Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterDamodarRajaNarasimha : గడప గడపకూ వర్గీకరణ ఫలాలు

--ఎస్సీ ఎమ్మెల్యేలు, నాయకులదే ఆ బాధ్యత --అసమానతలు రూపుమాపేందుకే, ఎవరికీ వ్యతిరేకం కాదు --మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, నాయకులకు మంత్రి దామో దర రాజనర్సింహ దిశానిర్దేశం

గడప గడపకూ వర్గీకరణ ఫలాలు

–ఎస్సీ ఎమ్మెల్యేలు, నాయకులదే ఆ బాధ్యత
–అసమానతలు రూపుమాపేందుకే, ఎవరికీ వ్యతిరేకం కాదు
–మాదిగ సామాజికవర్గ ఎమ్మెల్యేలు, నాయకులకు మంత్రి దామో దర రాజనర్సింహ దిశానిర్దేశం

MinisterDamodarRajaNarasimha:  ప్రజా దీవెన, హైద రాబాద్: అణి చివేయబడిన కులాల్లోని అసమానతలను రూపు మా పేందుకే వర్గీకరణ అని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ అన్నారు. వర్గీక రణ అనేది ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాద న్నారు. ఇదే విష యాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి గడపకూ వర్గీకరణ ఫలాలను తీసుకెళ్లే బాధ్యతను ఎమ్మె ల్యేలు తీ సుకో వా లని మంత్రి సూచించారు.ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, లక్ష్మి కాంత రావు, అడ్లూరి ల క్ష్మణ్, మందుల సామెల్, వేముల వీరేశం, కవ్వం పల్లి సత్యనారాయ ణ, కాలెయాదయ్య, మాజీ ఎమ్మెల్సీ రాజే శ్వర రావు తదితరులు బు ధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ లో మంత్రి దామోదర రాజ నర్సింహా (MinisterDamodar Ra jaNarasimha)తో భేటీ అయ్యారు.

దశా బ్దాల ఎస్సీ వర్గీకరణ ఆకాంక్షను నెరవేరుస్తున్న సందర్భంగా మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు. వర్గీక రణను ముందుకు తీసుకెళ్లే అంశం పై మంత్రితో వారు చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మం త్రి వారికి దిశానిర్దేశం చేశారు. వర్గీక రణలో అవలంభించిన శాస్త్రీయ పద్ధతులను ప్రజలకు వివరంగా చెప్పాల న్నారు. ఇతరులు సృష్టించే అపోహలను, అనుమాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యేలది, మా దిగ సామాజిక వర్గ నాయకులదేనన్నారు.

వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ మద్దతుగా నిలిచిం దని మంత్రి గుర్తు చేశారు. 2005 లో అసెంబ్లీలో వర్గీకరణకు అను కూ లంగా వైఎస్‌ఆర్ తీర్మానం చే శారు. ఈ తీర్మానం ఆధారంగా 200 6లో నాటి యూపీఏ ప్రభు త్వం జస్టీస్ ఉషా మెహ్ర కమిషన్ వేసిం దన్నారు. 2006లో దవిందర్ సింగ్ వేసిన కేసులో, వర్గీకరణకు అనుకూలంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన వాదనను వినిపించిందన్నా రు. 2018లో రాహుల్ గాంధీ వర్గీకర ణకు అనుకూలంగా ఉన్నా మని, హైదరాబాద్‌లో జరిగిన ఎడిటర్ మీట్‌లో చెప్పారన్నారు.

2023లో చేవెళ్లలో జరిగిన ఎస్సీ డిక్లరేషన్‌ సభలో, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేగారే స్వయంగా వర్గీకరణకు అనుకూ లంగా ప్రకటన చేశారని తెలిపారు. 2023 డిసెం బర్‌‌లో అధికారం లోకి వచ్చిన వెం టనే, సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు సీని యర్ అడ్వకేట్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి నియమిం చారన్నారు. 2006 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో, 2024 ఆగస్ట్‌ ఒకటిన తీర్పు వచ్చిం దని, తీర్పు వచ్చిన గంట లోపలే వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్‌రెడ్డిగారు ప్రకటన చేశారని మంత్రి దామోదర గుర్తు చేశారు.

ఆ వెంటనే కేబినెట్ సబ్ కమిటీని నియమించారని, ఆ తర్వాత వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను నియమించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా, జనాభా, విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, సా మాజిక స్థితిగతులను కమిషన్ అధ్యయనం చేసిందన్నారు. ఉ మ్మడి పది జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్య టించి ప్రజల నుంచి, ఆయా సామా జిక వర్గాల సంఘాల నుంచి రిప్ర జంటేషన్లను తీసుకున్నద న్నారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో సుమారు 8 వేలకుపైగా వినతులను తీసుకుని, వాటిని క్రోడీకరించిందన్నారు.

అన్నిరకాల విశ్లేషణ, అధ్యయనం తర్వాత శాస్త్రీయంగా రూపొందిం చిన రిపోర్ట్‌ను అందించిందన్నారు. కమిషన్ రిపోర్ట్‌ ఇచ్చిన మరునా డే అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణకు అనుకూలంగా తీ ర్మానం చేశారని మంత్రి గుర్తు చేశారు. కోర్టు తీర్పు వచ్చిన 6 నెలల్లో నే ఈ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఇది కాంగ్రెస్ కమిట్‌మెంట్‌ అని, సీ ఎం రేవంత్‌రెడ్డికి మాదిగల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శన మని ప్రజ లకు చెప్పాలని ఎమ్మెల్యేలకు మం త్రి దిశానిర్దేశం చేశా రు. ప్రతి కులానికి న్యాయం చేసేలా వర్గీకరణ ఉందని మంత్రి తెలి పారు. అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్‌ వన్‌లో, మద్య స్తంగా ఉన్న 18 కు లాలను గ్రూప్‌2లో, కొంత మెరుగ్గా ఉన్న కులాల ను గ్రూప్‌3లో చేర్చాల ని కమిషన్ సూచించిందన్నారు.

కమిషన్ సూచించినట్టుగా అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా వర్గీకరణ జరుగుతోందన్నారు. మా దిగ, మాదిగ సామాజిక వర్గాల దశాబ్దాల ఆకాంక్ష నెరవేరుతున్న ఈ తరుణాన్ని పండుగలా జరుపు కోవాలన్నారు. వర్గీకరణ విజయో త్సవాల్లో అందరూ పాల్గొనేలా చ ర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి సూచించారు. సమావేశం లో ప్రొఫెసర్ మల్లేశం, టీపీసీసీ నాయ కుడు విజయ్‌కుమార్ తదిత రులు పాల్గొన్నారు.