— మంత్రి తుమ్మలను కలిసిన అఖి ల భారత పద్మశాలి సంఘం
Minister Thummala : ప్రజా దీవెన, హైదరాబాద్: సహా యకుని పొదుపు వాటా రూ. 600 లను రూ. 800 గా పెంపునకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సా నుకూలంగా స్పందించారనిఅఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మ ర్తపు మురళి, అఖిల భారత పద్మ శాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్ లు తెలిపారు. తిఫ్ట్ ఫండ్ పథకం లో భాగంగా సహాయకుని వాటాగా చెల్లించే 600 రూపాయలను 800 చేయాలని వ్యవసాయ చేనేత శా ఖామాత్యులు తుమ్మల నాగేశ్వ ర రావును అఖిల భారత పద్మశాలి సంఘం సెక్రటరీ జనరల్ గడ్డం జగ న్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశా లి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మ ర్తపు మురళి, అఖిల భారత పద్మ శాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్ ల ఆధ్వర్యంలో గురువారం సెక్రటేరి యట్లో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిఫ్ట్ ఫండ్ పథకంలో భాగంగా సహాయకుడు పొదుపు మొత్తం 600 నుండి 800 పెంపునకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచం ద్రరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ చిక్క వెంకటేశ్వర్లు, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు కందగట్ల బిక్ష పతి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తడ క రమేష్, పద్మశ్రీ చింతకింది మల్లేశం అంకం పాండు, శ్యామల భాస్కర్, చెరుకు స్వామి, పోటబత్తిని రమేష్ తదితరులు పాల్గొన్నారు.