నల్లగొండ జిల్లాను మాదక ద్రవ్య రహితoగా తీర్చిదిద్దాలి
–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి
Ministerkomatireddyvenkatreddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో పోలీసులు మత్తు పదార్థాల నియంత్ర ణకు పోలీసు యంత్రాంగం ఎంతో కృషి చేసిందని, జిల్లాను పూర్తిగా మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేoదుకు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవ నాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి కోరారు.నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదా నంలో 3 రోజుల పాటు నిర్వహి స్తున్న వార్షిక క్రీడలు, గేమ్స్ పోటీల ముగింపు సమా వేశం శనివారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ సమా జంలో ప్రతి మనిషి జీవితం లో క్రీడ లు చాలా ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసు లకు శారీరక ధారుఢ్యాన్ని పెంపొందింప జేసుకోవడంలో క్రీడలు ఎం తగానో ఉపయోగపడతాయని చెప్పారు. అందరికీ 24 గంటలు సేవ చేసే పోలీసులకు క్రీడా పోటీలు నిర్వ హించడం సంతోషమని అన్నా రు. పోలీసుల కొత్త క్వార్టర్ల నిర్మాణా నికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మా ట్లాడి వెంటనే మంజూరు చేయిస్తామని తెలిపారు.
మత్తుప దార్థాల కారణంగా యువత పక్కదారి పడుతున్నారని, అలా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలి పా రు. అలాగే జిల్లాను ప్రశాంతంగా ఉంచడంలోనూ రానున్న రం జాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదర భావంతో కలి సిమెలిసి జరుపుకోవడంలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలని, పోలీసు లు ఎల్లప్పుడూ శాంతిభద్ర తలను కాపాడాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ రెవెన్యూ ,పోలీస్ క్రీడ పోటీ లను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. పోలీసుల కు క్రీడా స్ఫూర్తి చాలా అవసరం అని అన్నారు. క్రీడల్లో గెలుపోటము లు సహజమైనప్పటికీ క్రీడల ద్వారా అనేక అంశాలను నేర్చుకోవచ్చ ని, విజయం కంటే కృషి గొప్పదని అన్నారు.
జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ వార్షిక క్రీడలు, గే మ్స్ పోటీల సందర్భంగా సుమారు 600 మంది పోలీసులు పాల్గొ న్నారని తెలిపారు. నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ తో పాటు, అన్ని డివిజన్ల పోలీసులు ఈ క్రీడల్లో పాల్గొన్నారని తెలిపారు.రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన పోలీస్ లు జిల్లా పోలీసులలో ఉన్నా రన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో సిసి రోడ్లతో పాటు, డార్మెటరీ గదుల మరమ్మతుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన వెంటనే సహాయం చేసినందుకు ఆయనకు ప్రత్యే కంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ క్రీడలలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాగా మూడు రోజుల పాటు నిర్వహిం చిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆర్ అండ్ డి శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు బహుమతులను అం దజేశారు.