Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sitakka: మహిళా శిశుసంక్షేమంలో తెలం గాణ ఆదర్శం

–పోషకాహార తెలంగాణ నిర్మాణ మే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు
–కేంద్ర ప్రాయోజిత పథకాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా పెరగాలి
–బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగ న్వాడిలకు గుడ్డు దూరం
–ఉదయపూర్ చింతన్ శివిర్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

Minister Sitakka: ప్రజా దీవెన, రాజస్థాన్: రాజస్థాన్ రాష్ట్రంలో ని ఉదయపూర్ పట్ట ణంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో జరిగిన చింతన్ శివిర్ లో మంత్రి సీతక్క ప్రసంగిం చారు. కేంద్ర మహిళా సి సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో పాటు, అన్ని రాష్ట్రాల మహిళా సి సంక్షేమ శాఖ మంత్రులు అధికారు లు హాజరైన ఈ సదస్సుకు మహి ళా శి సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాం తి వెస్లీ లతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. మహిళా శిశు సంక్షేమం కోసం తెలంగాణలో అమ లవుతున్న ప్రత్యేక పథకాలు, సాధిం చిన పురోగతి, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం పై మంత్రి సీతక్క మాట్లాడారు. చిన్నారుల, గర్భిణులు బాలిం తలకు పోషకాహారం అందిం చడంలో అంగన్వాడి కేంద్రాలు పోషిస్తున్న పాత్రను వివరించారు. ఆదివాసి బిడ్డగా గ్రామీణ ప్రాం తాల్లో చిన్నారులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.

ఆకలికి మించిన శత్రువు లేదన్న జాతిపిత మాహాత్మ గాంధీ స్ఫూర్తితో తెలంగా ణలో ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి అనే పథకం ద్వారా గర్భిణీలు, బాలిం తలకు ప్రతిరోజు 200 ml పాలతో పాటు అదనపు గుడ్డును అందిస్తు న్నట్టు తెలిపారు. అందుకోసం ఏటా రూ. 296 కోట్ల ను ఖర్చు చేస్తున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. అంగన్వాడి చిన్నారులకు సైతం పాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. బాలామృతం ప్లస్ ద్వారా పోషకాహార లోపం ఉన్న పిల్లలకు, ప్రత్యేక పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదిక ప్రకారం సరైన పోషకాహారం అందకపోవటంతో దేశంలో 30 శాతానికి పైగా ఐదేళ్ల లోపు చిన్నారులు ఎదుగుదల లోపంతో బాధపడుతున్నారని, మహిళలు రక్తహీనతతో సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి సీతక్క గుర్తు చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పోరాడితే తప్ప ఈ సమస్యలను రూపుమాపలేమని పేర్కొన్నారు.

అయితే పోషకాలు అధికంగా ఉన్న కోడిగుడ్లను బిజెపి పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీ చేయడం లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు కోడిగుడ్లను ఇచ్చేందుకు సంస్కృత కారణాలు అడ్డుగా ఉంటే, కోడిగుడ్డు స్థానంలో అధిక పోషకాలు ఉండే ఇతర ప్రత్యామ్నాయ పదార్థాలను అందివ్వాలని, అనుగుణంగా కేంద్రం నుంచి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని కోరారు. చిన్నారులు, పిల్లలు దేశ వనరులని, వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదన్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను గుర్తు చేశారు.

తెలంగాణలో 35,700 అంగన్వాడి కేంద్రాలను నడుపుతున్నట్లు తెలిపిన మంత్రి సీతక్క, జాతీయ విద్యా విధానం, 2020 కి అనుగుణంగా అంగన్వాడి కేంద్రాల్లో అహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు అంగన్వాడి కేంద్రాలకు ఫర్నిచర్, ఆట వస్తువులను సరఫరా చేయటంతో పాటు రంగురంగుల పెయింటింగ్స్ తో అంగన్వాడి కేంద్రాలను తీర్చిదిద్దినట్లు తెలిపారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా స్వయం సహాయక బృందాల మహిళలచే అంగన్వాడి చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్ దుస్తులను ఉచితంగా అందజేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణలో మహిళా సాధికారత కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి విజయాలను మంత్రి వివరించారు. మహిళా సంఘాలను పారిశ్రామిక శక్తులుగా తీసినందుకు వారిచే సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఆర్టీసీ బస్సులను, క్యాంటీన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు మహిళా సంఘాల ద్వారా లక్షల సంఖ్యలో యూనిఫామ్ లను కుట్టించి సరఫరా చేసినట్లు తెలిపారు.

దేశంలోనే అత్యధికంగా అంగన్వాడి సిబ్బందికి వేతనాలు అందిస్తున్న ది తెలంగాణ ప్రభుత్వమని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అయితే
పెరిగిన ధరలు, జీఎస్టీ అమలు తర్వాత రాష్ట్రాలకు తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం తన వాటాను పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం తన వాటాగా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడి హెల్పర్ల గౌరవేతనాలను రూ. 10 వేలు, రూ. 7 వేలకు పెంచాలని కోరారు. తెలంగాణ తరహాలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ ప్రయోజనాలను కల్పించాలని సూచించారు.

