Minister komatireddy venkatreddy : జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగిరం
--రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి
జాతీయ రహదారుల నిర్మాణం మరింత వేగిరం
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: గత ప్ర భుత్వం పదేండ్లలో జాతీయ రహ దారుల నిర్మాణాల (Construct ion of national highw ays) గురించి పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో జాతీయ రహదా రుల అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా రని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమా టోగ్రఫీశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( komatireddy ve nkatreddy) ఆవేదన వ్య క్తం చేశారు. అధికారులు గతాన్ని పక్కన పెట్టి జాతీయ రహదారి ని ర్మాణ పనులను పరుగులు పెట్టించాలని ఆదేశించారు. ఎన్ని ఇబ్బం దులు ఉన్నప్పటికి జాతీయ రహదారుల నిర్మాణాలను ఆపొద్దని, తా ను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చి నా నా దృష్టికి తీసుకురావాలని అధికారులకు చెప్పారు.
బుధవారం బంజా రహి ల్స్ లోని మంత్రుల నివాసస ముదాయంలో జాతీయ రహదారు లపై నిర్వహించిన సమీక్షలో (review) మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. విజయవాడ, నాగ్ పూర్ సెక్షన్ (ఎన్.హెచ్.- 163 జీ) కి సంబం ధించి నిర్వహించిన సమీక్షలో నాలుగు వరుసలు గా నిర్మిస్తున్న ఎన్.హెచ్.-163జీ గ్రీన్ ఫీల్డ్ రహదారికి ( Greenfie ld Road) సంబంధించి 8 ప్యాకేజీలు అవార్డు అయ్యాయని, 300 కిలోమీటర్లున్న ఈ రహదారిని మెగా ఇంజనీరింగ్ సంస్థ (Mega Engineering Company) నిర్మిస్తున్నదని, భూసే కరణలో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా నిర్మాణ సంస్థ పనులు చేయడం లో జాప్యం జరుగుతుందని ఎన్ హెచ్ ఏ ఐ (nhai) ఆర్ఓ శివశం కర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ నాగేశ్వర్ రావు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన మంత్రి మెగా సంస్థ యాజమాన్యంతో మాట్లాడి భూసే కరణకు ఇబ్బం దులు (Problems with land acquisitio n) లేనిచోట, ఇప్పటికే భూసే కరణ చేసిన ప్రాంతాల్లో పనులను మొ దలు పెట్టాలని చెప్పారు. త్వర లోనే మంచిర్యాల, వరంగల్, ఖ మ్మం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి భూసేకర ణను వేగవంతం చేసేలా చర్యలు చేపడ తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్ , డిండి (ఎన్.హెచ్. 765) కి సంబంధించి 85 కిలోమీ టర్లున్న రహదారి పనుల అలైన్ మెంట్ కాపీని అధికారులు మంత్రికి సమర్పించారు. 2 వరుసల నుంచి 4 వరుసలకు అప్ గ్రేడ్ చేస్తున్న ఈ బ్రౌన్ ఫీల్డ్ రహదారినిపై ఒకటి రెం డు రోజుల్లో ముఖ్యమంత్రితో ( cm revanth reddy) సమావేశం ఏర్పాటు చేసి అలైన్ మెంట్ ను ఫైనల్ చేస్తామని, వెంటనే డీపీ ఆర్( dpr ) సిద్ధం చేసి పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఖమ్మం , దేవరపల్లి (ఎన్.హెచ్.365జీజీ) గ్రీన్ ఫీల్డ్ రహదారి రివ్యూ లో 4 వరుసలుగా నిర్మిస్తున్న రహదారి పనుల్లో నాణ్యత ప్రమాణా లను (Quality standards) ప్రతీరోజు పరీక్షించాలని, ఏదైనా నాణ్యతాలోపం ఉంటే సంబంధిత సంస్థపై కఠినచర్యలు తీసుకోవాల ని అధికారులను (officers )ఆదేశించారు. 90 కిలోమీటర్లున్న ఈ రహదారి పనులు ఇప్పటికే 60 % నుంచి 70% పూర్తయ్యాయని మంత్రికి వివరించిన అధికారులు, అందుకు సంబంధించిన ఫోటోల ను మంత్రికి చూపించారు.
