తెలంగాణసినిమాహైదరాబాద్

Minister Sridhar Babu : మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్య, సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ఎస్పీ బాలసుబ్రమణ్యం

–సంగీతానికి, పాటకు ఎల్లలు లేవ ని నిరూపించిన స్వరమాంత్రికుడు

–ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావి ష్కరణలో మంత్రి శ్రీధర్ బాబు

Minister Sridhar Babu : ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీ య సినీ సంగీత చరిత్రపై చెరగని సంతకం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొ న్నారు. భారతీయ 14 భాషల్లో 4 0 వేలకు పైగా పాటలు పాడి, పాటకు ఎల్లలులేవని నిరూపించిన స్వర మాంత్రికుడు అని కొనియాడారు. తరాలు మారినా, ఆయన పాట ని త్యనూతనంగా ప్రతీ తెలుగు హృద యాన్ని తట్టిలేపుతూనే ఉంటుంద న్నారు. ‘ది మ్యూజిక్ గ్రూప్ హై ద రాబాద్’ ఆధ్వర్యంలో రవీంద్రభార తిలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడి తో కలిసి సోమవారం లాంఛనంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సంగీత ప్రపంచంలో రారాజుగా పాటల పల్లకిలో నెలరా జుగా అమర గాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మనందరి గుం డెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకు న్నారన్నారు. కేవలం గాయకుడిగా మాత్రమే కాదు నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ కళాకారుడి గా మనల్ని అలరించారన్నారు. తె రపై కనిపించే నటులే పాడుతున్నా రా అని అనిపించేలా పాడటం ఆ యనకు మాత్రమే సాధ్యమయ్యింద న్నారు.

ఆయన గొంతులో పలికిన ప్రతి పా టలో ఒక భావం, ఒక జీవం ఉండే దన్నారు. నూతన కళాకారులను ప్రోత్సహించడంలో, కొత్త సంగీత పోకడలను స్వాగతించడంలో ఎ ప్పుడూ ముందుండేవారన్నారు. ఈ రోజు మనం ప్రారంభించుకున్నది కే వలం విగ్రహం మాత్రమే కాదని, అ ది సంగీతానికి, నిబద్ధతకు, విన యానికి ప్రతీక అన్నారు. అపారమై న సంగీత సంపదను, ఆయన పా టించిన ఉన్నతమైన విలువలను అది మనకు నిరంతరం గుర్తు చే స్తుందన్నారు.

కళలను ప్రోత్సహించేందుకు, కళా కారులను గౌరవించేందుకు తమ ప్ర భుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉం టుందన్నారు. కార్యక్రమంలో బం డారు దత్తాత్రేయ, రామచంద్రరావు, డా.కేఐ వరప్రసాద రెడ్డి, ఎస్పీ చర ణ్, శుభలేఖ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button