Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MinisterUttamKumarReddy : మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన, ఆగస్టు మాసాoతానికి బెట్టేతండా ఎత్తిపోతల పధకం పూర్తి

 

MinisterUttamKumarReddy:  ప్రజా దీవెన, హుజూర్ నగర్: వచ్చే ఆగస్ట్ మాసంతానికి హుజుర్ నగర్ నియోజకవర్గం పాలకీడు మండ లంలోని బెట్టే తండా ఎత్తి పోతల ప థకాన్ని పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శా ఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నా రు.ఇది పూర్తి అయితే బెట్టే తండా,పాడే తండా, సజ్జాపురం తది తర గ్రామాలకు చెం దిన 2,041ఎకరాలు సస్యశ్యామలంగా మారు తాయని ఆయన చెప్పారు. ఆదివారం సాయంత్రం ఆయన పాలకీ డు మండలంలోని బెట్టే తండా వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పధకం తో పాటు అదే మం డలంలోని జాన్ పహాడ్ ఎత్తిపోతల పథక ని ర్మాణాలను ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నీటి లభ్యత ఉన్న ప్రతీ చోట ఎత్తిపోత ల పథకాన్ని నిర్మించి కొత్త ఆయక ట్టును సాగిలోకి తేవాలి అన్నది ప్ర భుత్వ సంకల్పంగా పెట్టుకుని ముందుకు పోతున్నామన్నారు.

అందులో భాగంగానే మూసి నీటి తో బెట్టే తండా వద్ద ఎత్తిపోతల ప థకాన్ని నిర్మిస్తున్నామన్నారు. 2,1 76 మంది రైతాంగానికి లబ్ది చేకూ ర్చనున్న ఈ ఎత్తిపోతల పథకం మీ ద ప్రభుత్వం 33.83 కోట్లు ఖర్చు పెడుతుందన్నారు.అంటే ఒక్కో ఎ కరాకు లక్షా 66 వేలు ఖర్చు పెట్టి కొత్త ఆయకట్టును సేద్యం లోకి తెస్తున్నట్లు ఆయన వివరించారు.

పైగా ఈ ఎత్తిపోతల పధకం పూర్తి అయితే లబ్దిపొందేది పెద్ద సం ఖ్య లో గిరిజన రైతులని ఆయన చె ప్పుకొచ్చారు.ఈ ఎత్తిపోతల పథ కాన్ని యుద్ద ప్రాతిపదికన పూర్తి చేసేందుకు గాను ఇప్పటికే భూసే కరణ పూర్తి చేసి భూ నిర్వాసితు లకు నగదు చెల్లించినట్లు ఆయన తెలిపారు.పనులు వేగవంతంగా పూర్తి చేసి ఆగస్టు మాసంతానికి నీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

జానపహాడ్ ఎత్తిపోతల పథ కాన్ని వేగవంతంగా పూర్తి… రూ. 270 కోట్ల వ్యయంతో నిర్మి స్తున్న జానపహాడ్ ఎత్తిపోతల పథ కాన్ని వేగవంతంగా పూర్తి చేయాల ని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్త మ్ కుమార్ రెడ్డి అధికా రులను ఆ దేశించారు.అక్కడ పనులు నత్తనడకన నడుస్తుం డడం పై ఆయన ఏజెన్సీ నిర్వాహకులపై మండిపడ్డారు.గతంలో తాను వచ్చినప్పుటికీ ఇప్పటికీ పెద్దగా మార్పు లేదని పనులు ఇలాగా కొన సాగితే ఊ రుకునేది లేదంటూ ఆయన హెచ్చ రించారు. ఆదివారం సాయంత్రం ఆయన జానపహాడ్ ఎత్తిపోతల పథకం నిర్మాణాపు పురోగతి పను లను ఆయన పరిశీలించారు.

ఈ ప్రాజెక్టు పూర్తి కోసం త్వరిత గ తిన పూర్తి చేయడం కోసం ఇప్ప టికే భూసేకరణ పూర్తి చేశామని ఇది పూర్తి అయితే పాలకీడు, జా నప హాడ్,బొత్తలపాలెం,కోమటికుంటా,గుండెబోయిన గూడెం, ఆలింగాపు రం,బొత్తలపాలెం,మేఘనా పహాడ్ తండా,చెరువు తం డా,రాఘ వపు రం,ఎల్లాపురం,సజ్జాపురం,నాగిరెడ్డి గూడెం, హను మంతగూడెం తది తర గ్రామాలకు లబ్ది చేకూరనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.