తెలంగాణలో మహిళా సంక్షేమం కోసం 15.26 లక్షల మంది విడోలకి , 1.41 లక్షల ఒంటరి మహిళలకు నెలకు రూ. 2000 పెన్షన్ను అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే విడోలకి ఇస్తున్న పెన్షన్ లో కేంద్రం తన వాటాగా 200 రూపాయలు మాత్రమే ఇస్తోందని,
గత పది ఏళ్లుగా ఈ మొత్తం పెరగలేదని గుర్తు చేసిన మంత్రి సీతక్క, పెరిగిన ధరలు అవసరాలకు అనుగుణంగా పెన్షన్ మొత్తం పెంచాలని కోరారు.

మిషన్ వాత్సల్య కింద ..ప్రభుత్వ పిల్లల సంరక్షణ సంస్థలన్నిటిని జిల్లాస్థాయిలో బాల రక్ష భవన్స్ పేరుతో ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చినట్టు తెలిపారు. తద్వారా ఎలాంటి సమన్వయ సమస్యలు లేకుండా పిల్లలకి సంపూర్ణ సేవలందిస్తున్నామని పేర్కొన్నారు.తెలంగాణలో 33 జిల్లాల్లో 39 బాల రక్షక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చామని, అవసరం ఉన్న పిల్లల వద్దకు చేరుకొని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు.

హైదరాబాద్ నుండి శిశు విహార్ ద్వారా ఆరేండ్ల లోపు పిల్లల దత్తత ప్రక్రియను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని మంత్రి సీతక్క ఈ సందర్భంగా గుర్తు చేశారు.ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారుల కోసం చేపట్టిన చర్యలు, స్పెషల్ హోం ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్, స్పెషల్ హోమ్ పిల్లల కోసం 6 వేల చదరపు గజాల్లో నిర్వహిస్తున్న క్రీడా ప్రాంగణాలు, జువెనైల్ పిల్లల కోసం నైపుణ్య శిక్షణ కార్యక్రమాల వివరాలను మంత్రి సీతక్క వివరించారు.

మిషన్ శక్తి కింద అత్యాచార, ఫోక్ షో బాధితుల కోసం తెలంగాణలో పోలీసుల సహకారంతో 35 భరోసా సెంటర్లను నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. లైంగిక దాడులు అత్యాచార బాధితులకు గ్రీన్ చాలా ద్వారా పరిహారాన్ని అందిస్తున్నామన్నారు.తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనాధ పిల్లల కోసం దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ ను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు, ప్రతి ఏటా 240 మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని, అందులో 70 శాతం సీట్లను అనాధలకు రిజర్వ్ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

ద్విచక్ర, ద్విచక్ర వాహనాల డ్రైవింగ్ లో మహిళల కోసం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, అందులో ఇప్పటికే 8 మంది ట్రాన్స్ జెండర్ లతో పాటు మొత్తం 950 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నట్లు వెల్లడించారు. పని ప్రాంతాల్లో జరిగే లైంగిక వేధింపుల కేసులను సత్రం పరిష్కరించేందుకు ఎనిమిది లేబర్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్ జెండర్ లను ట్రాఫిక్ కానిస్టేబుల్ గా నియమించినట్లు మంత్రి సీతక్క తెలిపారు. ట్రాన్స్ జెండర్ ల కోసం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మైత్రి క్లినిక్ ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి అని గుర్తు చేశారు.

వికలాంగుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా జాబు పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా వికలాంగుల పరికరాల కోసం 50 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు.ఇలా తెలంగాణలో మహిళా శిశు సంక్షేమం కోసం అమలవుతున్న ప్రత్యేక పథకాలను మంత్రి సీతక్క వివరించడంతో పాటు, కేంద్ర సౌజన్యంతో అమలయ్యే పథకాల్లో కేంద్రం తన వాటాను పెంచాలని మంత్రి సీతక్క లెక్కలతో సహా వివరించారు.చివరగా అన్నార్తులు, అనాధలు, ఆకలి బాధ లేని సమాజాన్ని ప్రసాదించాలన్న సంత్ కబీర్ సూక్తితో, దాశరధిపత్యంతో తన ప్రసంగాన్ని మంత్రి సీతక్క ముగించారు.

అయితే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే సీతక్క ప్రసంగం భిన్నంగా సాగటంతో అంతా ప్రశంసించారు. సీతక్క ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న ఇతర రాష్ట్రాల మంత్రులు అధికారులు, చప్పట్లతో తమ సంఘీభావం తెలిపారు. మిజోరాం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లాల్రిన్ పుయీ తమ సంప్రదాయ కండువాను సీతక్కకు బహూకరించి అభినందనలు తెలియజేశారు