Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddyvenkatreddy : ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం ప్రతిష్టిస్తాం

ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం ప్రతిష్టిస్తాం

— రోడ్లు భవనాల శాఖమంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Minister Komatireddyvenkatreddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి దావోస్ పర్య టన నుంచి వచ్చాక చర్చించి ఆది భట్లలో రతన్ టాటా విగ్రహం ఏ ర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తా మని మంత్రి కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభ ట్లలో 25 కోట్ల రూపాయల తో ఆదిభట్ల నుంచి మంగళ్ పల్లి రోడ్డుకు శంకు స్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనంతరం బహి రంగస భలో పాల్కొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్ర మాలను ప్రజలకు వివరించారు.

దేశంలో తన సంప దలో సగానికిపైగా ప్రజల కోసం పం చిన దానశీ లురు రతన్ టాటా అని వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాది మం దికి ఉపాధి కల్పిస్తున్నా యని , టాటా కంపెనీ సీఎస్ఆర్ ఫండ్స్ తో ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తున్నామున్నారు. స్కిల్ సెంటర్స్ ను డెవలప్ చేసి యువతకు ఉ ద్యోగ ఉపాధి అవకాశాలు కల్పి స్తాని తెలిపారు. వారి సేవాతత్ప రతకు గుర్తుగా వారిని గౌరవించు కుంటూ ఆదిభట్ల లో అద్భుతమైన రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నా రు.

రాష్ట్రంలో ఎన్.హెచ్-65 విస్తరణ, ఆర్ఆర్ఆ ర్, ఇతర జాతీయ, రాష్ట్ర రాహదా రులు మౌళిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషిం చబోతున్నాయని గ్రామసభల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీ య భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేస్తు న్నామని చెప్పారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్న ప్పు డు 1 లక్ష రూ పాయలతో ఇందిరమ్మ ఇండ్లకు ఇచ్చినమని, ఇవ్వాల అది 10 లక్ష లతో సమానమని గుర్తు చేశారు.

ఆనాడు ఇళ్లు కావాలా అని అడిగి తే ఒక్కరు చేయి ఎత్తనంత స్థా యిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి పేదలకు ఇచ్చినామన, రేపు 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వ బోతున్నామని, మా సంక్షేమ కా ర్యక్రమాలు చూసి కేటీఆర్, హరీష్ రావుకు మైండ్ బ్లాంక్ అయ్యిం దన్నారు. ఈ సంక్షేమం వల్ల బీఆర్ ఎస్ పార్టీని ప్రజలు మరిచిపోతు న్నారని పనికి మాలిన ఆరోపణలు చేస్తున్నారు.మేం విమర్శలను ప ట్టించుకోం, న్యాయమైన సలహా ఎవ్వరు ఇచ్చినా స్వీకరిస్తాం.

గ్రామ సభలు ఈ వారం రోజులతో అయి పోయేది కాదు, నిరంతర ప్రక్రియ, ఇవ్వాల సభ అయిపోతే ఎట్లా అనే ఆందోళన అవసరం లేదు. రేషన్ కార్డులు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేలా ఏర్పాటు. ప్రజలకు భరోసానిచ్చిన మంత్రి. మాది మానవీయమైన సర్కారు. ప్రతీపేదకు సన్నబియ్యం ఇస్తాం. ఫార్మాసిటీ వద్దని ఆనాడే పోరా డాం. 14 వేల ఎకరాల్లో ఫార్మసిటీ వస్తే కాలనీ కాలనీలు లేచి పోవాల్సి వస్తుంది.

ఒక్క పరిశ్రమతో ఎల్ బీ నగర్ ఇవ్వాల చాలా ఇబ్బంది పడుతుంది. వాళ్లది ప్రజల్ని చంపే ఫార్మాసిటీ విధానం, మాది యు వతకు ఉద్యోగాలు కల్పించే స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివ ర్సిటీ, డాటాసెంటర్ వంటి భవిష్య త్ డెవలప్ మెంట్ యాక్టివిటీస్ మీద పనిచేస్తున్నాం. అందుకే వేల కోట్ల రూపాయల కంపెనీలు హైద రాబాద్ కు వస్తున్నయన్నారు.

ఇప్పటికే దాదాపు లక్ష కోట్ల రూపా లయ పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వంతో వివిధ కంపెనీలు ఒప్పందం చేసుకున్నా యి. ఇక్కడి ప్రజల్ని ఇబ్బందిపెట్టేం దుకు అప్పటి ఎమ్మెల్యే అసైన్డ్ భూ ములు కొని ఫార్మాసిటీకి ఇచ్చిం డు. ఫార్మాసి టీ అనేది ప్రజలు లేని రిమోట్ ప్రాంతాల్లో ఉండాలని కాం గ్రెస్ పార్టీ ప్రజాప్రభు త్వం వచ్చిన మూడు రోజులకే నిర్ణయం తీసు కున్నామని వివరించారు. హైదరా బాద్ నలుదిక్కులా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం వ్యూహాత్మకం గా, ప్రణాళికబద్ధం గా ముందుకు సాగుతుంది.

అందుకే శామీర్ పేట వరకు మెట్రో విస్తరణకు మంజూరీ ఇచ్చాం, ఆనాడు ఎంపీగా, ప్రతిపక్ష పార్టీలో ఉండే అనేక అభివృద్ధి కార్య క్రమాలను చేశాం. ఇప్పు డు అధికారంలో ఉన్నాం. నేను ఎమ్మె ల్యే కలిసి ఇబ్రహీం పట్నం ను అద్భుతంగా అభివృద్ధి చేస్తాం. ఆదిభట్ల మున్సిపల్ ఛైర్మన్ నిరంజ న్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్య క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.