దుబ్బాక లో మైనర్ ల బలవర్మరణం
ప్రజా దీవెన/సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో హృదయ విధారక సంఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిధిలో ని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో మైనర్ ప్రేమజంట ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
లచ్చపేటకు చెందిన కూరపాటి భగీరథ(17), అదే గ్రామానికి చెందిన తోట్ల నేహా(16) దుబ్బాకలో ఇంటర్మీడియట్
చదువుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఒకరినొకరు ఇష్టపడుతూ ప్రేమాయణం కొనసాగించారు. ఇంట్లో వారికి తెలిస్తే విడదీస్తారనే భయంతో భగీరథ ఇంట్లోనే గత రాత్రి ఎవరూ లేని సమయంలో ఇద్దరు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ప్రేమ పేరుతో కంటికి రెప్పలా చూసుకున్న పిల్లలు ఉరి వేసుకుని విగత జీవులుగా మారడం తల్లిదండ్రులు, బంధువులను దుఃఖ సాగరంలో ముంచింది. అవగాహన చేసుకునే అనుభవం లేని మైనర్ ప్రేమికులు తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దుబ్బాక పోలీసులు మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.