Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterKomatireddyvenkatreddy : విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవొద్దు

--మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి --పేద విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటా -- రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలవొద్దు

–మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
–పేద విద్యార్థులకు ఎల్లవేళలా అండగా ఉంటా
— రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

MinisterKomatireddyvenkatreddy: ప్రజా దీవెన, నల్ల గొండ :  విద్యార్థులు చెడు అలవాట్లకు, సెల్ ఫోన్ కు బానిసలు కావ ద్దని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.శనివారం రాత్రి నల్లగొండ పట్టణంలోని ఎంవీఆ ర్ స్కూల్లో వార్షికోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పా ల్గొని ప్రసంగించారు.విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత శిఖ రాలను అధిరోహించాలని పేర్కొన్నారు.

చెడు అలవాట్లకు బానిసలుగా మారితే జీవితం అంధకారంగా మా రుతుందన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని తాము చదువు కున్న పాఠశాలకు, తల్లిదం డ్రులకు మంచి పేరు తీసుకురావా లన్నా రు.పేద విద్యార్థులకు తాను ఎల్లవేళలా అండగా ఉంటారని స్పష్టం చేశారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద విద్యా ర్థుల చదు వుకు ఆర్థికంగా సహా యం చేస్తూ చేయూతనందించడం జరుగుతుం దని పేర్కొన్నారు. తన కు పదవి ఉన్నా లేకపోయినా పేద లకు, పేద విద్యార్థులకు సేవచేస్తానని స్పష్టం చేశారు.

నిరుద్యోగ యు వత కోసం నల్లగొండలో స్కిల్ డెవ లప్మెంట్ కు భవ నాన్ని శంకుస్థాపన చేయడం జరిగిందని,త్వరలోనే దాన్ని ప్రారంభిం చడం జరుగుతుం దని తెలిపారు.తనను ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజక వర్గ ప్రజలకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా నలగొండను అన్ని రంగాలలో అభి వృద్ధి చేస్తానని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎంజి యూనివర్సిటీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంజి యూనివర్సి టీలో రూ.80 కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింద ని తెలిపారు.అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువచ్చి బ్రాహ్మ ణ విలయంలో ప్రాజెక్టును ప్రారంభించుకోవడం జరిగిందని అన్నా రు.

ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పాఠశాల కర స్పాండెం ట్ కొల నుపాక గీతా రవికుమార్, పాఠ శాల ఉపాధ్యాయులు, వి ద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.