మంత్రి కోమటిరెడ్డి అల్టిమేటం, మిల్లర్లు ఆ పని చేస్తే కఠిన చర్యలు
Ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన నల్ల గొండ: ధాన్యం కొనుగోలులో నల్గొండ జిల్లా ను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామని రాష్ట్ర రోడ్లు, భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సోమవారం అయన నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాలభా వి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహ కార సంఘం ఆధ్వర్యంలో ఏర్పా టుచేసిన రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంత రం రైతులను ఉద్దేశించి మంత్రి మా ట్లాడుతూ రైతులు రబీ ధాన్యాన్ని శుభ్రం చేసి, ఆరబెట్టి తేమను పరీ క్షించుకొని ధాన్యం కొను గోలు కేంద్రా లకు తీసుకురావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసింద ని, అంతేకాక సన్నధా న్యం పండిం చిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నదని, దీనిని సద్వినియోగం చేసుకోవాల ని కోరారు. ధాన్యం సేకరణ, కొను గోలులో రైతులు, పిఎసిఎస్ లు, ఐకెపి కేంద్రాలు ప్రభుత్వానికి సహ కారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రబి లో జిల్లాలో 375 కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేయను న్నామని అవసరమైతే ధాన్యం రాక ను బట్టి కొనుగోలు కేంద్రాలను పెం చుతామన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని సౌక ర్యాలు ఏర్పాటు చేయాలని, ప్రత్యే కించి ఎండాకాలాన్ని దృష్టిలో ఉం చుకొని తాగునీరు ,ఓఆర్ఎస్ పాకె ట్లు ఏర్పాటు చేయా లని, తాటి మ ట్టలతో నీడను ఏర్పాటు చేయాల న్నారు. మిల్లర్లు న్యాయంగా వ్యా పారం చేయాలని, తప్పులు చేయ వద్దని, తేమ పేరుతో అనవసరంగా రైతులను ఇబ్బందులు చేయవద్ద ని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం సన్నబి య్యానికి ప్రోత్సాహం ఇవ్వ డంలో భాగంగా 500 రూపాయలు బోనస్ ఇస్తున్నదని, ఉగాది నుండి ఉమ్మడి న ల్గొండ జిల్లా హుజూర్నగర్ నుండి రేషన్ కార్డుదారులకు సన్న బి య్యాన్ని ఇచ్చే కార్యక్రమా న్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించ ను న్నారని, గతంలో ధాన్యం రీసై కిలింగ్ అయ్యే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఏ ఎం ఆర్ పి ఉద య సముద్రం ద్వారా సాగు నీరు అందించామని, దీనివల్ల ఈ సంవ త్సరం లక్ష ఎకరాల ఆయకట్టు పెరి గిందని, ఎల్లారెడ్డిగూడెం వరకు సా గునీరు అందిస్తున్నామని, శ్రీశైలం హైడెల్ ప్రాజెక్టు ద్వారా ఏఎమ్ఆర్పి నుండి నీరు తీసుకురాను న్నామని ఆయన తెలిపారు.
బ్రాహ్మణ వెల్లే ముల పూర్తి చేయడం ద్వారా మర్రి గూడెం చెరువుకు నీళ్లు ఇస్తామని, కాలువల ద్వారా నీరు అందించేం దుకు భూసేకరణ పూర్తి చేయడం జరిగిందని, బ్రాహ్మణ వెల్లేముల ద్వారా కట్టంగూరు, నార్కెట్ పల్లి, మునుగోడులో రానున్న మూడు, నాలుగు నెలల్లో కా లువలు పూర్త యితే లక్ష ఎకరాలకు నీరు రానుందని తెలిపారు. ఎ స్ఎల్బీసీ సొరం గం పనులను పూర్తి చేస్తామని, ప్రభుత్వం రైతుల కు అండగా నిలు స్తుందని ఆయన చెప్పారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి మాట్లాడుతూ రైతులు నాణ్యత ప్రమాణా లతో కూడిన ధాన్యా న్ని కొనుగోలు కేంద్రా లకు తీసుకురావాలని, వ్య వసాయ విస్తరణ అధికారులు ధాన్యాన్ని దృవీకరించాలని ,దొడ్డు ,సన్న దాన్యాన్ని వేరువేరుగా నింపాలని, ధాన్యం కొనుగోలుకు ప్ల యింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని ,ఈ స్క్వాడ్స్ ఎప్పుడు అందు బాటులో ఉండాలని తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి రెండు సీజన్లకు సాగునీరు అందిం చడం వలన లక్ష ఎకరాలయకట్టు పెరిగిందని, ధాన్యం రాకను బట్టి అవసరమైతే కోనుగోలు కేంద్రాలు పెంచుతామన్నారు.
గత సంవ త్సరం సన్న బియ్యం 45 వేల మె ట్రిక్ టన్నుల దాన్యం పండించిన రై తులకు 22 కోట్ల రూపాయల బోన స్ చెల్లించడం జరిగిందని, వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువమంది సన్న ధాన్యం పండించడంపై దృష్టి సారించాలన్నారు.డి సి సి బి చైర్మ న్ కుంభం శ్రీనివాస రెడ్డి,పి ఏ సి ఎస్ చైర్మన్ నాగరత్నం రాజు, వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్,అదనపు కలెక్టర్ జె .శ్రీని వాస్, జిల్లా పౌర సరఫరా ల శాఖ అధికారి హరీష్, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి,డిసిఓ. పత్యా నాయక్, మార్కెటింగ్ ఏ డి ఛాయాదేవి , ఆర్డి ఓవై. అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.