MinisterMalluBhattiVikramarka : సామాజిక న్యాయం, సమానత్వసమగ్రతలకు కేంద్రం తెలంగాణ
-- తెలంగాణ రాష్ట్రం నగర రాజ్యం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది --రాష్ట్ర ప్రభుత్వం, పరిశ్రమలు, పా రిశ్రామికవేత్తలు ఒక కుటుంబం --తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామo --సిఐఐ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
MinisterMalluBhattiVikramarka: ప్రజాదీవెన, హైద రాబాద్: తెలంగాణ రాష్ట్రం ఒక నగర రాజ్యం, రాష్ట్రంలో పట్టణాల సంఖ్య గణనీయంగా ఉందని, ఆధునికత అభ్యు దయానికి కేంద్రం గా రాష్ట్రం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతోoదని డి ప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు ఫలితాలను మనం చూసాం, సీఎం రేవంత్ రెడ్డి నాయక త్వంలో ని ప్రజా ప్రభుత్వం రీజినల్ రింగ్ రో డ్డును ప్రతిష్టాత్మకంగా నిర్మి స్తుం దని వివరించారు. రీజనల్ రిం గ్ రోడ్డు నిర్మాణంతో ఫార్మా, ఐటీ కంపెనీల తో పాటు హౌసింగ్, అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్ వంటి అనేక రకాల పారిశ్రామిక క్లస్టర్ల నిర్మాణం జరుగు తుందని తెలిపారు. బుధవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ ప్రై వేటు హోటల్లో కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజ రయ్యారు.
హైదరాబాద్ కు ప్రపంచం నలు మూలల నుంచి పెట్టుబడులు తర లివస్తున్నాయని తెలిపారు. లండ న్ లోనీ THEMS నది మాది రిగా హైదరాబాద్ నగరం లో మూసి నదిని పారించేందుకు మూసి పునర్జీవనం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిం దని తెలిపారు. పెట్టుబడులకు హై దరాబాద్ పట్టణం, తెలంగాణ రా ష్ట్రం స్వర్గ ధామం లాంటిదని వివ రించారు.తెలంగాణ రాష్ట్రంలో నై పుణ్యం ఉన్న కార్మికులు ఇతర రా ష్ట్రాలతో పోలిస్తే తక్కువ ధర కు లభిస్తారు, చక్కటి వాతావరణం, కాలుష్య రహితం, 24 గంట లు నాణ్యమైన విద్యుత్ సరఫరా వంటి అనేక అంశాలు పెట్టుబ డులను ఆకర్షిస్తున్నాయని ఆయన తెలిపారు.
నైపుణ్యం ఉన్న మానవ వనరుల ను సృష్టించడమే లక్ష్యంగా రా ష్ట్రంలోని 100 ఐటిఐ లను అడ్వాన్స్ టె క్నాలజీ సెంటర్లుగా మా ర్చామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాదులో హైదరాబాద్, సికిం ద్రాబాద్, సైబరా బాద్ మూడు సిటీలు ఉన్నాయి త్వరలో ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ గా అందుబాటులోకి రాబోతుందని తెలిపారు. ఫ్యూ చర్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో పారి శ్రామికవేత్తలు కీలకం రాష్ట్ర అభివృద్ధికి, ఉపాధి కల్పన, సంపద సృ ష్టికి పారిశ్రామికవేత్తల సలహాలు సూచనలు స్వీకరించి అమలు చే సేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను తమ కుటుంబ స భ్యులుగా పరిగణిస్తుంది, కలిసి సా గుదాం రాష్ట్రంలో మార్పుకు శ్రీ కారం చూడదామని డిప్యూటీ సీఎం తెలి పారు. పారిశ్రామికవేత్తలు CSR ని ధులను పాఠశాలలు, నాలెడ్జ్ సెంట ర్ల కోసమే కాకుండా రైతులు, మహి ళల ప్రగతి కోసం కూడా ఖర్చు చే యాలని డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క సూచించారు. మారుతున్న ప్రపంచంలో ఫై నాన్స్ రంగం కేవలం లెక్కల పరిరక్షణకే పరిమితం కాలే దు, CFO లు ఇప్పుడు సంస్థల దశ ను నిర్దేశించే మార్గదర్శకులు అని ఇ ప్పు డు సీఎం తెలిపారు. CFO లు వ్యూహకర్తలుగా, సాంకేతిక నిపు ణులుగా ప్రమాదాల నిర్వహణలో శిల్పులుగా మారాలని డిప్యూటీ సీఎం సూచించారు. సాంకేతిక యు గంలో ఆర్టిఫిషియల్ ఇంట లిజె న్స్, అనలి టిక్స్, ఆటోమేషన్ ఇవన్నీ గొ ప్పల కోసం చెప్పుకునే మా టలు కాదు నిర్ణయాలు తీసుకునే విధానాన్ని ఇవి మార్చి వేస్తున్నా