2025 మే లేదా జూన్ కల్లా పనులను పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికా రులకు తేల్చి చెప్పారు.6 వరుసలుగా నిర్మిస్తున్న కర్నూల్, రాయ చూర్ (nh- 150c) గ్రీన్ ఫీల్డ్ రహదారి రెండు ప్యాకేజీలుగా పనులు జరుగుతున్నాయని, ఇందులో ఒక ప్యాకేజీ 38 కిలో మీటర్లు మరో ప్యాకేజీ 38 కిలోమీటర్లుగా (km) ఉన్నాయని మొదటి ప్యాకేజీ పనులు వచ్చే యేడాది మే, జూన్ కల్లా పూర్తవుతాయని, రెండవ ప్యాకేజీలో టన్నెల్స్ ( tunnels ) వంటి నిర్మాణాలు ఉన్నందున ఈ పనులు 20 25 డిసెంబర్ కల్లా పూర్తవుతాయని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందు బాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇక హైదరాబాద్ మన్నె గూడ జాతీయ రహదారి పనులకు సంబంధించిన రి వ్యూలో కొంత బ్రౌన్ ఫీల్డ్, మరికొంత గ్రీన్ ఫీల్డ్ గా 45 కిలోమీటర్ల పొడవుతో నిర్మి స్తున్న హైదరాబాద్ ( hydarabad), మన్నెగూడ (nh163) రహ దారి పనులు అవార్డు అయ్యాయని, 15 రోజుల క్రితం పనులు ప్రా రంభించిన విషయం మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 2 వరుసల నుంచి 4 వరుసలుగా అప్ గ్రేడ్ చేస్తున్న ఈ రహదారిపై అనేక ప్రమా దాలు జరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనులను మరింత స్పీడప్ చేయాలని మంత్రి అధికా రులకు సూచించారు.
హైదరాబాద్, నాగ్ పూర్ (ఎన్.హెచ్ 44) కు సంబంధించిన పనుల పురోగతిపై అధికారులను ఆరా తీసిన మంత్రి 17 కిలోమీటర్లు మరి యు 10 కిలో మీటర్లున్న రెండు ప్యాకేజీల ( packeges) గురించి మరియు హైద రాబాద్ బెంగళూర్ (nh 44) జాతీయ రహదారి ( national highways) పరిధిలో 12 కిలోమీటర్లున్న మూడో ప్యాకేజీ పనులు ఎక్కడి వరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నా రు.
అయితే, రోడ్ వైడెనింగ్, ఫ్లైఓవర్ల నిర్మాణాల్లో భూ సేకరణ ప్రధాన అడ్డంకిగా (Land acquisition is the main obst acle) మారిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందిం చిన మంత్రి రంగారెడ్డి ( rangareddy ) జిల్లా కలెక్టర్ తో మాట్లాడి భూ సేకరణకు ఉన్న అడ్డంకులపై చర్చించి, సమస్యను పరిష్కరిస్తా నని చెప్పారు. 4 వరు సల నుంచి 6 వరుసలుగా( 6 lines) విస్త రిస్తున్న ఈ రహదా రులు హైదరాబాద్ రాకపోకలు సాగించే ప్రయా ణికులకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తక్షణ ఉపశమనం కలిగి స్తాయ ని అధికారుల దృష్టికి తీసు కువచ్చారు.
హైదరాబాద్ , విజయవాడ (ఎన్.హెచ్-65) పై బ్లాక్ స్పాట్ల ( bloc kspots) పనులు జరుగుతున్నాయని, వాటిని పూర్తి చేయడానికి ఇంకా రెండు సంవత్స రాల కాలపరి మితి ఉందని అధికారులు మం త్రి దృష్టికి తీసుకురాగా, రోజు పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాల ( Passengers’ lives) పోగట్టుకుంటు న్నారని, కాలపరిమితివంటి అంశాల గురించి ఆలోచించకుండా ప నులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
జాతీయ రహదారులు రాష్ట్ర ప్రగతికి వెన్న ముకవంటివని వాటి వి షయంలో ఎక్కడా అలసత్వానికి తావు లేకుండా పనులు చేప ట్టాల ని సూచించారు. భూసేక రణ, అటవీ అనుమతులు ( forest per missios), బన్యన్ ట్రీల తొలగింపు వంటి అంశాలను సీరియస్ గా తీసుకొని పని చేయాలని సూచించారు. ప్రతీవారం జాతీయ రహదా రుల నిర్మాణ పనుల పురోగతిపై నివేదిక (Progress report) ఇవ్వాలని ఎన్. హెచ్. అధికారులను ఆదేశించారు.
Minister komatireddy venkatreddy