ఫీల్డ్ సర్వే చేసి అలైన్ మెంట్ ను ప్రతిపాదిస్తారు. ఇందు లో ఎన్ని లేక్స్ ఉన్నాయి, ఎంత ఎత్తులో రోడ్డు నిర్మాణం చే యాలి, ఎంత ఫారెస్ట్ భూములు ( forest lands) ఉన్నాయి, ఎంతమంది రైతుల నుంచి భూసేకరణ చేయాలి వంటి అంశాలను కులంకుషంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తా రని తెలిపిన మంత్రి ఫైనాన్సియల్  అడ్వైజర్ రోడ్డు నిర్మా ణానికి కావల్సిన నిధు లను సమకూర్చుకోవడానికి వరల్డ్ బ్యాంకు, జైకా, ఏడిబీ (ఎషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు) మొదలై న ఆర్ధిక సంస్థ లతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.

ఇక ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ఇప్పటి వరకు 94% భూసేకరణ పూర్తి చే శామని,  వాస్తవానికి 80% భూసేక రణ పూర్తయితే టెండర్లు పిల వవచ్చు కానీ, NHAI ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు మరియు భూ సేకరణకు సంబంధించిన పరిహారం ఇంకా ఫైనల్ చేయలేదని ఆయన తెలిపారు. భూసేకరణ పరిహారం విషయంలో రైతులకు న ష్టం జరగకుండా, మానవీయకోణంలో ( humanity ground )వ్యవహరించాలని ముఖ్యమంత్రి (cm) ఇప్పటికే అధికారులకు సూ చించారు. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అం త రైతులకు దక్కేలా ప్రయత్నిస్తున్నాం, రైతులు ఎవ్వరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని అం శాల్లో NHAI కి పూర్తి సమాచారం, సహ కారం అందిస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణం ఇక వాళ్ల చేతుల్లోనే ఉం టుం ది. రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం కొరకు 1895 హెక్టార్ల భూమి సేకరణ చేయవలసి ఉండగా, ఇప్ప టిదాక 1862 హెక్టార్ల భూమి కొర కు 3 (D) నోటిఫికేషన్ జారీ చేయ డం జరిగింది. 1320 హెక్టా ర్లకు డ్రా ఫ్ట్ అవార్డుల ప్రిపరేషన్ జరిగింది. మరియు 427 హెక్టార్ల భూమికి అవార్డు ఎంక్వైరీ (Award Inquiry)  జరుగుతున్నది. 94 హెక్టార్ల భూమి వివిధ దశల్లో కోర్టు కేసుల్లో ఉంది. ఇవన్ని వీలైనం త త్వరగా పూర్తి చేసి NHAI కి అప్పగిస్తమని మంత్రి తెలిపారు.

*మాది అభివృద్ధి, వాళ్లది ఫక్తు రాజకీయం :* మేం తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేయాలో అని ప్ర ణాళికలు( ploning) వేసుకొని ప్రయత్నాలు చేస్తుంటే,  రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతీ దాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మం డిపడ్డారు. మంగళవారం వరం గల్ జిల్లా పర్యటనలో ముఖ్యమం త్రి ఎనుముల రేవంత్ రెడ్డి ( cm revanth reddy) దాదాపు 4 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని చెప్పా రు.

కలెక్టర్ పై దాడి గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రైతుల ముసుగులో బీఆర్ఎ స్ లీడర్లు, కార్యకర్తలు కలెక్టర్ పై దాడి  చేయ డం హేయమైన చర్య (Atta cking a collector is a hein ousact)  అని ఆయన ఖండించారు. ఇలానే దాడి చేస్తే అనాడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసే వాళ్ళా అని ప్రశ్నించారు.  రేప్ కేసులో ఉన్న రౌడీ BRS పార్టీ కార్యకర్త లు ఐఏఎస్ పై దాడులు చేస్తుంటే ఖండించాల్సింది పోయి మా కార్య కర్తే నని సిగ్గులేకుండా కేటీఆర్ ( ktr) స్టేట్మెంట్లు ఇస్తున్నాడని మండిపడ్డారు.

అరెస్టుల చట్టం తనపని తాను చేసుకుంటూ వెళ్తోందని మాది అంబే ద్కర్ రచించిన రా జ్యం గం ఫాలో అయ్యే పార్టీ అని అందుకే ప్రతీది చట్ట ప్రకారం జరుగు తుందని తెలిపారు. వారిది కేసి ఆర్ ( kcr) రాజ్యాంగమని అందు లో న్యాయం, ధర్మం, చట్టం ఉండదని,  వాళ్ల కు నచ్చకపోతే జైలుకు పోయే పరిస్థితులను మనం కళ్లారా చూసా మని ఆయన చెప్పారు.  నేను ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్నపుడు కేసీఆర్ నన్ను అనేకసార్లు హౌస్ అరెస్టు చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి ( minister kishan reddy) ప్రజలు పదవులు ఇచ్చింది ఢిల్లీ లో ఉండి రాష్ట్రానికి మేలు చేయడానికా గల్లీలో ఉండదానికా అని ఆయన ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి కి దమ్ముంటే నల్గొండలో మూ డు నెలలు పడుకొని కాళ్ళు చేతు లు వంకలు కాకుండా హైదరాబాద్ ( hydarabad ) వాస్తరా అని ఛాలెంజ్ చేశారు కిషన్ రెడ్డికి ఢిల్లీ లో దోమల భాధకు తట్టుకో లేక హై దరాబాద్ లో  ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బాషీర్ భాగ్ లో రైతుల పై చంద్రబాబుతో కలిసి కేసీఆర్ కాల్పులు జరిపించి ఇప్పు డు రైతుల పై దొంగ ప్రేమ ఒలకబోస్తున్నారని ఆయన ఆరోపించారు. 80వేల పు స్తకాలు చదివిన కేసీఆర్ మూసీ శుద్ధీకరణ (Mousse Refine ment) వద్దు ప్రకటన చేయగలరా అని ప్రశ్నించారు.

*తెలంగాణ తల్లి విగ్రహ పను లను పరిశీలించిన మంత్రి :*
అనంతరం  సచివాలయంలో తెలం గాణ తల్లి విగ్రహ (The idol of Telanganas mother) నిర్మాణ పను లను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పనులు పూర్తి చేసేలా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. లక్షలమంది సాక్షిగా తెలం గాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కారిస్తామని చెప్పిన మంత్రి తెలంగాణ ప్ర జల బాగు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామని చెప్పారు. వారి ఆశీ ర్వాదం ఉంటే ఏ పక్షం కాంగ్రెస్ పార్టీ ( congress party) ని ఏం చే యలేవని వచ్చే ఇరవై ఏండ్లు కాంగ్రెస్ పార్టీదేనని తేల్చిచెప్పారు. అనంతరం నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీ లించిన మంత్రి నిర్మా ణంలో వాడు తున్న మెటీ రియల్ గురించి అడిగి తెలుసు కున్నారు. పనులు నాణ్య తగా ఉం డేలా నిత్యం పర్యవే క్షించాలని అధి కారు లకు ఆదేశాలు జారీ చేశారు.

Minister komatireddy venkatreddy