యని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ ట్రా న్స్ఫర్మేషన్ వల్ల ఎన్నో రంగాల్లో సా మర్థ్యం పెరిగిన దాఖలాలు మనకు ఉన్నాయి అన్నారు. లైఫ్ సైన్స్ నుం చి మొదలు పెడితే లాజిస్టిక్స్, మ్యా నుఫ్యాక్చరింగ్ నుంచి పరిపాలన వరకు సామర్థ్యం పెరిగిందని తెలి పారు. CFO లు ఆర్థిక నాయకులు గా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓడి సిప ట్టాలి, కేవలం ఆపరేషన్ సా మర్థ్యం కోసం కాకుండా బలమైన వ్యూ హాత్మక నిర్ణయాల కోసం టెక్నా లజీ పై పట్టు సాధించాలని సూచిం చారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ త రహా ఆశయాలకు అనువైన వా తావరణం ఉన్నది, ప్రగతిశీల విధానాలు, మంచి మౌలిక సదుపా యాలు, నవ ఆవిష్కరణల పట్ల స్ఫూర్తి, లైఫ్ సైన్సెస్, గ్రీన్ పవర్, పరిశ్రమల పెట్టు బడులకు తెలంగాణ ఒక ఆకర్షణీ య గమ్యంగా మార్చాయని తెలి పారు. అయితే అభివృద్ధిని కేవలం ఆర్థిక ఉత్ప త్తిలోనే కొలవలేము, దాని ప్రయోజనాలు ఎంత మేరకు అం దరికీ చేరుతున్నాయో కూడా చూడాలన్నారు.
సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్రతలు ప్రజా ప్రభుత్వ పా లనలో కేంద్ర బిందువులు అని తెలిపారు. ఈ దృష్టితోనే రాష్ట్రంలో ఎన్నో కీలక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. అన్ని వర్గాల విద్యా ర్థులకు సమానమైన, నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంటర్నేష నల్ స్టాండర్డ్స్ తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసి డెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం అన్నారు. ఒక్కో పాఠ శాలను 25 ఎకరాల్లో 200 కోట్లు వె చ్చించి నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒ కేసారి 100 పాఠశాలలు నిర్మిం చేం దుకు కార్యాచరణ ప్రారంభించా మ ని డిప్యూటీ సీఎం తెలిపారు. నిరు ద్యోగ యువతలో ప్రతిభను పెం పొందించేందుకు స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలుగా అంబే ద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కల ముందు హామీ ఇచ్చినట్టుగా అధికారం లోకి వచ్చిన మూడు నెలల్లోనే రెం డు లక్షల వరకు రైతు రుణమాఫీ కింద 21 వేల కోట్లు రాష్ట్ర ప్రభు త్వం రైతుల పక్షాన బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించిం దని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరు లను చేయాలని లక్ష్యంతో ప్రతి సం వత్సరం 20 వేల కోట్ల వడ్డీ లేని రు ణాలు స్వయం సహాయక సంఘాల మహిళలకు అందించాలని నిర్ణయించి మొదటి సంవత్స రంలో 21,500 కోట్లు వడ్డీ లేని రుణాలు ఈ రాష్ట్రంలో పంపిణీ చేశామని డిప్యూటీ సీఎం వివరించారు. మన ఆ ర్థిక వ్యవస్థ బలప డాలంటే రాష్ట్ర ప్ర జల బలం పెరగాలి, సామాజిక న్యా యం, ఆర్థిక అభివృద్ధి రెండు జోడె డ్ల మాదిరిగా పరుగులు పెట్టాలన్న దే ఈ ప థకాల వెనుక రాష్ట్ర ప్రభు త్వ ఆలోచన అని డిప్యూటీ సీఎం వివ రించారు. ప్రజా ప్రభుత్వం లో పారిశ్రామిక రంగం భాగస్వామిగా ఉండాలని, రాష్ట్ర ప్రజల విజయ గాధల్లో పారిశ్రామికవేత్తలు భాగ స్వాములు కావాలని పిలుపు నిచ్చారు.
CII సదస్సు ద్వారా జరిపే చర్చలు భవిష్యత్తు కార్యాచరణలో వెలు గులు చూపుతాయన్న విశ్వాసం తనకు ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి పనిచేస్తే మార్కెట్ అనిశ్ఛితి మనకు అడ్డు కూడా కాదు ఆ అనిచ్చితే కొత్త ఆ విష్కరణలకు, సుస్థిర ఆర్థిక వ్య వస్థకు, పంచుకోదగిన అభివృద్ధికి మార్గం చూపుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపా రు. ఈ కార్యక్రమంలో CII ని ర్వాహకులు శేఖర్ రెడ్డి, శివ ప్రసాద్ రెడ్డి, బి.వి.ఆర్ మోహన్ రెడ్డి, ఎంవి నర సింహం, గౌతమ్ రెడ్డి, సమీ యుద్దీ న్ తదితరులు పా ల్గొన్నారు.