MinisterKomatireddyvenkatreddy : జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు
--రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు
–రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
MinisterKomatireddyvenkatreddy: ప్రజా దీవెన, నల్ల గొండ: రాష్ట్ర మం త్రిగా రాష్ట్ర వ్యాప్తపనులతో ఎంత బిజీగా ఉన్న ప్పటికి నల్లగొండ ని యోజకవర్గ ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూ నే రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా ప్రజలను కలుసుకునేందుకు ప్రజా వాణిని నిరంతరం కొనసాగిస్తానని తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో శ్రీనగ ర్ కాలనీలోని మంత్రి క్యాంపు కా ర్యాలయంలో ప్రజావాణి కార్యక్ర మాన్ని నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీక రించి పలు సమస్య లను అక్కడికక్కడే పరిష్కరించారు.
ఆర్ధిక ఇబ్బందులతో కాలేజ్ ఫీజులు కట్టలేక, ఆసుపత్రుల్లో చికి త్స కోసం వచ్చిన అభ్యర్ధనలను మానవత్వంతో పరిష్కరించి వారి మో ముల్లో సంతోషం నింపారు. రాష్ట్ర కెబినేట్ మంత్రిగా రాష్ట్రవ్యాప్త బా ధ్యతలతో ఈ మధ్య ప్రజావా ణి కార్యక్రమం కొంత ఆలస్యం జరిగిం దన్న మంత్రి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమా నికి అధికారులను ఎవరిని పిలవలేదని పేర్కొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టు నిర్మిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డు (rrr) నిర్మాణంతో తెలంగాణ రాష్ట్ర ప్రగతి మరో మె ట్టు ఎక్కుతుందని ఆయన అన్నా రు. రీజినల్ రింగ్ రోడ్డు పనులకు ఉత్త ర భాగానికి టెండర్లు పిలిచామని, దక్షిణ భాగానికి సంబంధించి డీపీ ఆర్ కు టెండర్లు పిలవడం జరిగిందన్న మంత్రి త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
గతంలో వైయస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించ డం దానికి దగ్గర్లోనే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్, ఫైనా న్స్ డిస్ట్రిక్ట్ ఏ ర్పాటు చేయడం జరి గిందన్నారు. అదే విధంగా నగరం నుంచి శం షాబాద్ ఎయిర్ పోర్ట్ కు 13 కిలోమీటర్లు పొడవైన పీవీ నర సింహా రావు ఫ్లైఓవర్ కట్టిన తర్వాత హైదరాబాద్ కు మల్టీనేషన్ కంపెనీలు వచ్చాయని పేర్కొ న్నారు. బెంగుళూరులో ఎయిర్ ఫోర్టు నుంచి ఐటీ కంపెనీలకు వెళ్లాలంటే ట్రాఫిక్ వలన రెండు, మూడు గంటల సమ యం పడుతుంద ని తెలిపిన మంత్రి, హైదరాబాదు లో అలాంటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం టుందని స్పష్టం చేశారు.
గత ఎన్నికల ముందు కేసీఆర్ ఔటర్ రింగ్ రోడ్డును కమిషన్ కోసం అమ్ముకు న్నాడని విమర్శించారు. రూ.30 వేల కోట్లతో రీజినల్ రింగ్ రోడ్డు పనులను ప్రారంభించాల్సి ఉన్న నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తా రు. రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డుకు నడమ నిర్మిస్తున్న రేడి య ల్ రోడ్స్ తో తెలంగాణ రూపురేఖ లు మారడంతో పాటు హైదరా బాదు ట్రాఫిక్ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందని తెలిపారు. దశాబ్ధాల నల్గొండ జిల్లా సాగు, త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు శ్రీశైలం టన్నెల్ బేరింగ్ మిషన్ పనులు ప్రారంభ మ య్యాయని, అమెరికా నుంచి రాబిన్స్ బోరింగ్ కంపెనీ నుంచి వచ్చే మరో బేరింగ్ మిషన్ మద్రాసు పోర్టు వరకు వచ్చిందని తెలి పారు.
రెండు సంవత్సరాల్లో శ్రీశైలం సొరంగం మార్గం పనులను పూర్తి చేయ డం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎ స్ ప్రభుత్వ హయాంలో శ్రీశైలం టన్నెల్, బ్రాహ్మ ణ వెల్లంల ప్రాజెక్టు పనులను పూర్తి గా నిర్లక్ష్యం చేశారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్టులకు తగిన నిధు లు కేటాయించడం జరిగిందని తెలిపారు. కెసిఆర్, కేటీఆర్ లతో పాటు కొంతమంది కులగణలో పాల్గొనకపోవడంపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ రాష్ట్ర పౌరులుగా అందరూ సర్వేలో పాల్గొనాలని హితవు పలికారు.
ఐదుసార్లు తనను ఎమ్మె ల్యేగా గెలిపించిన నల్లగొండ నియోజక వర్గ ప్రజలకు తాను ఎల్లవేళల రుణపడి ఉంటానని, ఇచ్చిన హామీ ల న్నింటినీ పూర్తి చేస్తామని పేర్కొ న్నారు. నల్లగొండ సమగ్రాభివృద్దే తన ధ్యేయమని తెలిపారు. అన్ని రంగాలలో నల్లగొండలో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దామని పేర్కొన్నారు. ఇప్పటికే నల్గొండ పట్టణంతో పాటు నియోజ కవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించా మని అవన్నీ పూర్తయిన తర్వాత నల్గొండ ప్రజలకు మెరుగైన సౌక ర్యాలు అందుబాటులోకి వస్తాయ ని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్ర మంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ము ల మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్, నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్ల గొండ, తిప్పర్తి, కనగల్ మాజీ జడ్పి టిసిలు వంగూరి లక్ష్మయ్య, పాశం రామ్ రెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అ ధ్యక్షుడు గడ్డం అనుప్ రెడ్డి, డిసిసి బి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలు వురు మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పా ర్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయ కులు పాల్గొన్నారు.