Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కీలక వ్యాఖ్య, చదువుతోనే అభ్యున్నతి, అందుకే విద్యార్థులు మంచిగా చదువుకోవాలి 

 

Minister Komatireddy Venkat Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: మంచివి ద్యనందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమ టిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. గురు వారం ఆయన నల్గొం డ జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల స మీపంలో 40కోట్ల రూపాయల వ్య యంతో నిర్మించనున్న ప్రభుత్వ న ర్సింగ్ కళాశాల భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.

 

చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, అందువల్ల విద్యార్థులు బాగా చదు వుకోవాలని అన్నారు. ప్రస్తుతం మ హిళా ప్రాంగణంలో నిర్వహిస్తున్న న ర్సింగ్ కళాశాలలో రెండు రోజుల్లో తా గునీటి ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ,నెల రోజుల్లో ప్రతీక్ ఫౌం డేషన్ సహకారంతో బాత్రూంలు, ఇ తర సౌకర్యాలన్నీ కల్పిస్తామని తెలి పారు.

 

కేరళలో 99.9% అక్షరాస్యత ఉండ గా, మన రాష్ట్రంలో 60 శాతం ఉం దని , విద్య, నైపుణ్యాలు పెంపొం దింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీతో పాటు, అ న్ని రకాల విద్యా సదుపాయాలు క ల్పిస్తున్నదని అన్నారు. నర్సింగ్ వి ద్యార్థులు చదువు పైన దృష్టి సారిం చాలని, సెల్ ఫోన్ జోలికి వెళ్ళవద్ద ని, ప్రజలకు మంచి సేవలు అందిం చాలని, సమయాన్ని వృధా చేసుకో వద్దని అన్నారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ వైద్య కళాశాల వి ద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పా టు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

 

ఈ నెల 4 న ప్రభుత్వ వైద్య కళా శాల పక్కనే 150 కోట్ల రూపాయల తో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కళా శాల పనులకు భూమి పూజ చేయ నున్నట్లు మంత్రి వెల్లడించారు. అ నంతరం మంత్రి మీడియా ప్రతిని ధులతో మాట్లాడుతూ ప్రజాప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వా త విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిం చిందని, ముఖ్యంగా 20 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశా లలు నిర్మించనున్నదని తెలిపారు.

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చాక మహాత్మా గాంధీ విశ్వవిద్యా లయంలో 100 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించామని, ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తు న్నామని, ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి ఎల్ఎల్ఎం, ఎం ఫార్మసీ, కో ర్సులు,భవనాలు మంజూరు చేశా రని ,2026-27 సంవత్సరంలో అ డ్మిషన్లు సైతం ప్రారంభం కానున్నా యని, లా, ఫార్మసీకి మంచి డిమాం డ్ ఉందని అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో విద్యాభివృద్ధికి ఎలాంటి కృషి చేయలేదని అంతే కాక గత ప్రభుత్వం తొమ్మిది వేల కో ట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెం ట్ బకాయిలు పెట్టినప్పటికీ గత ప్ర భుత్వం చేసిన అప్పులకు ప్రతినెల 6000 కోట్ల వడ్డీ చెల్లిస్తున్నప్పటికీ మంచి విద్యను అందించాలన్న ఉద్దే శంతోనే ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టికి కేంద్రీకరించినట్లు తెలిపారు.

 

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ నర్సింగ్ కోర్స్ చాలా ఉత్త మమైనదని, వైద్యరంగంలో నర్సిం గ్ అనేది మొదటి అదుగు అని అ న్నారు. రోగులు ముందుగా స్టాఫ్ న ర్స్ ని సంప్రదిస్తారని, డాక్టర్ కన్నా స్టాఫ్ నర్స్ ముఖ్యమని, రోగి ప్రాణా లు కాపాడటంలో స్టాఫ్ నర్స్ పాత్ర ఎంతో ఉంటుందని అన్నారు. భవి ష్యత్తులో మెడికల్ టూరిజం లో అ నేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయ ని, అందువల్ల నర్సింగ్ విద్యార్థులు బాగా చదువుకోవాలని, ప్రస్తుతం నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భ వనంలో స్టాఫ్ క్వార్టర్స్ ను నిర్మిం చేందుకు చర్యలు తీసుకుంటున్న ట్లు తెలిపారు.

 

మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, జిల్లా వైద్య ఆ రోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, నర్సింగ్ క ళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి తదితరు లు ఉన్నారు.