— యాత్రను ప్రారంభించిన మాజీ మంత్రి ఎమ్మె ల్యే జగదీష్ రెడ్డి
Minister M.L.A. Jagadish Reddy : ప్రజా దీవెన,సూర్యాపేట : కేసీఆర్ పై కొండంత అభిమానంతోపాటు సాహ సోపేతమైన యాత్రగా ఎడ్ల బండ్లలో వెళ్లడం హర్షణీయమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనస భ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూ రు ఎస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ దేవాలయంలో పూజలు చేసి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంలో అత్యంత ఉత్సాహభ రితంగా ఈ యాత్ర ప్రారంభం కావ డం అందరినీ ఆకర్షించింది. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లా డుతూ బీఆర్ ఎస్ సభకు సూర్యా పేట నుంచి రైతులు ఎడ్ల బండ్లతో తరలివెళ్లడం ఆనందంగా ఉంద న్నారు.
చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా బీఆర్ఎస్ రజతోత్సవ స భ జరగబోతుందన్నారు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్న పా టను సూర్యాపేట రైతులు మళ్లీ గు ర్తు చేస్తున్నారని పేర్కొన్నారు. రై తాంగంతోపాటు అన్ని రంగాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని తెలుసుకున్నా ర న్నారు. దండగ అనుకున్న వ్యవ సాయాన్ని పండగలాగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు.
అందుకే కేసీఆర్ మీద అభిమానం తో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు రైతాంగం ఎడ్లబండ్లపై బయలుదేరి నట్లు చెప్పారు. ఎల్కతుర్తి మట్టిని తాకి, రజతోత్సవ సభను తిలకించి కేసీఆర్ మాటలు వినాలన్న రైతుల తపన ఎంతో ఆనందాన్నిచ్చింద న్నారు.