Minister Konda Surekha: ప్రజా దీవెన, హన్మకొండ: తప్పు జరిగిన సరిదిద్దుకోకుండా నిర్లక్ష్యంతో బాధ్యతారహితంగా వ్యవహరించిన కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పోలీస్ కమిషనర్ కు ఆదేశాలిచ్చారు. హనుమకొండ లోని కుమార్ పల్లి మసీదు దగ్గర రోడ్డు దాటుతున్న షాహిద్ అనే బాలుడిని ఓ కానిస్టే బుల్ బైక్ తో ఢీకొట్టాడు. ఈ ఘట నలో ప్రమాదానికి గురైన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీనిపై స్థానికులు కానిస్టేబుల్ ను ప్రశ్నిం చగా నేనేం కావాలని చేయలేదని, కావాలంటే కేసు పెట్టుకోండి అని దురుసుగా మాట్లాడి వెళ్లిపోయా డని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈ విషయం తెలుసుకున్న మంత్రి కొండా సురేఖ కానిస్టేబుల్ పై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బాలుడికి గాయాలు అయ్యాయని కనీస మా నవత్వం కూడా లేకుండా దురుసు గా ప్రవర్తిస్తాడా అని మండిపడ్డారు. ఈ విషయంపై వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కు మంత్రి కొండా సురేఖ ఫోన్ చేశారు. దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే గాక ప్రమాదంలో గాయపడ్డ బాలు డికి మెరుగైన చికిత్స అందించా లని మంత్రి సూచించారు.