Minister Tummala : ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న సాంకేతికత విజ్ఞానం మేరకు రాష్ట్రంలోని అన్న దాతలకు ఏఐ సాంకేతిక పరిజ్ఞానా న్ని అందుబాటులోకి తీసుకురాను న్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన యాప్ ల వినియోగించడం వలన రైతుల విలువైన సమయం ఆదాఅ వడంతో పాటు రైతులు తమ పంట లకు ఖచ్చితమైన నివారణ చర్యలు తీసుకునే వీలుకలుగుతుందని అభి ప్రాయపడ్డారు. కృషివాస్ సంస్థ వా రు తమ యాప్ లో మార్పులు చే సుకొని, ఫీల్డ్ లో పర్యవేక్షించిన అ నంతరం శనివారం సచివాల యం లో వ్యవసాయశాఖ మంత్రి తు మ్మ ల నాగేశ్వరరావు కృషివాస్ సంస్థ ప్ర తినిధులతో సమావేశమయ్యారు.
రైతులందరు ఈ టెక్నాలజీని విని యోగించుకోవాలని కోరారు. అంతే కాకుండా ఇక్రిశాట్ వారితో సమన్వ యం చేసుకొంటూ ఈ సంస్థ వారికి సూచించారు.కృషివాస్ సంస్థ వారి తో పలుదఫాలుగా నిర్వహించిన స మావేశాలలో వ్యవసాయశాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు సంస్థ వారికి యాప్ లో చేయాల్సిన మా ర్పుల గురించి, సలహాలు సూచ నలు ఇచ్చి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయా లని ఆదేశించిన విషయం విదిత మే. ఈ సందర్భంగా ఆ సంస్థ వారు తయారుచేసిన ఏఐ టెక్నాలజీతో శాటిలైట్ ఇమెజింగ్ ద్వారా ముంద స్తుగానే పంటలకు వచ్చే చీడ పురు గులు, రసం పీల్చే పురుగులను గు ర్తించి, వాటిని మొదట్లోనే నిరోధిం చేవిధంగా టెక్నాలజీ గురించి మం త్రికి వివరించారు.
అదే సందర్భంలో పంట బయటకు కనిపించే వాటినే కాకుండా పంట అంతర్గతంగా ఉన్న రోగాన్ని కూడా గుర్తించి దానికి నివారణ చర్యలు కూడా సిఫార్సు చేస్తుందని, దీని ద్వారా వాటికి కావాల్సిన నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పొలంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మొక్కకు తెగులు సోకిందో ముందు గానే గుర్తించి దా నికి పిచికారి చేయాల్సిన మందును కూడా మనకు చెబుతుందన్నారు. దీంతో సంబందిత రైతు ఆ పంటకు పిచికారి చేసి పంటలను సరైన స మయానికి (Timely Intervent ion) సంరక్షించుకోవచ్చని, అసలు పొలం దగ్గరకి పోకుండా కూడా ఈ యాప్ ద్వారా పంట స్థితిగతులను తెలుసుకోవచ్చని మంత్రికి చెప్పా రు.
రైతుపంట ఎంత వేశారు, ఎన్ని ఎక రాలలో వేశారు అన్న డేటా కూడా రియల్ టైంలో వ్యవసాయ అధికా రులకు లభిస్తుందన్నారు. ఎక్కడైతే తెగుళ్ళు ఏర్పడుతుందో, దానినే ముందుగా గుర్తించి, నివారణ దిశ గా చర్యలు తీసుకోవడం వలన రై తులకు మిగతా పొలానికి తెగులు ఏర్పడకుండా నివారించి, తక్కువ కూలీ ఖర్చుతో, అధిక దిగుబడి పొందే అవకాశం కలుగుతుందని అ న్నారు.అంతేకాకుండా ఈ ఏఐ యా ప్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ముందస్తు సమాచారం,సమస్యను గుర్తించ డం, సమస్య చోటులోనే స్ప్రే చే యడం, వాతావరణ హెచ్చరికలు, నేల మరియు ఆకు తేమ సమాచా రం, ఆయిల్ పామ్ (Oil Palm) లో ప్రతి చెట్టుకు రియల్ టైం సమాచా రం ఇస్తుందన్నారు.
ఈ యాప్ ద్వారా 60 కు పైగా పం టలను (పత్తి, మొక్క జొన్న, వరి, మిరప, కూరగాయలు, ఆయిల్ పా మ్ మరియు ఇంకా ఎన్నో రకమైన పంటలు) పరీక్షించించే విధంగా అవ కాశం ఉంది. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ మరియు కృషి వికాస్ వెబ్ సైట్లో అందుబాటులో ఉందని సంస్థ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు.