Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterKomatireddyvenkatreddy : మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, పెద్దగట్టుజాతరకు ఘాట్ రోడ్డు

మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్య, పెద్దగట్టుజాతరకు ఘాట్ రోడ్డు

MinisterKomatireddyvenkatreddy : ప్రజా దీవెన, సూర్యాపేట: తెలంగాణలో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాత రగా పేరుగాం చిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు త్వరలో రూ. 60 కోట్లతో దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌజులు నిర్మి స్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్ర కటన చేశారు. మేడారం జారత తర్వాత అతిపెద్ద రెండో జాతర పెద్ద గట్టు కు దాదాపు 40 లక్షల మంది దర్శించుకుంటారని తెలిపారు. బుధవారం ఆయన సూర్యాపేట జిల్లా దురాజ్ పల్లి పెద్ద గట్టు జాత రను సoదర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పదేండ్ల తర్వాత తెలంగాణలో ప్రజా ప్రభుత్వం వ చ్చిందని, పేదవాండ్లకు ఇళ్లు కట్టించే శక్తిని ప్రసాదిం చాలని వేడుకుంటున్నానని తెలిపారు.

పదేండ్లు కుటుంబ పాలనతో తెలంగాణ దోపిడికి గురైందన్నారు. గత ప్రభు త్వ విఫల పరిపాలన కారణంగానే నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్ర జలు ఒక్కో చోట 50, 60 వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలి పించారని గుర్తు చేశారు. తెలంగాణలో సకాలంలో వర్షాలు కురిసి పాడి పం టలతో, రైతులు, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాల ని లింగమం తుల స్వామి, చౌడమ్మ తల్లిని కోరు కోవడం జరిగింద న్నారు. ఎస్ఎల్ బిసి, బ్రహ్మణవెల్లంల, శ్రీరాంసాగర్ కాలువలు కూడా తీయకుండా సూర్యపేటకు నీళ్లు ఇయ్యలేదని ఆరోపించారు.

ఇక గంధమల్ల ప్రాజె క్టు పూర్తి చేయడం విఫలమై ఆలేరును ఎండబె ట్టారని ధ్వజ మెత్తా రు. ప్రతిష్టాత్మకమైన దురాజ్ పల్లి పెద్దగట్టు జాత ర కు రూ. 60 కోట్ల ఖర్చైనా, ఘాట్ రోడ్డు, గెస్ట్ హౌజు లతో పాటు జాతర సమయంలో భక్తులు ఇబ్బందులు పడకుండా బాత్ రూం లు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. సాధారణ సమ యం లోనూ వేలాదిగా భ క్తులు తరలివచ్చే మహిమాన్విత జాతర పెద్దగ ట్టు జాతర అని పేర్కొన్నారు. పదేండ్లు కల్వకుంట్ల కవిత కుటుంబం అధికారంలో ఉన్నప్పు డు ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ లో కాకుం డా దురాజ్ పల్లిలో ఎందుకు బోనమెత్తలేదని ప్రశ్నించారు.

అధికారం పోయినంక దురాజ్ పల్లి గుర్తుకు వచ్చిందా అని అడిగా రు. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి త్యా గాన్ని చూసి అనాటి ముఖ్య మంత్రి రాజశేఖర్ రెడ్డి తుంగతుర్తికి, సూ ర్యాపేటకు నీళ్లు వచ్చేలా చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీరు లేకుండా, కేవలం మా పాత ప్రాజెక్టులతోనే రికార్డుస్థాయిలో 1 కోటి 52 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించామున్నారు. 70 శాతం వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానిదని వివ రించారు.

బీఆర్ఎస్ పార్టీ మంచి చేసుంటే 11 సీట్లల్లో డిపాజిట్లు పోయేంత దారుణంగా ఎందుకు ఓడిపోయా రని అడిగారు.రెండు పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్లు పోయినయి, ఒక సీటు అయితే దక్షిణ భారతదే శంలోనే అత్యంత భారీ మెజార్టీతో గెలిచామని తెలిపారు. జగదీష్ రెడ్డికి ప్రజల్ని చూసే ఓపిక లేదు, ఆయనకు డబ్బు సంపాదన తప్పా మరో యావలేదని దుయ్యబట్టారు.లక్ష రుణమాఫీని 5సార్లు చేసినో ళ్ళు రైతుల గురించి మాట్లాడటం సిగ్గచేటన్నారు.

జగన్ కు ప్రగతి భవన్ లో విందుభోజనం ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ము చ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలకు తెలంగాణ నీళ్లను కానుకగా ఇచ్చిం డని ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి 88 వేల క్యూసెక్కుల నీళ్లను తీసుకుపోయేందుకు జగన్ తో కలిసి మిలాఖత్ అయ్యింది కేసిఆర్ కాదా అని ప్రశ్నించారు. జగన్ కు బిర్యానీ పెట్టి శ్రీశైలం, సాగర్ ను ఎండబెట్టిందే కేసిఆర్ అని విమ ర్శించారు. జగన్ కు అమ్ముడు పోక పోతే మీరు ఎందుకు ఓడిపోతారని ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించారు.

నల్లగొండ ను బంగారు కొండను చేసే టన్నెల్ బోరింగ్ మిషన్ కోసం ముఖ్యమంత్రి నన్ను అమెరికాకు పంపించారని గుర్తు చేశారు. కేసి ఆర్ ది దొంగ దీక్ష నేను నల్లగొండ సెంటర్ లో గడియారం సెంటర్ లో నిరహార దీక్ష చేస్తే చనిపోతానని ఆనాటి ప్రభుత్వం భయపడి నన్ను అరెస్ట్ చేసిందని వివరించారు. కేసిఆర్ ఎలక్షన్ పేరుతో, బై ఎలక్ష న్, కలెక్షన్ చేసిండ్రు తప్పితే నిజాయితీగా ఏనాడు తెలంగాణ కోసం కొ ట్లాడలేదని ధ్వజమెత్తారు. సోని యాగాంధీ త్యాగం, తెలంగాణ కాం గ్రెస్ నాయకుల పోరాటంతో తెలం గాణ వచ్చిందన్నారు. కేసిఆర్ కు నిజాయితీ ఉంటే ఎవరిది నిజమైన దీక్షో బహిరంగంగా చెప్పాలని డి మాండ్ చేశారు.

చేప పిల్లలు, మేక పిల్లలు ఇచ్చి సంక్షేమమని ప్రజల్ని నమ్మించి కేసి ఆర్ మాత్రం ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకున్నడని తీవ్ర స్థాయి లో విమర్శలు గుప్పిం చారు. కేసిఆర్ విద్యను, నిరుద్యో గులను మో సం చేస్తే మేం వచ్చి ఉద్యోగాలు నింపుతున్నామని, స్కిల్ సెంటర్స్ పెడుతున్నామని వివరిం చారు.ఇవ్వాల కాంగ్రెస్ పాల నను మెచ్చి దావోస్ లో రూ. 1 లక్ష 72 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని అ న్నారు. అరిచి గీ పెట్టినా బి ఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల ను పట్టించుకోమని కొట్టిపారేశారు.

మేం ఉద్యమం చేస్తున్నన్న నాడు అమెరికాలో ఉన్న చిన్నపిల గాడు కేటీఆర్ అని, కాంగ్రెస్ పార్టీ అందరిని కలుపుకోనిపోయే సెక్యూ లర్ పార్టీ అని, కులాలు, మతాల పేరుతో విడగొట్టే పార్టీ కాదని పేర్కొ న్నారు. బీసీ అధ్యక్షున్ని తీసేసిన బీ జేపీ నాయకులు బీసీల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నా రు. పండుగల మీద విమర్శలకు స మాధానమిస్తూ దురాజ్ పల్లి జాత రకు హాలిడే ఇచ్చామని, రంజా న్ కు కూడా ఇస్తామని తెలిపారు.

తెలంగాణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా నష్టపోయినప్పటికి శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రా న్ని ప్రకటించేందుకు ముందుకొ చ్చిం దని గుర్తు చేశారు. మాకు లింగ మంతులస్వామి, తెలంగాణ ప్రజల ది ఆశీర్వాదం ఉందన్నారు. తెలం గాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజ లు గుండెల్లో పెట్టుకుంటరని ఆశా భావం వ్యక్తం చేశారు.తెలంగాణలో ఇరవై యేండ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రాష్ట్ర పర్యాటక అభి వృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు సర్వోతం రెడ్డి, వేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.