Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddyvenkatreddy : హౌస్ కుంభ కర్ణుడు కెసిఆర్, దమ్ముంటే అసెంబ్లీకి వస్తావా

--కేటీఆర్, హరీష్ రావును నా కాలి గోటికి సరిపోరు --బిఆర్ఎస్ పార్టీని కేసీఆరే బొంద పెట్టుకుండు --స్థానిక సంస్థల్లో ఒక్క జడ్పీ స్థా నం కూడా గెలవలేవు --మేము తప్పుడు మాటలు చెప్పి నవన్ని చేస్తున్నాం --రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

 హౌస్ కుంభ కర్ణుడు కెసిఆర్, దమ్ముంటే అసెంబ్లీకి వస్తావా

–కేటీఆర్, హరీష్ రావును నా కాలి గోటికి సరిపోరు
–బిఆర్ఎస్ పార్టీని కేసీఆరే బొంద పెట్టుకుండు
–స్థానిక సంస్థల్లో ఒక్క జడ్పీ స్థా నం కూడా గెలవలేవు
–మేము తప్పుడు మాటలు చెప్పి నవన్ని చేస్తున్నాం
–రాష్ట్ర రోడ్లు,భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Komatireddyvenkatreddy :  ప్రజా దీవెన, నల్లగొండ: కెసి ఆర్ ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా ని ద్ర పోతున్నాడని రాష్ట్ర రోడ్లు, భవ నా లు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దే వా చేశా రు.శుక్రవారం నల్గొండలోని మీడి యాతో మాట్లాడుతూ కె సిఆర్, కేటీ ఆర్, హరీష్ రావులపై తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. వా రంతా తన కాలి గోటికి కూడా సరిపోరని అభివర్ణించారు. ప్రతి పక్ష హోదాలో ఉన్న కెసిఆర్ గత ఆరు నెలలుగా తన ఫామ్ హౌస్ లో పండుకొని కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లా డాలని సవాల్ చేశారు. బయటికి వచ్చి నీ తడాఖా ఏందో చూపిస్తా అంటున్నావుగా చూడడానికి మే ము సిద్ధంగా ఉన్నామని అన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా డిపా జిట్లు కోల్పోయారని అన్నారు.ఇంకా ఆయన ఇప్పుడేం చూపి స్తాడని ఎద్దేవ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర ఏమీ లేదని అన్నారు.

సకలజనుల సమ్మెతో పాటు పార్లమెంట్లో మేమంతా కొట్లాడినందుకు, శ్రీకాం త చారి లాంటి వారు ఎంతోమంది ప్రాణత్యాగం చేయడంతో సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింద ని అన్నారు.తెలంగాణ కోసం మే మంతా పదవి త్యాగం చేసి మళ్లీ తీసుకోలేదని పేర్కొన్నా రు,కెసిఆర్, ఆ పార్టీ నేతలు రాజీనామాలు చేయడం ఉప ఎన్నిక లకు పోవడం ఆంధ్రోళ్ల దగ్గర డబ్బులు దండుకోవ డమే పనిగా పెట్టు కున్నారని విమ ర్శిం చారు.అధికారంలో ఉన్నప్పు డు నల్గొండ జిల్లా లో ప్రాజెక్టును పూర్తి చేస్తానని విస్మరించాడని ధ్వజమెత్తారు.

ఇక్కడ ఒక్క ఇల్లు కూడా నిర్మించి పేదలకు ఇవ్వలేదని ఆరోపిం చా రు. 80 శాతం పూర్తి చేసిన సొరంగాన్ని కూడా కెసిఆర్ పట్టించు కోలే ద న్నారు.తాము రెండే ళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పూర్తిచేసుకుని సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించు కోవడం జరిగిం దన్నారు. బస్వాపు రం,గంధమల్ల రిజర్వాయర్లకు రూ.390 కోట్లు మంజూరు చేయిం చుకుని పనులు పూర్తి చేయించు కోవడం జరు గుతుందని పేర్కొ న్నారు. కెసిఆర్ ఇవన్నీ మర్చి పోవడంతోనే గత అసెంబ్లీ, పార్ల మెం ట్ ఎన్నికలలో ఇంట్లో కూ ర్చోబెట్టారని అన్నారు.

పలు స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కలేదని పేర్కొన్నారు. కెసిఆర్ చేసిన వన్నీ దొంగ దీక్షలు 10 ఏండ్లు మా టలకు గారడితో పాలన సాగించా డని విమర్శించారు. కెసిఆర్ నీకు, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని అన్నారు.కేటీఆర్ లాంటి చిల్లర బ్యాచ్ తో మాట్లాడమని, అసెంబ్లీకి వస్తే నీతోనే తాడోపేడో తేల్చుకుం టా మని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తుందని స్పష్టం చేశారు.

బిఆర్ఎ స్ ప్రభుత్వంలో ఐదుగురు జడ్జిల ఫోన్లు కూడా టాపింగ్ చేశా రని అన్నారు. దీంతో ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ అమెరికా నుంచి రావడంలేదని అన్నారు.వారు వస్తే మేము జైలుకు పోతామ ని కెసిఆర్ వాళ్ళ వద్దకు హరీష్ రావును పంపి రావద్దని చెప్పాడని అన్నారు. వీటన్నింటిపై కేసులు నడుస్తున్నాయని పేర్కొ న్నారు. అభి వృద్ధిపై చర్చించడానికి కేసీఆర్ ఏ జిల్లాకు వచ్చిన మాట్లాడానికి సిద్ధ మేనని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. నల్గొండను దత్తత తీసుకుంటానని ఇక్కడి ప్రజలను మోసం చేశాడని విమర్శించారు.

970 ఇండ్లు కట్టి ఎవరికి ఇవ్వలేదని అన్నారు.వీటిని మూడు కోట్లు పెట్టి రిపేర్ చేయించి పేద ప్రజలకు ఇస్తామని అన్నారు.పార్టీల కచ్చి తంగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇస్తామని మంత్రి పేర్కొ న్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని విమర్శించా రు. అయినప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందు కుపోతున్నామని అన్నారు. తమ ప్రభుత్వం అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇండ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అమలు చేస్తుందని అన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో భువనగిరి ఎమ్మె ల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, పాశం సంపత్ రెడ్డి, డిసిసిబి డైరెక్టర్ పాశం రామ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ జూలకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.